Satyabhama Serial Today March 27th: వామ్మో సత్య, క్రిష్‌కి తన విశ్వరూపం చూపించేసిందిగా, శోభనం క్యాన్సిల్!
Satyabhama Serial Today Episode తన కుటుంబాన్ని క్రిష్ నుంచి కాపాడుకోవడానికే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను అని సత్య క్రిష్‌తో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode శోభనం గదిలో క్రిష్ సత్యను దగ్గరకు తీసుకొని సత్యను హగ్ చేసుకున్నట్లు ఊహించుకొని పిల్లోని హగ్ చేసుకుంటాడు. తేరుకొని ఛీ ఛీ ఇది కలా అని అనుకుంటాడు. ఇక కథలోకి మళ్లీ బాలు, మీనలు వస్తారు. మీన తన ఇంట్లో బంతి పూలు గుచ్చుకుంటూ సత్య మాటలను తలచుకొని ఆలోచిస్తుంది. ఇంతలో బాలు వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అంటాడు. క్రిష్‌తో అనవసరంగా సత్య పెళ్లి చేశావని మీన బాలుని తిడుతుంది.
బాలు: సమస్య ఏంటి అంటే క్రిష్ సత్యని ఎంత గొప్పగా లవ్ చేస్తున్నాడో మీకు తెలీదు. తెలిసుంటే వాళ్లిద్దరి పెళ్లి చేసినందుకు నన్ను మెచ్చుకునేదానివి. ఇదిగో సత్య గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. సత్య వాళ్లు మనలా గొడవ పడరు. సత్య క్రిష్ ప్రేమను అర్థం చేసుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. రాసిస్తా..
మరోవైపు సత్య భయంగానే గదిలోకి వస్తుంది. క్రిష్ సత్య దగ్గరకు వచ్చి డోర్ వేయాలని చూసేలోపు సత్యే డోర్ పెట్టేస్తుంది. ఇక సత్యను దగ్గరకు తీసుకోవాలి అని క్రిష్ చూస్తే సత్య వెళ్లి బెడ్ మీద కూర్చొంటుంది. క్రిష్ కూడా పక్కనే కూర్చొంటాడు. ఇక నిన్నటి లానే సేమ్ రిపీట్ చేస్తాడు క్రిష్. ఇక క్రిష్ సత్యకు ఏం అడిగినా సత్య చిరాకుగా సమాధానం చెప్తుంది.
క్రిష్: సత్య భార్యభర్తలు సగంసగం కాబట్టి పాలు సగం సగం తాగమంటారు. కానీ నా జీవితంలో నువ్వు సగం కాదు పూర్తి నువ్వే కాబట్టి మొత్తం పాలు నువ్వే తాగు. మనసులో.. కొంచెం పాలు ఉన్నప్పుడు నేను తీసుకోవాలి. ఇంతలో సత్య మొత్తం తాగేస్తుంది. మొత్తం పాలు తాగేశావా..
సత్య: నువ్వే కదా తాగమన్నావు.
క్రిష్: తెల్లముఖం పెట్టి. అవును అని అంటాడు. సత్య దగ్గరకు జరిగితే సత్య చిరాకు పడి లేచి అద్దం దగ్గరకు వెళ్లిపోతుంది. ఏమైంది..
సత్య: చెవి రింగ్ సర్దుకుంటూ.. కొంచెం స్క్రూ లూజ్ అయింది.
క్రిష్: ఎవరికి..
సత్య: నా చెవి జుంకాకి..
క్రిష్: బీరువాలో దాచి పెట్టిన నెక్లస్ తీసి.. భార్యకు మొదటి రాత్రి భర్త అందమైన గిఫ్ట్ ఇవ్వాలి అంట. అది జీవితాంతం గుర్తుండిపోవాలి అంట. ఏరి కోరి స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చా.. అని సత్య మెడలో క్రిష్ నెక్లస్ వేస్తూ.. నా వేలు తాకగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అయిందా. ఫస్ట్ నైట్ కదా అలాగే ఉంటుంది.
సత్య: చెయ్ తీ.. చెయ్ తీ అంటున్నా.. నీకే చెప్తున్నా చెయ్ తీ.. నీకు చెప్తుంటే వినిపించడం లేదా. అని నెక్లెస్ కిందకు విసిరి కొడుతుంది.
క్రిష్: ఏమైంది సంపంగి..
సత్య: ఏయ్ ఇంకోసారి నన్ను ముట్టుకున్నా.. ముట్టుకోవడానికి ట్రై చేసినా మర్యాదగా ఉండదు చెప్తున్నా.
క్రిష్: ఎందుకు అట్లా.. నేను నీ భర్తని నీ మెడలో నేను కట్టిన మంగళసూత్రం ఉంది. నాకు నిన్ను ముట్టుకునే హక్కు ఉంది. ఎందుకు ఇంత కోపం.
సత్య: ఈ తాళి పవిత్రమే కానీ ఈ తాళి కట్టిన వాడు అపవిత్రం. అయినా తాళి కట్టగానే పెళ్లి అయినట్లు కాదు మిస్టర్ క్రిష్. నువ్వు నా భర్తవి అయినట్లు కూడా కాదు. నాకు నువ్వు నచ్చి ఇష్టపడి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటేనే అది అసలైన వివాహ బంధం.
క్రిష్: ఇష్టపడే కదా పిలిచి మరి పెళ్లి చేసుకున్నావ్..
సత్య: ఇష్టపడి కాదు మనసు చంపుకొని. నా వాళ్లని ఏం చేస్తావని భయపడి పెళ్లి చేసుకున్నాను. నువ్వు అంటే ప్రేమ కాదు మనసు నిండా ద్వేషం ఉంది.
క్రిష్: ఏయ్.. అబద్ధం చెప్తున్నావ్. నాతో నువ్వు మజాక్ చేస్తున్నావ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ సత్య నాకు తెలుసు.
సత్య: తమాషాలు చేయడం బలం, డబ్బు, బలగం ఉన్నాయని గర్వంతో మోసం చేయడం నీకు అలవాటు నాకు కాదు. నేను ఎప్పుడూ ప్రేమించలేదు. ప్రేమించాను అని నువ్వు అనుకున్నావ్. నీకు నువ్వు డిసైడ్ చేసుకున్నావ్.
క్రిష్: ఎందుకిలా మాట్లాడుతున్నావ్ సత్య. ఎందుకు ఇలా ఎదురు తిరుగుతున్నావ్. మళ్లీ మీ వాళ్లు ఫోన్ చేశారా.. బెదిరించారా. కాపురం చేయకుండా వెనక్కి రమ్మన్నారా చెప్ప సత్య. నువ్వు భయపడకు నిజం చెప్పు వాళ్ల అంతు తేల్చుతా..
సత్య: ఏయ్ ఆపు.. ఇంకొక్కసారి మా వాళ్ల గురించి మాట్లాడినా మా వాళ్ల జోలికి వెళ్లినా నేను చూస్తూ ఊరుకోను క్రిష్. నువ్వు ఇలా అయినదానికి కాని దానికి మా వాళ్లని ఏడిపిస్తుంటే నీతో పెళ్లికి నేను సిద్ధపడ్డాను. కాదు కసాయి వాడి వెనక మేకలో నీ వెనుక ఈ ఇంటికి వచ్చాను.
క్రిష్: నేను బెదిరించానా ఏంటి సత్య..
సత్య: చేయాల్సింది అంతా చేసి ఎందుకు ఈ అమాయకత్వం. ఎవర్ని మోసం చేయాడానికి ఈ నాటకాలు. నన్ను సొంతం చేసుకోవాలి అనే కదా మా ఇంటి గోడల మీద మనిద్దరి గురించి అసభ్యంగా రాయించావ్. ఆ రోజు మా నాన్న ఎంత గుండె పగిలేలా ఏడ్చారో తెలుసా. ఆయన అంతలా ఏడ్వడం మొదటి సారి చూశాను నేను. నీకు అడ్డం వస్తున్నాడు అనే కదా మాధవ్‌ని చంపించాలి అని చూశావ్. ఇప్పటికీ అతను కోమాలో ఉన్నాడు. చావుతో యుద్ధం చేస్తున్నాడు. అతని అమ్మానాన్నల ఉసురు నీకు కచ్చితంగా తగులుతుంది. ఇంత చేసినా నేను మొండిగా నీకు దూరంగా ఉన్నాను అనే కదా నా మీద కూడా దాడి చేయించావు. నన్ను కిడ్నాప్ చేయించి నువ్వు నా జీవితాన్ని నాశనం చేయించినట్లు ఈ లోకాన్ని నమ్మించావ్. చచ్చినట్లే వేరే దారిలేక నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే కదా..
క్రిష్: సత్య నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఇదంతా..
సత్య: కాదు. నీ మోసాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇప్పటికీ నేను నీ దారిలోకి రాకపోతే ఎంతకైనా తెగిస్తావు అని అర్థమైంది. నన్ను నీ సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తావని అర్థమైంది. ఎలా అయినా అనుకున్నది సాధిస్తావు అని అర్థమైంది. అందుకు మా వాళ్లని కూడా బలివ్వడానికి కూడా వెనకాడవు అని అర్థమైంది.
క్రిష్: ఏడుస్తూ.. సత్య...
సత్య: మావాళ్లని దక్కించుకోవడానికి నీకు లొంగిపోయాను. అంతే తప్ప నీ మీద మనసుపడో నీ మీద ప్రేమతోనో నిన్ను పెళ్లి చేసుకోలేదు.
క్రిష్: సత్య నేను చెప్పేది విను..
సత్య: ఆగు ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. నేను నిన్ను ద్వేషిస్తున్నాను. వినపడుతుందా.. నా మెడలో ఈ తాళి కట్టి నువ్వు గెలిచావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ తాళి కట్టించుకొని నేను గెలిచాను. నువ్వు ఓడిపోయావు. నువ్వు ఏం ఆశపడి నన్ను పెళ్లి చేసుకున్నావో అది నీకు దక్కనివ్వను. కనీసం నన్ను ముట్టుకోనివ్వను. ఉంటాను జీవితాంతం నీతోనే ఉంటాను. కానీ ఇలాగే దూరంగా ఉంటాను. చివరిగా చెప్తున్నా విను మనిద్దరం కలిసి బతకడం జరగని పని.
క్రిష్: విడివిడిగా ఉండటం కూడా కాని పని సత్య. నా మాట విను.
సత్య: వినను అస్సలు వినను. కానీ ఒక్కటి నీ మీద ద్వేషాన్ని నేను నీ వాళ్ల మీద చూపిస్తాను అని భయపడుతున్నావేమో నేను నీలా కాదు. నాకు సంస్కారం ఉంది. వాళ్లకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్లకి ఇస్తాను. కోడలిగా నా పరిధిలో నేను ఉంటాను. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం తెగిస్తాను.
క్రిష్: ఎందుకు ఇంత మొండితనం సత్య ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు నా ప్రేమ నిజం. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.