అన్వేషించండి

Satyabhama Serial Today March 19th: సత్యభామ సీరియల్: నందిని కిడ్నాప్‌.. ఆగిపోయిన క్రిష్‌, సత్యల పెళ్లి.. హర్ష రచ్చ!

Satyabhama Serial Today Episode భైరవి నందినిని కిడ్నాప్‌ చేయించడంతో హర్షతో పాటు క్రిష్‌, సత్యల పెళ్లి కూడా ఆగిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode  రెండు జంటలు తల్లిదండ్రలు బట్టలు పెడతారు. వాటిని మార్చుకొని రమ్మని పంతులు చెప్తారు. దీంతో నలుగురు తమ గదులకు వెళ్తారు. సత్య తన తండ్రిని అన్నమాటలు తలచుకొని ఒంటరిగా ఏడుస్తుంటుంది. ఇంతలో మీన అక్కడికి వస్తుంది. 

మీన: అందరి ముందు అంకుల్ మీద అరవడం ఎందుకు ఇప్పుడు ఇలా ఒంటరిగా కూర్చొని ఏడ్వడం ఎందుకు. 
సత్య: నేను చీర మార్చుకోవాలి.
మీన: చీర మార్చుకోవడం తర్వాత. ముందు బుద్ధి మార్చుకో. నీకు నాకు పెద్ద పరిచయం లేదు. నిన్ను మాట అనే హక్కు కూడా నాకు లేదు. కానీ నువ్వు అన్న మాటలకు అంకుల్‌ పడిని బాధ చూసి పరాయి దాన్ని అయిన నాకే నీ మీద మనసు విరిగిపోయింది. కూతురు ఊబిలోకి పడిపోతుంది అని భయపడి ఆ పిచ్చి తండ్రి రక్షించడానికి ప్రయత్నిస్తుంటే అందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టి పెళ్లి ఆపాలని చూస్తుంటే నువ్వు ఆయనకు సపోర్ట్ చేయాల్సింది పోయి అందరిలా నువ్వు మాటలు అంటావా. కూతురు కళ్లలో నీళ్లు చూడకూడదు అనుకున్న ఆ తండ్రి చేత కన్నీళ్లు పెట్టించి ఒంటరి వాడిని చేసి అందరిలో అవమానించావే.. దోషిలా నిలబెట్టావే బాధగా అనిపించడం లేదా. ఆ టైంలో అంకుల్ కళ్లలోనుంచి వచ్చినవి కన్నీటి చుక్కలు కాదు రక్తపు చుక్కలు. కేవలం నీ కోసమే ఇష్టం లేని వ్యక్తి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఆయన మానసికంగా చనిపోయి నీ ఆశని బతికించారు అది అర్థమైందా. ఇది కేవలం తండ్రి మాత్రమే చేయగలిగే త్యాగం. ఎందుకు మీ నాన్నని అలా ఏడిపించావ్..
సత్య:  వేరే దారి లేదు కాబట్టే నేను అడ్డం తిరిగి నాన్నని ఎదురించకపోతే అక్కడున్నవాళ్లు నాన్నని చంపడానికి కూడా వెనకాడరు కాబట్టి. ఇప్పుడు నేను మొండిగా ఉంటేనే మా వాళ్లు నా మాట వింటారు. అవును నేను ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. క్రిష్‌ని నా ఫ్యామిలి వైపు వెళ్లకుండా ఉండాలనే ఈ పెళ్లి చేసుకుంటున్నా. నీ మీద చూపించే రాక్షసతత్వానికి నా ఫ్యామిలీ బలి అవ్వకూడదు అనే  ఈ పెళ్లి చేసుకుంటున్నా. ఇప్పుడు నా పెళ్లి ఆగిపోతే ఈ కథ మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే లేని కోపం తెచ్చుకొని తప్పని తెలిసి కూడా నాన్న మీద అరిచాను. తప్పలేదు. మా నాన్న మీద ప్రేమ కేవలం మా నాన్న మీద ప్రేమ నాకు ఇంత మొండితనం ఇచ్చింది. అంతే మీన ఇప్పటికీ నా మనసుని మాఇంట్లోనే వదిలిపెట్టి వచ్చాను. అని మీనని హగ్ చేసుకొని సత్య ఏడుస్తుంది. 
 
మహదేవయ్య: భైరవి టెన్షన్ చూసి.. ఏందే అలా ఉన్నావ్..
భైరవి: ఏం లేదు అయ్యా కొంచెం నెత్తి నొస్తుంది. ఇంతలో పంతులు పెళ్లి కూతుళ్లు పెళ్లి కొడుకుల్ని పిలుస్తారు. క్రిష్ , హర్ష ఇద్దరూ వస్తారు. భైరవి హర్షని చూసి.. వీడికి ఆరాటం ఆగుతున్నట్లు లేదు పంచె ఎగేసుకొని కూర్చొన్నాడు. ఇప్పుడు ఉంటుంది వీడికి అసలు కథ. అసలు ఈ నెత్తి నొప్పి అంటా వీడితోనే వచ్చింది సంపంగి సంపంగి అనుకుంటూ పెళ్లి చేసిన దాకా తీసుకొచ్చాడు. 

ఇక సత్య రెడీ అయి వస్తుంది. కానీ నందిని రాదు. నందిని రెడీ అయి తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. భైరవి అక్కడికి వస్తుంది. ఇక నందిని తన తల్లి మీద సీరియస్ అవుతుంది. పెళ్లి ఆపుతాను అని నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టిన వరకు చూస్తూ ఉన్నావని అంటుంది. ఇక భైరవి కొందరు రౌడీలను పిలుస్తుంది. 

భైరవి: వీళ్లు నా పుట్టింటి తాళూక రైడీలు.. నిన్ను కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడుతారు. నిన్ను తీసుకొని పోయి ఒక జాగాలో భద్రంగా దాస్తారు. తీస్కపోండి.. ఏం కాదు నేనున్నాకదా.. పోయిరా.. వెళ్లు.. నందిని రౌడీలతో వెళ్లిపోతుంది. ఇక రేణుక ఆ విషయాన్ని చూస్తుంది. దీంతో భైరవి ఎవరికైనా చెప్తే గొంతు పిసికేస్తా అని అంటుంది. ఇక ఏమీ తెలియనట్లు భైరవి మండపం దగ్గరకు వచ్చి నందిని కనిపించడం లేదు అని అంటుంది.

హర్ష: మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా..
భైరవి: నాటకాలు కాదు బాబు చీర మార్చుకుంటా అని వెళ్లింది తీసుకొద్దామని అక్కడ చూస్తే కనిపించడం లేదు.
రుద్ర: ఏక్కడికి పోతుంది అమ్మ.
మహదేవయ్య: మొత్తం అంతా చూశావా.. 
గంట: కొంపతీసి పెళ్లి పీటల మీద నుంచి పారిపోలేదు కదా అని అంటుఐ న్నారు అండి.
భైరవి: అట్లా ఎందుకు పారిపోతుంది అత్తమ్మ. ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇప్పటి వరకు ఎందుకు పీటల మీద కూర్చొంటుంది. నెత్తిన జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టించుకుంటుంది. 
మహదేవయ్య: మాటలు ఆపి ముందు నందిని ఎక్కడికి వెళ్లిందో చూడండిరా..
రుద్ర: బాపు నా అనుమానం ఏంటంటే ఆ మినిస్టర్ మనుషులు ఏమైనా కిడ్నాప్ చేసుంటారా..
క్రిష్: అంతే అయింటుంది బాపు నేను వెళ్లి తేల్చుకొని వస్తా. 
పంతులు: బాబు అలా పీటల మీద నుంచి లేవకూడదు.
హర్ష: కూర్చొని మాత్రం ఏం చేస్తాడు. వాళ్ల చెల్లి వచ్చిన వరకు నా చెల్లి మెడలో తాళి కట్టనివ్వను. 
భైరవి: నా ఇంటి ఆడపిల్ల కోసం ఆ ఇంటి ఆడపిల్లని బాధ పెట్టడం పద్ధతి కాదు. చిన్నా నువ్వు పీటల మీదే కూర్చొరా.. పంతులు మీరు మంత్రాలు చదువు.. అరే రుద్రా నువ్వు చెల్లి కోసం వెతికించుపో. 
మహదేవయ్య: నా కోట చుట్టూ నా బలగం మొత్తం కాపలా ఉంది. ఇంత మంది కళ్లు కప్పి లోపలికి ఎవరు వస్తారు ఎట్లా కిడ్నాప్ చేస్తారు.
హర్ష: వాటితో నాకు సంబంధం లేదు నందిని వచ్చాకే రెండు పెళ్లిళ్లు జరుగుతాయి. 
క్రిష్: అన్నా ఇక్కడ నిలబడి ఆలోచించడం కాదు అన్ని దిక్కులు అందరూ పోయి వెతకండి. బాలు క్రిష్‌కి ఏదో చెప్పి వెళ్తాడు. ఇక ఆడవాళ్లు కూడా వెతుకుతాం అని వెళ్తారు. 
సత్య: మనసులో.. ఎందుకు ఇలా జరిగింది. ఎందుకు పెళ్లికి ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి. 
పంతులు: అయ్యా ఇంకా కొంచెం సేపటిలో మంచి గడియలు పోతాయి చివరకు ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది.
హర్ష: ఆగితే ఆగనివ్వండి నష్టం లేదు.  
భైరవి: ఇది నీ చెల్లి పెళ్లి..
హర్ష: అయితే ఏంటి..
భైరవి: ఏం కొడుకును కన్నావు అయ్యా. చెల్లి పెళ్లి ఆగిపోతుంది అంటే ఏం అంటున్నాడో విన్నావా..
హర్ష: ఏమైనా మాట్లాడాలి అంటే నాతో మాట్లాడండి. 
భైరవి: మీ చెల్లి మా చిన్నాని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది నీకు ఆపే హక్కులేదు. ఆ మాటకు వస్తే ఇక్కడ ఎవరికీ లేదు. ఇంతకు ముందు పెళ్లి ఆగితే నీ కూతురు ఒంటి కాలిమీద లేచింది. ఇప్పుడు నీ కొడుకు వల్ల ఆగేలా ఉంది. తప్పు అని చెప్పవయ్యా. 
శాంతమ్మ: ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటున్నారు. ఎవరూ ఎవరి మాటా వినే పరిస్థితిలో లేరు. సగం చచ్చి మీ ముందు నిలబడ్డాడు. ఇక నా కొడుకును ఎవరూ ఏం అనకండి.. 
మహదేవయ్య: చూడు అల్లుడు ఎక్కడున్నా నందినిని మావాళ్లు వెతికి తీసుకొస్తారు. మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది. అనుకున్న మూహూర్తానికే ఈ పెళ్లి జరగని.

ఇక రుద్ర వచ్చి నందిని దొరకలేదు అంటాడు. క్రిష్ పంతులుకి మంత్రాలు చదవమని అంటాడు. సత్య మెడలో తాళి కట్టిన తర్వాతే ఇక్కడ నుంచి లేస్తాను అంటాడు. హర్ష అందుకు ఒప్పుకోడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ మార్చి 19th: తల్లి గుట్టు రట్టు చేసిన ఉలూచి పాము.. సుమనను చంపేస్తానన్న నయని!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget