అన్వేషించండి

Satyabhama Serial Today July 23rd: సత్యభామ సీరియల్: తన తండ్రి కోసం సత్యని అడ్డుకున్న క్రిష్.. మామయ్యని బయటకు తీసుకురాగలడా!

Satyabhama Serial Today Episode తండ్రి కోసం సత్యని కోర్టుకి వెళ్లకుండా క్రిష్ ఆడ్డుకోవడం, సత్య క్రిష్ మీద నమ్మకంతో ఇంట్లో ఉండిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Satyabhama Today Episode నందిని వచ్చి తినడానికి కూర్చొంటే నేను వెళ్లి నిన్ను పిలవమని పంపిస్తే నీ దగ్గరకు వచ్చి ప్రేమగా పిలిస్తే తిట్టి పంపేశావ్ అందుకే తినకుండా లోపలికి వెళ్లి ఏడుస్తుందని భోజనానికి వచ్చిన హర్షతో విశాలాక్షి చెప్తుంది. వదిన ఎప్పుడు నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నించినా నువ్వు ఇలాగే దూరం పెడుతున్నావు అన్నయ్య అని సంధ్య చెప్తుంది.

హర్ష: నేను ఏం కావాలి అని చేయలేదు. కేసు విషయంలో ప్రకాశ్ అంకుల్‌తో మాట్లాడుతుంటే ఆ టెన్షన్‌లో ఉన్నాను. వస్తాను అన్నా వినిపించుకోకుండా విసిగించింది.
విశాలాక్షి: నీ టెన్షన్ చూపించడానికి కాదురా భార్య ఉండేది. నీ భార్య నిన్ను అర్థం చేసుకోలేదు సరే నువ్వు తనని అర్థం చేసుకోవాలి కదా. మీ నాన్న నన్ను అర్థం చేసుకోలేదు. దూరంగా ఉంటున్నారు. నేను అరవడం లేదు కదా. బాధ దిగమింగుకొని ఉన్నాను కదా. మౌనంగా ఉంటున్నాను కదా.
శాంతమ్మ: ఇంకా అలాగే నిల్చొంటావ్ ఏంట్రా నందిని బతిమాలి తీసుకురా.
హర్ష: ఏదో చిరాకులో నీ మీద అరిచాను సారీ. ఇంకోసారి అలా చేయను. భోజనం చేయురా. అమ్మ కూడా నీ కోసం భోజనం చేయకుండా కూర్చొంది.
నందిని: నా మీద ప్రేమతో వచ్చావా మీ అమ్మ చెప్తే వచ్చావా. మీ అమ్మ చెప్తేనే వచ్చావ్ ఒప్పుకో. నువ్వు ఎంత బతిమాలినా రాను వెళ్లు విసిగించకు. నా ఖర్మ కాలి దొరికినావ్.
హర్ష: అది మొండిదమ్మా రాదు. నాకు ఆకలేస్తుంది వడ్డించమ్మా.
శాంతమ్మ: మొగుడు తినకుండా భార్య తినకూడదు అన్నాం ఇప్పుడు నువ్వు తింటే మమల్ని ఉంచుతుందా.

ఇక విశాలాక్షి హర్షకి జూస్ ఇచ్చి పంపిస్తుంది. హర్ష నందిని దగ్గరకు వెళ్లి జూస్ తాగమంటాడు. నందిని వద్దని అంటే క్షమాపణ చెప్పి నీలో మార్పునకు ఇంట్లో అందరూ సంతోషిస్తున్నారు. నాన్న కూడా బయటకు వచ్చేస్తే మనకు ఇక అంతా హ్యాపీనే అప్పుడు ఇక నా ఫోకస్ అంటా నీ మీదే అని ఇంకోసారి నిన్ను హనీమూన్‌కి తీసుకెళ్తాను. నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్తాను ఈ ఒక్క సారికి క్షమించని నందినికి జూస్ ఇస్తాడు. నందిని కూడా తీసుకుంటుంది. ఫస్ట్ నైట్‌లో పాలు షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ జ్యూస్ షేర్ చేసుకుందామా అంటే నందిని హర్ష మీదకు జూస్ విసిరేస్తుంది. హర్ష చాలా షాక్ అయిపోతాడు.

సత్య రెడీ అయి వచ్చి కోర్టుకి వెళ్దామని అంటే క్రిష్‌ నీకు నా మీద ఉంది కదా అని అంటాడు. ఉంది అని సత్య చెప్తే క్రిష్‌  సత్యని కోర్టుకి వెళ్లొద్దని అడ్డుకుంటాడు. సత్య క్రిష్‌తో మీ ఇంట్లో వాళ్ల మాటలకు మారిపోయావని నా పని నేను చేసుకుంటానని వెళ్లిపోతుంది. దాంతో క్రిష్‌ నేను మామయ్యని విడిపించడానికి సిద్ధపడి ఉన్నానని.. నువ్వు ఇంట్లో ఉంటే నేను కోర్టుకి వెళ్తానని అంటాడు. నువ్వు ఇప్పుడు రావడం వల్ల లేని పోని సమస్యలు వస్తాయని అంటాడు. సత్యని క్రిష్‌ ఒప్పిస్తాడు. ఇంతలో హర్ష సత్యకి కాల్ చేస్తాడు. దాంతో సత్య నేను రావడం లేదు అన్నయ్య బావగారు వస్తున్నారు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన నాన్నని విడిపిస్తారని అంటుంది. క్రిష్‌ లోపల మహదేవయ్య, భైరవిల దగ్గరకు వెళ్తాడు. ఇక సత్య ఇంట్లోనే ఉందని చెప్తాడు. దాంతో సత్య కంటే నీకు నీ తండ్రి అంటే ఎక్కువ ఇష్టమని భైరవి అంటుంది. మహదేవయ్య పొంగిపోతాడు. చిన్నా మీద నమ్మకం ఉంది కానీ చిన్న కోడలి మీద నమ్మకం లేదని సత్య మనసు మారేలోపు వియ్యంకుడికి శిక్ష పడేలా చేయాలని మహదేవయ్య భైరవితో చెప్తాడు.

సంధ్య, హర్షలు కోర్టుకు వెళ్తారు. విశ్వనాథాన్ని చూసి సంధ్య, హర్షలు ఎమోషనల్ అవుతారు. విశ్వనాథం పిల్లలతో నేను నా పిల్లల కోసం చేసిన మంచి పని ఇదే చివరి పని కూడా ఇదే అని అంటాడు. ఇక చుట్టూ చూసి సత్య గురించి వెతుకుతాడు. అది చూసి క్రిష్ ఎవరి కోసం వెతుకుతున్నారు మామయ్య, పిల్లలకు అన్యాయం చేస్తున్నారని గుండె నిండా ప్రేమను పెట్టుకొని ఆ ప్రేమను చంపుకుంటున్నారని అంటాడు. ఇంటిళ్ల పాది మీ కోసం ఏడుస్తున్నారని అంటాడు. విశ్వనాథం తన గురించి మర్చిపోమని అంటాడు. హర్షకి బాధ్యతలు అప్పగిస్తాడు. తనని బయటకు తీసుకు రావొద్దని అంటాడు. ఇక విశ్వనాథాన్ని పోలీసులు తీసుకెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇరుక్కుపోయిన మనీషా.. సంయుక్త కచ్చితంగా లక్ష్మీనే అన్న మిత్ర, ఆధారాలు చూపించిన వివేక్!

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 13th: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
నువ్వులేక నేను లేను: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget