అన్వేషించండి

Satyabhama Serial Today January 5th: 'సత్యభామ' సీరియల్: సత్యభామ పేరు తెలుసుకోవడానికి క్రిష్ తిప్పలు - హర్ష మీద మైత్రికి అనుమానం!

Satyabhama Serial Today Episode సత్యభామ పేరు తెలుసుకోవడానికి క్రిష్ మాస్టారు ఇంటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Episode: క్రిష్ సత్యభామ తండ్రిని మచ్చిక చేసుకోవాలని ఆయన్ని ఫాలో అవుతుంటాడు. ఇంతలో విశ్వనాథం సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. ఆ వ్యక్తి సైకిల్‌ రిపేర్ అయిందని డబ్బులు డిమాండ్ చేస్తాడు. చేసేది ఏమీ లేక విశ్వనాథం ఆయనకు వెయ్యి రూపాయలు ఇస్తుంటే క్రిష్ వచ్చి అడ్డుకుంటాడు. సైకిల్ మీద వచ్చిన వ్యక్తిని బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు. 

క్రిష్: ఏంటి మాస్టారు ఇది మీ తప్పు లేకపోయినా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు. 
విశ్వనాథం: డబ్బులు ఇస్తే ఈ క్షణంతో పోతుంది. అదే పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్తే ఈ పూట అంతా వేస్ట్ అవుతుంది. మనం మనస్శాంతిగా ఉండాలి అంటే రాజీ పడక తప్పదు. అవును నిన్ను ఎక్కడో చూసినట్లు ఉంది బాబు. 
క్రిష్: గతంలో తాను చేసిన ఫైట్ గుర్తుచేసుకొని.. కొంప తీసి అప్పుడు ఏమైనా చూశాడా.. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి. అదేంటి మాస్టారు నన్ను గుర్తుపట్టలేదా.. నేను మీ దగ్గరే చదువుకున్నాను. మీ శిష్యుడిని. మళ్లీ ఇన్నాళ్లకు మిమల్ని చూసి వచ్చా. 
బాబీ: అన్నా ఆ సైకిల్ వాడిని దేవుడు పంపించలేదు అన్నా.. నేనే పంపించాను. 
క్రిష్: ఓరేయ్ బాబీగా థ్యాంక్యూరా.. మాస్టారుకి నేను నచ్చాను అని నాకు తెలిసిపోయిందిరా.. ఇక నా సంపంగి పేరు తెలుసుకోవడమే ఉంది. 

మరోవైపు హర్ష పోలీసులతో మాట్లాడటం మైత్రి చూసేస్తుంది. ఇక మైత్రిని చూసి హర్ష మౌనంగా ఉండిపోతాడు. ఇక మైత్రి సత్యభామతో మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. హర్ష షాక్ అవుతాడు. 

సత్యభామ: పోలీసులా మా ఇంటికి ఎందుకు వస్తారు.
మైత్రి: ఎందుకో నాకు ఎందుకు తెలుస్తుంది. మాట్లాడి పంపించిన వారిని అడుగు. 
హర్ష: మనింటికి పోలీసులు ఎందుకు వస్తారు. పోలీసుల్ని చూసి ఏదో ఊహించుకుంటారు ఎందుకు. పక్కంటి అర్జున్ పాస్ పోర్ట్ ఎంక్వైరీ కోసం వచ్చారు నేను మాట్లాడి పంపించేశాను.
సత్య: ఓ అంతేనా మా ఇంటికి ఈ మధ్య రౌడీలే వస్తున్నారు అనుకున్నా పోలీసులు కూడా వస్తున్నారా.. సర్లే ఏంటి విశేషాలు..
మైత్రి: నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా..
సంధ్య: ఓ నీకు మా అన్నయ్య చెప్పాడా..
మైత్రి: మీ అన్నయ్య నాతో కూడా మాట్లాడుతాడా.. నేను వస్తుంటే దారిలో అంకుల్ కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు కనిపించి చెప్పారు. నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి. లైఫ్‌లో ఏవో సాధించాలి అన్నావు కదా.
సత్య: ఆ మాటలు గాలిలో కలిసిపోయాయి. ఈ మధ్య గొడవలతో విసిగిపోయి మావాళ్లు నన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి అనుకున్నారు.
సంధ్య: మా నానమ్మ పోరు పడలేక ఒప్పుకుంది.

ఇక భూమి పూజకు మహదేవయ్య, రుద్రలు వస్తారు. తర్వాత కార్పొరేటర్ నర్శింహం కూడా వస్తాడు. అందరూ ఆయనకు స్వాగతం పలికితే మహాదేవయ్య ఉడకిపోతాడు. నర్శింహం మహాదేవయ్య ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తారు. గతంలో ఇద్దరికీ గొడవలను గుర్తుచేసుకుంటారు. ఇక కార్పొరేటర్ చేతుల మీదగా భూమి పూజ చేయించడంతో మహాదేవయ్య, రుద్రలు రగిలిపోతారు. అవమానంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. 

మరోవైపు క్రిష్, బాబీలు గోడదూకి సత్యభామ ఇంటికి వస్తారు. అక్కడ సత్యభామ బట్టలు ఆరేస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఎవరో ఒకరు సత్యభామను పేరు పెట్టి పిలుస్తారు కదా అప్పుడు పేరు తెలిసిపోతుంది అని క్రిష్ అనుకుంటాడు. ఇక సత్య చెల్లి వచ్చి అక్క అని పిలిస్తే అయ్యో అనుకుంటాడు. తర్వాత హర్ష వచ్చి చెల్లమ్మ అంటాడు. ఇక హర్ష బాబీతో ఏంట్రా వీళ్లు ఎవరూ పేరు పెట్టి పిలుచుకోరా అని అనుకుంటారు. ఇక సత్య వాళ్ల అమ్మ వచ్చి బంగారం అని పిలిస్తే పేరు పెట్టి పిలవడం లేదని చిరాకు పడతాడు. ఇక సత్య వాళ్ల బామ్మకి మందులు ఇవ్వడానికి లోపలికి వెళ్తుంది. అప్పుడే సత్య పట్టీ కింద పడిపోతే దాన్ని కావాలి అని క్రిష్ అంటాడు. ఎవరూ చూడకుండా దాన్ని తీసుకోవడానికి వెళ్తాడు. ఈలోపు ఓ పూల కుండీని తన్నేస్తాడు. సత్య తల్లి వచ్చి ఏమైందా అనుకుంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: ‘గుంటూరు కారం’ సెన్సార్ రిపోర్ట్ - ఫస్ట్ హాఫ్ మరీ అలా ఉందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Kasturba Gandhi School: 300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Embed widget