అన్వేషించండి

Satyabhama serial today january 17th - 'సత్యభామ' సీరియల్: క్రిష్‌ తల్లి భైరవితో సత్య గొడవ, అప్పుడే తోటికోడలికి సపోర్ట్‌గా వచ్చేసిందిగా!

Satyabhama Serial Today Episode: అమ్మవారి అభిషేకం కోసం నీరు మోయలేక రేణుక పడిపోవడంతో భైరవి ఆమెను కొట్టడాన్ని అడ్డుకొని సత్య గొడవ పడడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: సత్యభామ వాళ్లు గుడికి వస్తారు. కాళీ కూడా వచ్చి సత్య అందాన్ని నాశనం చేస్తానని.. అందంతో పాటు సత్య అహంకారం కూడా నాశనం అయిపోతుంది అని అప్పుడే తన పగ తీరుతుంది అని కాళీ అనుకుంటాడు. ఇక క్రిష్ కూడా ప్రేమించిన అమ్మాయి అందంగా లేదని వదిలేస్తాడని ఒక్క దెబ్బకు రెండు పిట్టలని కాళీ ప్లాన్ చేస్తాడు. మరో వైపు క్రిష్ సత్య వాళ్ల నాన్నని కాకా పట్టే పనిలో పడతాడు. మంచిగా బొట్టుపెట్టుకొని, చేతిలో కొబ్బరి చిప్ప, చేతిలో స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తాడు.  

క్రిష్: అరే బాబీగా మొదటి సారి అత్తారింట్లో అడుగుపెడుతున్నా కుడి కాలు పెట్టాలా..
బాబీ: నీకు కాబోయే మామ నీ కాళ్లు విరగకొట్టకుండా బయట పడితే చాలు అన్న. అంటే ఓవర్‌ యాక్షన్ చేసి దొరికిపోతే కష్టం అని.
క్రిష్: రేయ్ బాబీ మీ అన్న మీదకి మాసే కానీ నా సంపంగి విషయంలో మాత్రం క్లాస్‌రా. చూడు ఈ ఇంటి అల్లుడు పోస్ట్ మీద గస్తీ వేసి వస్తా.
బాబీ: అన్న నీ పెర్మామెన్స్ అంతా గుమ్మం బయట చూపిస్తున్నావే ముందు లోపలికి పద.

విశ్వనాథం క్రిష్‌, బాబీ కోసం టీ తీసుకొస్తానని కిచెన్‌కి వెళ్లగానే.. క్రిష్ సత్య గదికి వెళ్లి అక్కడ సత్య ఫొటోలు చూసి తెగ మురిసిపోతాడు. బయట నుంచి బాబీ ఎక్కడ విశ్వనాథం చూసేస్తాడా అని కంగారు పడతాడు. ఇక తాను అత్తారింటికి వస్తే తాను అదే గదిలో ఉండాలి అని క్రిష్ బాబీతో చెప్తాడు. బాబీ వచ్చి క్రిష్‌ని బయటకు తీసుకొస్తాడు. అప్పుడే విశ్వనాథం టీ తీసుకొని వస్తాడు. ఇక విశ్వనాథం మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే క్రిష్‌ తన కాలిమీద పడి జాబ్ వచ్చిందని అందుకే చెప్పడానికి వచ్చానని అంటాడు. 

బాబీ: ఇలాంటి బుద్ధిమంతుడు ఇంటికి అల్లుడైతే బాగుంటుంది కదా మాస్టారూ. క్రిష్‌ కాలు తొక్కడంతో.. ఏదో మాట వరసకి అన్నాను సార్.
విశ్వనాథం: నువ్వు మాట వరసకి అన్నా అది నిజం బాబు. ఏ ఆడ పిల్ల తండ్రి అయినా ఇలాంటి వాడిని వదులుకోడు. అయినా నీలాంటి శిష్యుడుకి గురువు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అయినా నీకు ఏ జాబ్ వచ్చిందో చెప్పనే లేదు. 
బాబీ: మాకు ఈ సాప్ట్‌వేర్‌లు సెట్ అవ్వవు సార్ అంతా హార్డ్‌ వేరే..
విశ్వనాథం: అవును బాబు ఇందాక నుంచి అడుగుదాం అనుకున్నా ఆ చేతికి ఏమైంది అలా కట్టారు.
బాబీ: పేరు సార్(సత్య పేరు టాటూని రుమాలుతో చుట్టేసుంటాడు క్రిష్‌.).. అదే అదే కేర్ సార్ కేర్.. వచ్చే దారిలో రక్తం ఇచ్చి వచ్చారు అందుకే. 
విశ్వనాథం: సరే బాబు అప్పుడప్పుడు వస్తూ ఉండండి.
బాబీ: మీరు ఊ అనేలే కానీ మా అన్న ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. 
క్రిష్‌: మా తమ్ముడికి కొంచెం కామెడీ ఎక్కువ సార్.. ఇక మేం బయల్దేరుతాం. తమ్ముడు పడ మనం అసలే హార్డ్ వేర్ కదా బండి బోల్ట్ తీసే పని పడింది.

మరోవైపు రేణుక గుడి దగ్గర బిందెతో నీళ్లు తీసుకొని అభిషేకం చేస్తుంటుంది.  చాలా బిందెల నీరు మోసి బరువు మోయలేక ఇబ్బంది పడుతుంటుంది. అది చూసిన సత్య అయ్యో అనుకుంటుంది. ఇక కాళీ వాళ్లు సత్యను ఫాలో అవుతారు. సత్య రేణుక కష్టం చూసి పాపం అనుకుంటుంది. మరోవైపు రేణుకని భైరవి తొందరగా పని పూర్తి చేయమని కోపమవుతుంది. రేణుక బిందెతో నీరు మోస్తూ.. నా వల్ల కాదు కళ్లు తిరుగుతున్నాయి అని అంటుంది. ఇక భైరవి ఒప్పుకోదు అది చూసిన సత్య షాక్ అవుతుంది. ఇక నీరు మోస్తూ రేణుక పడిపోతుంది. దీంతో భైరవి కొట్టడానికి చేయి ఎత్తుతుంది. వెంటనే సత్య అడ్డుకుంటుంది. 

భైరవి: ఏయ్ ఎవరు నువ్వు.
సత్య: మానవత్వం ఉన్న మనిషిని.
భైరవి: మాతో నీకేం పని. నువ్వు ఎందుకు మధ్యలోకి వస్తున్నావ్.. చేయి వదులు.
సత్య: ఎందుకు ఇంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఆమెను అంత క్రూరంగా హింసిస్తున్నారు.
భైరవి: అది నా కోడలు. నేను ఏమైనా చేస్తా.
సత్య: కోడలు అంటే మీ బానిసా..
భైరవి: పెళ్లి అయి ఐదేళ్లు అయింది దాని కడుపున ఇంత వరకు ఒక కాయ కూడా కాయలేదు. అప్పుడు కోడలు మీద అరవకుండా ముద్దు పెట్టుకోవాలి అంటావా. 108 బిందెల నీటితో అమ్మవారికి అభిషేకం చేయవే పిల్లలు పుడతారు అని మంచిగా చెప్పి తీసుకొచ్చా మొండికేస్తుంది.
సత్య: మొండి కేయడం కాదు తన వల్ల కావడం లేదు అని ఏడుస్తుంది. మీకు జాలి వేయడం లేదా..
భైరవి: ఏయ్ నువ్వు దండం పెట్టుకోవడానికి గుడికి వచ్చావా.. జనాన్ని ఉద్దరించడానికి వచ్చావా.. కాలికి మెట్టెలు లేవు.. పెళ్లి కాలేదు.. అత్తారింటికి వెళ్లు అప్పుడు మోగుతుంది నీకు భాజా.. అవును నీ అత్త కూడా నాలా చేస్తే ఏం చేస్తావ్.
సత్య: తప్పు చేస్తే ఎవరైనా సరే ఊరుకోను. తనకి శక్తి లేనప్పుడు ఈ మొక్కలు ఏంటి. బిడ్డలు పుట్టకపోతే కోడలు కోడలు కాకుండా పోతారా.. మర్యాద ఇవ్వరా.
నందిని: అమ్మా ఏంటి ఈ లొల్లి.. ఓ మిడిల్ క్లాస్ పోరా.. గుర్తున్నానా..
సత్య: ఒళ్లంతా పొగరు నింపుకున్న నిన్ను అంత ఈజీగా ఎలా మర్చిపోతాను.
భైరవి: తనెవరో తెలుసా నీకు.
నందిని: తెలుసమ్మా.. ఎగిరి పడే విస్తారాకు. ఎందుకు నీ మీద ఒర్లుతుంది. సెంప మీద ఒక్కటి పీకపోయావా.. దారిన పోయిన దానివి మా విషయం నీకు ఎందుకు మేము ఎవరో నీకు తెలుసా.. నీ ప్రాణం నీకు అవసరం లేదు అనుకుంటే ఇలానే రెచ్చిపో.
సత్య: ఏయ్ మర్యాదగా మాట్లాడు.
నందిని: నిన్ను ఈ ఊర్లోనే లేకుండా చేస్తా.. 
సత్య: ఈ ఊరు నీదా.. అంటూ వాళ్లతో గొడవపడటం సత్య భామ్మ చూసి వచ్చి వాళ్ల గురించి నీకు ఎందుకు అని వాళ్లకి ఏమనుకోవద్దు అని సత్యని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌ జనవరి 17th: శోభనం గదిలోంచి బయటకు వచ్చిన అనామిక - దుగ్గిరాల కుటుంబంలో అలజడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget