అన్వేషించండి

Satyabhama Serial Today February 9th - సత్యభామ సీరియల్: హర్ష మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన క్రిష్, కాళీని కాల్చేసిన రౌడీ!

Satyabhama Serial Today Episode: కాళీ చేయి కాల్చేసిన క్రిష్ ఆ నింద హర్ష మీద మోపి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: శేఖర్ విశ్వనాథ్‌కి ఫోన్ చేసి ఆ రౌడీ తమ వెంట పడుతున్నాడని చెప్తాడు. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని అమెరికా వెళ్లకపోతే చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు అని చెప్తారు. ఇంతలో మాధవ్ ఫోన్ తీసుకొని అంకుల్ వాడేదో బెదిరిస్తున్నాడు అని మేం బెదిరిపోవడం లేదు అని మీరు కూడా భయపడొద్దు అని ఆ రౌడీ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. సత్య ఫోన్ తీసుకుంటుంది.

సత్య: మాధవ్ గారు.. వాడు మిమల్ని బెదిరించడం చిన్న విషయం కాదు. కానీ పెద్ద మనసుతో మీరు దాన్ని చాలా ఈజీగా తీసుకున్నారు. మీకు కలిగిన ఇబ్బందికి కారణం నేను. సారీ..
మాధవ్: నిశ్చితార్థం తోనే మన రెండు కుటుంబాలు ఒకటి అయిపోయాయి. ఇక మీ సమస్య మా సమస్య అని వేరువేరుగా ఉండవు. ఎంత పెద్దసమస్య అయినా మన సమస్యే. మనసులో ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. 
హర్ష: చూశారా నాన్న వాడు బావగారిని బెదిరించే వరకు వెళ్లాడు ఇంకా మనం ఆలోచిస్తూ కూర్చుంటామా.. 
విశ్వనాథ్: సరేరా మనం రేపు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం.
సత్య: మనసులో.. నాన్న వాడిమీద కంప్లైంట్ ఇద్దాం అంటున్నారు ముందు ముందు వాడు ఏం చేస్తాడో.. 

బాబీ: అన్నా ఆ మాధవ్ గాడు బయపడలేదు కదా.. మరి పెళ్లి ఆపుకొని వెళ్తాడా.
క్రిష్‌: రేయ్ వాడిని బయపెట్టాలి అంటే 5 నిమిషాల పనిరా. కానీ నేను సత్య దగ్గర బ్యాడ్ అవ్వకూడదు అంటే ఇలానే చేయాలి. 
కాళీ: అన్నా వాళ్ల సంగతి ఏమో కానీ మీ మామ మాత్రం నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని రెడీ అయ్యాడు.
క్రిష్‌: నా మీద కేసా ఏమని పెడతాడురా వాడి కూతుర్ని ప్రేమించాను అని కేసు పెడతాడు.
కాళీ: అలా పెడితే అవ్వదు అనే నువ్వు వదినను ఏడిపిస్తున్నావ్ అని వెంట తిరుగుతున్నావ్ అని ఇంటి ముందు పేర్లు రాస్తున్నావ్ అని కేసు పెడతాడు. వదిన కూడా నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. అలా చెప్పమని ఇంట్లో అందరూ వదినను బలవంతం చేస్తున్నారు. 
క్రిష్‌: రేయ్ నన్ను అరెస్ట్ చేసే మగాడే ఈ ఊళ్లో లేరురా. అందులో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తారా. పాపం వాళ్లకి తప్పుడు కేసు ఎలా పెట్టాలో కూడా తెలీదు.
కాళీ: అలా అని నువ్వు నేర్పిస్తావా ఏంటి.
క్రిష్‌: నేర్పిస్తే పోలే.. అంటూ గన్‌ తీసి కాళీ చేతిని కాల్చేస్తాడు. కాళీ నొప్పితో విలవిల్లాడిపోతాడు. 
కాళీ: ఏంటి అన్నా ఇది నీకు హెల్ప్ చేయాలని వస్తే నన్ను కాల్చావు.
క్రిష్‌: రేయ్ మరి వాళ్లకి తప్పుడు కేసు ఎలా పెట్టాలో చెప్పాలి అంటే నువ్వు ఈ పని చేసుకోక తప్పదు కదా.. ఏంటి ఇంకా అర్థం కాలేదా. అదేరా మా సంపంగి అన్న రేపు పోలీసులు సత్య ఇంటికి వెళ్లి ఆ హర్షా గాడిని నిన్ను చంపాలి అని అరెస్ట్ చేస్తారు. దాంతో ఇంట్లో వాళ్లకి తప్పుడు కేసు ఎలా పెట్టాలో అర్థమవుతుంది. 

ఉదయం పోలీసులు విశ్వనాథం ఇంటికి వెళ్లి హర్ష గురించి అడుగుతారు. కారణం చెప్పమని సత్య అడుగుతుంది. దీంతో పోలీసులు హర్ష ఫుల్‌గా మందు తాగి క్రిష్ అనే పెద్ద మనిషిని గన్‌తో కాల్చాడు అని.. అది గురి తప్పి కాళీ అనే మరో వ్యక్తికి తాకింది అని ఇద్దరూ కంప్లైంట్ ఇచ్చారని అంటారు. సత్య వాళ్లు రౌడీలని వాళ్ల మాట నమ్మొద్దని చెప్తుంది. పోలీసులు హర్షని తీసుకొని వెళ్తారు. ఇక నేను పోలీస్ స్టేషన్‌కు వస్తాను అని సత్య అంటుంది.

శాంతమ్మ: అదొక్కటే తక్కువ అయిందే.. అసలు ఇంట్లో జరిగే అనార్థాలు అన్నింటికి కారణం నువ్వే. ఆ జాతరలో ఆ రౌడీ గాడిని చెంప దెబ్బ కొట్టినప్పుటి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయ్. 
హర్ష: ఏంటి సీఐ గారు మీరు కూడా ఈ రౌడీతో కలిసిపోయారా..
క్రిష్‌: లేదు బామర్ది నేనే ఈ పోలీసులతో కలిసిపోయా పార్ట్‌ టైం..
బాబీ: అన్న మీ బామర్దిలో మస్తు ఫైర్ ఉందిరా..
క్రిష్‌: ఇక్కడ నాకు ఒళ్లంతా మండుతుందిరా అయినా నవ్వుతూ కూర్చొలే. మాస్టర్ రండి మాస్టర్ మర్యాదస్తులు మీరు ఎవరికీ ఏ హాని చేయరు ఏంటి ఈ పరిస్థితి వచ్చింది. రండి మాస్టార్ కూర్చోండి.. వీడు చూడండి నా ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలను అడ్డు పెట్టాడు. హర్షతో నువ్వు పేల్చిన బులెట్ వాడి చేతికి తాకింది చూడు. 
విశ్వనాథం: బాబు ఏంటి ఈ గొడవ అంతా.. ఎందుకు మా వెంట పడుతున్నావ్.. ఎందుకు మా పరువు తీస్తున్నావ్. బాబు చేయని తప్పుని వాడి నెత్తిన వేసి ఎందుకు వాడి జీవితం నాశనం చేస్తున్నావ్.
క్రిష్‌: నా మీదే ఫేక్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాడా నీ కొడుకు. ఏదో అలా తెలిసిపోతూ ఉంటాయి. మీ ఇంటికి అల్లుడిగా వద్దామనినేను మనసు పారేసుకుంటే ఈ అత్తింట్లో నన్ను లాక్ చేద్దామని అనుకుంటున్నారు కదా. అందుకే రివర్స్‌లో ఫేక్ కేస్ పెట్టా. నా మీద కత్తి పెడితే నేను తిరిగి పాయింట్ బ్లాంక్‌లో గన్ పెడతా.
హర్ష: నాన్న తప్పు చేసింది చేస్తోంది వాడు. వదిలి పెట్టడానికి వీల్లేదు. నాకు ఏమైనా పర్లేదు. వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి.
కాళీ: మనసులో.. ఇవ్వండి ఒక పీడా పోతుంది.
క్రిష్‌: రేయ్ రెచ్చిపోవద్దు.. ఎంత అయినా నీకు కాబోయే బావని అందుకే ఇంత కంట్రోల్‌గా మాట్లాడుతున్నాను. 
హర్ష: ఏం చేస్తావ్ రా ఏం చేస్తావ్. అయినా నువ్వు నాకు బావ ఏంట్రా ఛీ..
క్రిష్‌: మాస్టార్ రాయండి రాయమంటున్నాడు కదా కంప్లైంట్ రాయండి.. చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అవన్నీ నా మీద రాయండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూస్తూ.. మీ పేపర్‌ని నేను దిద్ది మార్కులు వేస్తా.
హర్ష: నాన్న వాడికి బయపడొద్దు. మనం అనుకున్నట్లు రాయండి. వాడికి కూడా చిప్పకూడు తినిపిద్దాం. దీంతో క్రిష్ గన్‌ని హర్షకి గురిపెడతాడు. ఇంతలో కాళీ వీడు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ నా చేయి కాల్చుతాడా ఏంటి అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: రామ్ చరణ్: బాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌తో చరణ్‌ పాన్‌ ఇండియా మూవీ! - కథ ఏంటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget