అన్వేషించండి

Satyabhama Serial Today February 20th Episode - సత్యభామ సీరియల్: సత్యను అడ్డుకున్న క్రిష్‌, మహదేవయ్యకు మినిస్టర్ వార్నింగ్!

Satyabhama Serial Today Episode సత్యను తన తండ్రి ఊరు దాటించే విషయం తెలుసుకున్న క్రిష్ సత్యని అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode క్రిష్ తన తండ్రి మాటలు తలచుకొని రగిలిపోతూ ఉంటాడు. అక్కడికి భైరవి అన్నం తీసుకొని వస్తుంది. ఎప్పుడూ తండ్రి మాటే నీ మాట అన్న నువ్వు ఈరోజు ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తుంది. దీంతో క్రిష్ ఇప్పటి వరకు తన మాటే నా మాట అని ఉన్నాను కదా ఇప్పుడు నా ఇష్టాన్ని తీర్చమని ఆయనకు చెప్పు.

భైరవి: ఎమ్మెల్యే అవ్వడం ఆయన కలరా. 
క్రిష్‌: ఎమ్మెల్యే ఇది కాకపోతే ఇంకో దారి ఉంటుంది అమ్మ. ఈ ఏడాది కాకపోతే ఇంకోసారి పోటీ  చేయొచ్చు. కానీ నా జీవితం అలా కాదు కదా అక్క ఇప్పుడు కాకపోతే ఇక జీవితంలో సత్యని కలుసుకోగలనా. 
భైరవి: అది కాదు చిన్నా. 
క్రిష్‌: అమ్మా నువ్వు ఆయన భార్యగా కాకుండా నాకు తల్లిలా ఆలోచించు అమ్మ. నా ప్రేమ కంటే ఆయన ఎమ్మెల్యే అవ్వడమే ముఖ్యం అంటావా.
భైరవి: ఆ మినిస్టర్ కూతుర్ని చేసుకుంటే నీ జీవితం మంచిగా ఉంటుందిరా.
క్రిష్: నువ్వు ఎన్ని చెప్పినా నేను ఎవరి మాట వినను. ఈసారి మీరంతా నా మాట వినాల్సిందే. మీరు ఒప్పుకుంటే సరే లేకపోతే నేనేం చేస్తానో అదే చేస్తా.. అమ్మా నా నెత్తి బాగా హీటైంది నువ్వు ఈడనుంచి పో. 
బాబీ: అన్నా నువ్వేమో ఇక్కడ బాపూని ఒప్పించే పనిలో ఉన్నావు. కానీ అక్కడ వదిన వాళ్ల నాన్న వదినని ఊరు దాటించే పనిలో ఉన్నాడు అన్న. నీ నుంచి కాపాడటానికి వదినను ఎక్కడికో పంపించేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వదినను కలుసుకోకపోతే ఇక ఎప్పటికీ కలుసుకోలేవు. 
క్రిష్: ఇప్పుడు ఎక్కడ ఉన్నారురా.. 
బాబీ: మన వాళ్లు వాళ్లని ఫాలో అవుతున్నారు. 
క్రిష్:  రేయ్ నేను ఇక్కడ మా కోసం ఇంత కష్టపడుతుంటే వాళ్లు నాన్న అట్లా ఎట్లా దూరం చేస్తాడు రా. రేయ్ నా సంపంగి ఊరు వెళ్లడం కాదు కనీసం ఈ పొలిమేర కూడా దాటనివ్వను. పదరా.. 

సత్య కారుకి క్రిష్‌ అడ్డంగా బైక్ పెడతాడు. అది చూసిన సత్య భయపడి కారు ఆపొద్దు పోనీ అని చెప్తుంది. కోపంతో సత్య క్రిష్ దగ్గరకు వస్తుంది. 

క్రిష్: ఎట్లా ఉంది సత్య..
సత్య: ఎందుకు అడ్డం పడుతున్నావ్.
క్రిష్: సత్య టెన్షన్ పడకు కూల్‌గా ఉండు. అసలే నీ ప్రాణం బాలేదు. నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నీతో మాట్లాడటానికి వచ్చా.
సత్య: నీతో మాట్లాడాలి అని లేదు. అసలు నీ ముఖం చూడాలి అని లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపో.
క్రిష్: నువ్వు హాస్పిటల్‌లో చేరిన నాటి నుంచి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా..
సంధ్య: ఎందుకు మా అక్కని విసిగిస్తావు. 
క్రిష్: నువ్వు ఏమైనా చేసుకో కొట్టు కొట్టించు నేను ఇక్కడి నుంచి వెళ్లను కానీ ఒక్క సారి నిన్ను ప్రేమిస్తున్నాను క్రిష్ అని ఒక్క మాట చెప్పు సత్య. రెక్కల గుర్రం మీద ఎగరేసుకుపోయి నిన్ను పెళ్లి చేసుకుంటా.
సత్య: అసలు నువ్వు మనిషివా రాక్షసుడివా ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావ్. ఒక్కసారి చెప్తే అర్థం కాదా. ఒక్కసారి నన్ను చంపేయ్ హాయిగా ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నందుకు మాధవ్ కోమాలో ఉన్నాడు. నీది రాక్షసత్వం. ప్రేమ ఇది కాదు. ప్రేమించడం ఇలా కాదు. నీకు భయపడి మా అమ్మానాన్న నన్ను మా పెద్దమ్మ వాళ్ల ఊరు పంపిస్తున్నారు. చూశావా నాకు పట్టిన గతి. 
క్రిష్: సత్య నీ మీద నా మనసులో ప్రేమ తప్ప ద్వేషం లేదు. నువ్వు అనుకున్నట్లు నేను రాక్షసుడిని కాదు. నన్ను రెచ్చగొట్టి మీ వాళ్లు నన్ను రాక్షసుడిని చేస్తున్నారు. ఇప్పుడు నా కంటి నుంచి దూరంగా నిన్ను పంపాలని చూస్తున్నారు. నమ్మకు సత్య మీ పెద్దొళ్లను నమ్మకు. నమ్మి నామీద ఉన్న ప్రేమ చంపకు. నేను మంచోడిని సత్య. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఒట్టేసి చెప్తున్నా. ఎవరికో భయపడి నువ్వు ఊరు దాటొద్దు. మా పెద్దొళ్లని తీసుకొస్తా మీ ఇంట్లో మాట్లాడిస్తా.
సత్య: నేను వెనక్కి వెళ్లాలి అని చెప్పడానికి నువ్వు ఎవరు.
క్రిష్: నీ ప్రాణాన్ని..నీ ప్రేమ పిచ్చొడిని..
సత్య: ఇంక ఆపుతావా. 
క్రిష్: మీ పెద్దొళ్లకి భయపడి నన్ను దూరం పెట్టావు అనుకో నిజంగానే పిచ్చోడిని అయిపోతా. ఆ పిచ్చిలో ఏం చేస్తానో నాకే తెలీదు. ఎవరిమీద తిరగబడతానో నాకో తెలీదు. నా ప్రాణం తీసుకుంటానో ఎవరి ప్రాణం తీసేస్తానో నాకే తెలీదు. దయచేసి ఆ పరిస్థితి తీసుకురాకు సత్య. 
సత్య: మనసులో..నిజమే వీడు అలాంటి రాక్షసుడే. మా వాళ్లని ఇబ్బంది పెడతాడు. సంధ్య ఇంటికి వెళ్లిపోదాం పద.
క్రిష్: నాకు తెలుసు సత్య ముందు నువ్వు కోపం తెచ్చుకున్నా తర్వాత నన్ను అర్థం చేసుకుంటావ్ అని తెలుసు. నీ మనసులో నా మీద ప్రేమ ఉంది అని తెలుసు సత్య. థ్యాంక్యూ సత్య. థ్యాంక్యూ.. 

సత్య, సంధ్యలను చూసి విశ్వనాథం ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. క్రిష్ అడ్డుపడి వెళ్లనివ్వలేదు అని సంధ్య జరిగింది చెప్తుంది. దీంతో మన జీవితాలు ఏమైపోతున్నాయి అని విశ్వనాథం కూలబడిపోతాడు. ఇక హర్ష వాడిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అని ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటాడని అంటాడు. 

హర్ష: ఇంతలా మనల్ని వెంటాడి వేధిస్తున్నాడు అంటే మనం వాడిని ఏదో ఒకటి చేయాలి నాన్న. నాన్న మీరు మాకు ఎప్పుడో చెప్పినట్లు గుర్తు సిటీకి కొత్తగా వచ్చిన పోలీస్‌కమిషనర్ రఘునందన్‌ మీ స్టూడెంట్ అన్నారు కదా ఆ రౌడీ విషయంలో తనని హెల్ప్ అడిగితే.
విశ్వనాథం: పరిచయాలను సొంత పనుల కోసం వాడుకోవడం నాకు ఇష్టం ఉండదు. 
హర్ష: మనం ఆయన చేతిలో పనే చేయమంటామ్ కదా..
విశాలాక్షి: మన ఇంటి సమస్య పరిష్కరించాలి అంటే వెళ్లాలి అండీ..
హర్ష: నాన్నా వెళ్దామా.. 

క్రిష్‌ని ఒప్పించలేదు అని భైరవిని మహదేవయ్య తిడతాడు. దీంతో మహదేవయ్య ఇద్దరూ కలిసి ఎందులో అయినా దూకి చావండి పీడా పోతుంది. అంటాడు. ఇంతలో మినిస్టర్ వస్తాడు. తన కూతురు పెళ్లికి తొందర పడుతుంది. ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందా అంటాడు. 

భైరవి: అంటే తమ్మి అది కొంచెం టైం కావాలి.
మినిస్టర్: కొంత టైం అంటే ఎంత కావాలి అక్క.
క్రిష్: ఒక జీవిత కాలం. నేను వేరే పిల్లని ఇష్టపడ్డా ఆ పిల్లేనే పెళ్లి చేసుకుంటా. మినిస్టర్ గారు మీరు మీ కూతురుకి వేరే పిలగాడిని చూసుకోండి. దయచేయండి..
మినిస్టర్: ఏం తమాషాలు ఆడుతున్నారా..
క్రిష్: అంత టైం కానీ ఓపిక కానీ నాకు లేదు మినిస్టర్.
మినిస్టర్: అదేం నాకు తెలీదు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిందే.
దేవా: కోపం పడకండి మినిస్టర్ గారు మా తమ్ముడు చిన్న పిల్లాడు వాడికి ఏం తెలీదు. వాడి మాటలు పట్టించుకోవద్దు. మీ కూతురు ఈ ఇంటి కోడలు అవ్వడం పక్కా. నాది హామీ.
క్రిష్: మినిస్టర్ గారు మీరు ఎలక్షన్‌ టైంలో హామీలు ఇస్తారు కదా ఇది అలాంటిదే. సీరియస్‌గా తీసుకోవద్దు. అన్నా నేను ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఆ దేవుడు దిగొచ్చినా మాట వినను. 
మినిస్టర్: నా కూతురు ఆశ పడింది అని నీకు అర్హత లేకున్నా కిందా మీద పడి నిన్ను ఎమ్మెల్యేని చేద్దాం అనుకున్నా. కానీ నీకు ఇప్పుడు టికెట్ కూడా రానివ్వను. మరోవైపు సత్య సంధ్య దగ్గర జరుగుతున్న దాని గురించి బాధపడుతుంది. ఇంతలో క్రిష్ సత్య ఇంటికి ఫోన్ చేస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read:  'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 20th: నిజం చెప్పేస్తా అన్న గురువుగారు.. గాయత్రీనే తన తల్లి అని నయనితో చెప్పిన విశాల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget