అన్వేషించండి

Satyabhama Serial Today February 16th: సత్యభామ సీరియల్: మాధవ్‌ గురించి నిజం తెలిసి కుమిలిపోయిన సత్య.. సంపంగిని ఒక్కసారి చూపించండి అని ఏడ్చిన క్రిష్‌!

Satyabhama Serial Today Episode మాధవ్‌ని అమెరికా తీసుకెళ్లిపోయారని తెలిసి కుమిలి కుమిలి సత్య ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode క్రిష్ డాక్టర్ గెటప్‌లో వచ్చి సత్యను చూస్తాడు. అప్పుడే సత్యకు ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో విశ్వనాథం డాక్టర్ అని క్రిష్‌ని పిలుస్తాడు. ఏం చేయాలి దొరికిపోతానేమో అని క్రిష్ అనుకుంటాడు. అప్పుడే నర్స్ రావడంతో నర్సును చూసుకో అని చెప్తాడు. ఇక నర్సుతో సత్యని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి క్రిష్ బయటకు వెళ్లిపోతాడు.

క్రిష్: రేయ్ నా సంపంగికి మెలకువ వచ్చిందిరా మాట్లాడుతుందిరా.. నవ్వుతుందిరా..
బాబీ: శుభవార్త చెప్పావు అన్న. 
క్రిష్: రేయ్ రేపు పొద్దుగాలే పోయి గుడిలో దేవుడికి కొబ్బరి కాయ కొట్టాలిరా. గుర్తుపెట్టుకో.. దానికంటే ముందు ముఖ్యమైన పని ఒకటి ఉంది. నా సంపంగిని చంపడానికి ప్రయత్నించిన ఆ కాళీ గాడిని ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలే. 
బాబీ: అన్న వాడు నీకు భయపడి పాతాళంలో భయపడి ఉంటాడు. 
క్రిష్: తవ్వి అయినా వాడిని కనిపెట్టాలి. ఏ చేతితో నా సంపంగిని పొడిచాడో ఆ చేతిని నరికేయాలి. అస్సలు వాడు నాకు ప్రాణాలతో కనిపించకూడదురా.. 
బాబీ: పద అన్నా.. 
క్రిష్: ఏడికి రా.. సంపంగి డిశ్చార్జి అయిన వరకు ఇక్కడే నా డ్యూటీ. మనం పోరగాళ్లు ఉన్నారు కదా వాళ్లందరినీ తీసుకొని వెళ్లి వెతుకు.

విశ్వనాథం: ఏంటిది సత్యని ఇంకా భ్రమలోనే ఉంచుతావా విశాలాక్షి. మాధవ్ గురించి నిజం ఎందుకు దాచావ్.. 
విశాలాక్షి: ఇప్పుడు అది ఉన్న పరిస్థితుల్లో నిజం చెప్పడం మంచిది కాదు అనిపించింది. అది ఆ సంబంధం గురించి ఎన్ని ఆశలు పెట్టుకుందో విన్నారు కదా.. 
విశ్వనాథం: అదృష్టం అనుకుంది కానీ దురుదృష్టం ఇంకా వెంటాడుతుంది అని తెలిస్తే తట్టుకోగలదా.. 

బాబీ: మొత్తం వెతికా అన్న వాడు యాడా లేడు అన్న. ఊరి  విడిచి వాడు పారిపోయాడు అన్న. 
క్రిష్: వాడి దోస్తానా అబద్ధం. వాడు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం. వాటి మాటలు అబద్ధం. చేతలు అబద్ధం. సత్యకు ఏం కాలేదు కాబట్టి వాడిని విడిచిపెట్టా. మొత్తం వెతకండి.. ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాడు నా కొడుకు. 
కాళీ: పక్కా ప్లాన్ వేసి పొడిచా అయినా ఆ సత్య బతికింది. కోమాలో ఉన్న మాధవ్‌ గాడిని అమెరికా తీసుకెళ్లిపోయారు. ఈ కాళీ గాడు ఓడిపోయాడు. ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నా. ఆ సత్యని ఏదో ఒకటి చేయాలి. 
కాళీఫ్రెండ్: అన్నా నువ్వు ఆ క్రిష్ గాడి ముందే సత్యని పొడిచావ్. వాడు నీ కోసం జల్లెడ పడుతున్నాడు. నువ్వు దొరికావ్ అనుకో అన్న మటన్ కట్ చేసినట్లు చేస్తాడు. 
కాళీ: రేయ్ ఈ కాళీ గాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు. ఆ సత్యని చావుకంటే పెద్ద శిక్ష వేస్తా. దాని జీవితం మీద దెబ్బ కొడతా. పరువు తీస్తా. జీవితంలో పెళ్లి కాకుండా చేస్తా. అప్పుడు తిప్పుతారా మీసం. 

సత్య: అమ్మ ఒకసారి మాధవ్ గారిని చూస్తాను. నాకు మెలకువ వచ్చినప్పటి నుంచి అత్తయ్య మామయ్య ఒక్కసారి కూడా నా దగ్గరకు రాలేదు. ఒకసారి వెళ్లి మాధవ్ గారిని చూసి వద్దాం.  
విశాలాక్షి: ధైర్యం కూడగట్టుకోవాలి కదా అమ్మ. చేదు నిజం చెప్పడానికి.
సత్య: చేదు నిజం ఏంటమ్మ.. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావ్ అమ్మా మాధవ్‌గారు ఎలా ఉన్నారు. నాన్న మీరు అయినా చెప్పండి.
విశాలాక్షి: మాధవ్ కోమాలో ఉన్నాడమ్మ. 
సత్య: ఏంటి.. తీసుకెళ్లండి.. ప్లీజ్ నాన్న అమ్మ నేను మాధవ్‌ని వెంటనే చూడాలి. 
విశ్వనాథం: చూడటానికి అతను ఇక్కడ లేడమ్మా.
సత్య: లేకపోవడం ఏంటి నాన్న. కోమాలో ఉన్న మనిషి ఏమైపోతాడు.
విశ్వనాథం: వాళ్ల అమ్మానాన్న అతన్ని తీసుకొని అమెరికా వెళ్లిపోయారు అమ్మ. 
సత్య: ఏంటి నాన్న ఏంటి మీరు చెప్పేది నా చుట్టూ ఇంత జరుగుతున్నా నాకు చెప్పకుండా దాచారా.. మాధవ్‌ గారి గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదా.. మాధవ్ నేను సమస్యలో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచారు. అలాంటి మంచి మనిషి కోమాలో ఉన్నాడని నాకు ఎందుకు చెప్పలేదు. కాల్ చేయండి నేను మాట్లాడాలి. ఎప్పటికైనా ఏం జరిగినా నేనే ఆ ఇంటి కోడల్ని అని కచ్చితంగా చెప్తాను. 
విశ్వనాథం: కాల్ చేసి లాభం లేదు అమ్మ. 
విశాలాక్షి: వాళ్లు మన సంబంధం కాదు అనుకొని వెళ్లిపోయారమ్మా. రౌడీకి తమ కొడుకును బలి ఇవ్వలేమని వెళ్లిపోయారు. మాధవ్ కోమాలో నుంచి బయటకు వస్తే నిన్ను తప్పు మరెవరినీ చేసుకోను అని తమని కూడా కాదు అంటుంది అని తీసుకెళ్లిపోయారు. 
విశ్వనాథం: సత్య నువ్వేం దిగులు పడకమ్మా మాధవ్ కంటే మంచి సంబంధం తీసుకొస్తా..
సత్య: నేను దిగులు పడుతుంది నా కోసం కాదు నాన్న నాకోసం నిలబడి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న మాధవ్ గురించి. 

సత్యని డిశ్చార్జి చేస్తారు. ఇంటికి వస్తారు. ఇక అక్కడే క్రిష్‌, బాబీ ఉండి చాటుగా చూస్తారు. సత్య ఇబ్బందికి క్రిష్‌ కంట కన్నీరు పెట్టుకుంటాడు. తన తప్పులేదు అని జరిగింది చెప్పాలని క్రిష్‌ లోపలికి వెళ్లాలని అనుకుంటాడు. ఇక క్రిష్‌ని సత్య తల్లిదండ్రులు చూస్తారు. క్రిష్‌ని అడ్డుకుంటారు. 

విశ్వనాథం: ఇదిగో కత్తి మమల్ని చంపాకే ఈ గడప దాటి లోపలికి వెళ్లు. ఇంకా చూస్తావేంటి కానీ. 
క్రిష్‌: ఎందుకు సార్ మీరు ఇంత మొండిగా ఉన్నారు.
విశ్వనాథం: మొండితనం నీదా మాదా.. కోపంగా చెప్పాం. బ్రతిమిలాడం అయినా మాట వినలేదు. ఇప్పుడు ఇంటి వరకు వచ్చేశావ్. నీ కారణంగా ఇప్పటికే సగం చచ్చి బతుకుతున్నాం.
క్రిష్‌: నా పరిస్థితి అలానే ఉంది. నా సత్యకు ఏమైందో ఎలా ఉందో అని నిద్ర రావడం లేదు. సత్యని చూడాలి అని నా మనసు గిలగిల కొట్టుకుంటుంది మాస్టారు. ఒక్కసారి సత్యని కలిసి వెళ్లిపోతా. మీ ముందే మాట్లాతా. అస్సలు బాధ పెట్టను సార్. నా మాట నమ్మండి. మీరు అయినా చెప్పండమ్మ. 
విశ్వనాథం: అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్‌రా  ఇంత జరిగాక అది నీ మొఖం ఎందుకు చూస్తుంది అనుకున్నావ్. 
క్రిష్‌: సత్యకు నేనంటే చాలా ఇష్టం. నేనంటే చాలా ప్రేమ. మీకు భయపడి చెప్పట్లేదు అంతే.
విశ్వనాథం: మా ఖర్మరా నువ్వు పిచ్చొడివో మమల్ని పిచ్చొడిని చేస్తున్నావో మాకు అర్థం కావడం లేదు. ఇదే కత్తి సత్యచేతికి ఇచ్చి పోయి ముందు నిలబడు నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకే తెలుస్తుంది. ఆ కత్తితో నీ గుండెల్లో పొడుస్తుంది.
క్రిష్: నేను నమ్మను. ఒకవేళ అదే నిజం అయితే సత్య చేతిల్లో చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. సార్ నన్ను మాత్రం ఆపకండి సార్.. ప్లీజ్ సార్..
విశ్వనాథం: భగవంతుడా వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది. 
విశాలాక్షి: బంగారం లాంటి సత్య భవిష్యత్ నీ కారణంగా బుగ్గిపాలైపోయింది. నరకం అనుభవించింది. చేయని తప్పులకు మా అందరితో మాటలు పడింది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read:  ‘హనుమాన్‘తో ‘శ్రీఆంజనేయం‘ - ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేసిన తేజ సజ్జ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Game Changer Pre Release Event LIVE: 'గేమ్ చేంజర్' ఎన్నికలకు ముందొస్తే వైసీపీకి ఆ 11 వచ్చేవి కాదు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్
'గేమ్ చేంజర్' ఎన్నికలకు ముందొస్తే వైసీపీకి ఆ 11 వచ్చేవి కాదు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Game Changer Pre Release Event LIVE: 'గేమ్ చేంజర్' ఎన్నికలకు ముందొస్తే వైసీపీకి ఆ 11 వచ్చేవి కాదు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్
'గేమ్ చేంజర్' ఎన్నికలకు ముందొస్తే వైసీపీకి ఆ 11 వచ్చేవి కాదు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Indian Army: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - నలుగురు సైనికులు దుర్మరణం
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - నలుగురు సైనికులు దుర్మరణం
Embed widget