Satyabhama Serial Today February 14th: సత్యభామ సీరియల్: సత్యను కత్తితో పొడిచేసిన కాళీ.. కోమాలో మాధవ్.. కుమిలిపోతున్న క్రిష్!
Satyabhama Serial Today Episode క్రిష్ చెప్పాడని కాళీ మాధవ్ కారుకు అడ్డంగా వెళ్లి మాధవ్, సత్యలను కత్తితో పొడిచేయడంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode క్రిష్ వెనకాలే బాబీ పరుగున వచ్చి అన్న మనం మోసపోయామన్నా.. ఆ కాళీ మనకి వెన్నుపోటు పొడిచాడని చెప్తాడు. వాడు మనకు వెన్నుపోటు పొడటం ఏంటని క్రిష్ అడుగుతాడు. దీంతో బాబీ వాడు మనతో క్లోజ్‌గా ఉన్నది వదిన మీద పగ తీర్చుకోవడానికే అన్న. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది వదినను చంపాలి అని చూస్తున్నాడు అన్న అని చెప్తాడు. ఏం చెప్తున్నావ్‌రా అని క్రిష్ అడిగితే చాటుగా విన్నమాటలు చెప్తాడు బాబీ. క్రిష్ షాక్ అయిపోతాడు. వదినను ఎలా అయినా కాపాడాలి అన్న అని బాబీ అనడంతో క్రిష్ వెంటనే బైక్ తీసుకొని వెళ్తాడు.
సత్య: మిమల్ని ఒకటి అడగనా.. మనిద్దరికి ఇంతకు ముందు పరిచయం లేదు. కేవలం పెళ్లి చూపుల రిలేషన్ మాత్రమే. నా ప్రమేయం లేకుండా నేను ఓ సమస్యలో ఇరుక్కున్నాను. కాదు మునిగిపోయాను. అది పాములా నా మెడకు చుట్టుకుంది ఇవన్నీ తెలిసి కూడా ఏ ధైర్యంతో నా పక్కన నిల్చొన్నారు. నేను అంటే అంత ఇష్టమా.
మాధవ్: ఇష్టం కాదు. ప్రేమ..
సత్య: రెండూ ఒకటే కదా..
మాధవ్: కాదు ఇష్టం పక్కన ఉన్న వరకే ఉంటుంది. ప్రేమ ప్రాణం పోయేంత వరకు నా ప్రేమ ఉంటుంది. ఇంతలో కాళీ మాధవ్ కారుకి అడ్డంగా నిల్చొంటాడు.
సత్య: కాళీ గాడు.. ఆ క్రిష్ గాడి చెంచా.. కారు వెనక్కి తిప్పండి వెళ్లిపోదాం.
మాధవ్: భయపడితే ఎప్పుడూ భయపడుతూనే ఉండాలి. ఒక్కసారి సెటిల్ చేశామనుకో ఇక ఏ సమస్య ఉండదు.
సత్య: వాళ్లు కిరాతకులు మాధవ్..
మాధవ్: అంతే కదా అమృతం తాగిన దేవతలు కాదు కదా..
సత్య: మాధవ్ గారు..
కాళీ: హీరో.. హీరోయిన్.. నువ్వు హీరోయిన్‌వే వదినా కానీ వీడు హీరో కాదు. హీరో మా అన్న.. నువ్వు ఉండాల్సింది మా అన్న క్రిష్ పక్కన. అప్పుడే ఫ్రేమ్ నిండుగా ఉంటుంది.
మాధవ్: ఇది చెప్పడానికే కారు ఆపావా చెప్పావు కదా ఇక వెళ్లు. వెళ్లి మీ అన్నకి చెప్పు వాడు హీరో కాదు విలన్ అని..
కాళీ: వదినా తప్పు చేస్తున్నావ్.. అన్నని ప్రేమించావ్ ఈ అమెరికా వాడు కనిపించగానే మా అన్నని మోసం చేశావ్.. చెంప దెబ్బ కొట్టినావ్..
సత్య: ఈ సారి కనిపిస్తే చెంప దెబ్బ కాదు చెప్పుతో కొడతా అని చెప్పు.
కాళీ: నీ ధైర్యం చూసుకొనేరా వదిన అన్నకి ఎదురుతిరుగుతుంది. అందుకే నీ చాప్టర్ క్లోజ్ చేయమని మా అన్న క్రిష్ పంపించాడు. మా అన్న నీ చావుకు ముహూర్తం పెట్టమన్నాడు.
మాధవ్: రారా ఎవరి చావు ఎవరి చేతిలో ఉందో చూద్దాం..
కాళీ: నిజంగా అడ్డురాకు వదినా నీ మీద ఈగ కూడా వాలద్దని అన్న చెప్పాడు. రేయ్ ఇంకా చూస్తారు ఏంట్రా కానివ్వండి.. మాధవ్ రౌడీలను కొడతాడు. ఇంతలో కాళీ ఫ్రెండ్ మాధవ్ తలమీద కొట్టేస్తాడు. మాధవ్ కింద పడిపోతాడు. సత్య కాళీని కొడుతుంది. మాధవ్‌ని చంపేశా నిన్ను కూడా చంపేస్తా అని సత్యని పొడిచేస్తాడు.. అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు.. కాళీ అని గట్టిగా అరుస్తాడు.. కాళీ వాళ్లు పారిపోతారు. సత్య కూడా కింద పడిపోతుంది. క్రిష్ ఏడుస్తూ సత్యని లేపుతాడు. బాబీ కూడా అక్కడికి వస్తాడు. మరోవైపు విశ్వనాథానికి కాల్ వస్తుంది. కంగారుగా ఫ్యామిలీ అంతా పరుగులు తీస్తారు. మరోవైపు శేఖర్ వాళ్లకి విషయం తెలుస్తుంది. సత్య, మాధవ్‌లను హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. రెండు ఫ్యామిలీలు గట్టిగా ఏడుస్తారు.
బాబీ: అన్న పోదాం అన్న..
క్రిష్: రేయ్ ఎక్కడికి పోతావ్ రా. ఎట్లా పోదాంరా.. రేయ్ లోపల నా సత్య రక్తంతో సోయలేకుండా పడుందిరా విడిచిపెట్టి ఎట్లా పోదాంరా..
బాబీ: నీ బాధ నాకు తెలుసు అన్న.. లోపల నుంచి పొంచి వస్తున్న దుఃఖాన్ని ఎంత ఆపుకుంటున్నావో తెలుసు అన్న కానీ ఒక్క మాట అన్న వాళ్లు గనుక నిన్ను ఇక్కడ చూస్తే వదినను మాధవ్‌ను నువ్వే పొడిచావ్ అనుకుంటారు. నీ మీద అనుమానం వస్తుంది అన్న. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది అంత మంచిది కాదు అన్న. ఇప్పటికే వాళ్లు వదినను నిన్ను దూరం చేశారు. ఇప్పుడు ఈ షాకుతో వదినను పూర్తిగా దూరం చేసేస్తారు.
క్రిష్: రేయ్ వాళ్లు చెప్తే మీ వదిన నమ్ముతుందా ఏంటిరా.. నా ప్రేమ ఏంటో నేను ఎలాంటి వాడినో మీ వదినకు తెలుసురా.. నేను అంటే తనకి ప్రాణంరా..
బాబీ: వదిన నిన్ను అపార్థం చేసుకుంటే నీ ప్రేమ ముక్కలైపోతుంది అన్న.
క్రిష్: రేయ్ బాబీ ఎప్పుడో ఏదో అవుతుంది అని ఇప్పుడు నేను సత్యని వదిలి వెళ్లిపోలేనురా. తను మంచిగా అయి ఇంటికి పోయే వరకు నేను ఎక్కడికి వెళ్లనురా ఇక్కడే ఉంటా. ఎట్లా అయినా సరే సత్యను చూడాలిరా.. సత్యతో మాట్లాడాలిరా.. నా వల్లే కదరా తనకి ఈ పరిస్థితి వచ్చింది. అందుకే తనతో మాట్లాడాలిరా..
బాబీ: ఇదంతా చేసింది ఆ కాళీ గాడు కదన్న.
క్రిష్: వాడిని నేను నమ్మబట్టే కదరా ఇదంతా జరిగింది. అంటే తప్పు నాదే కదా..
బాబీ: అన్నా ఈ మాట నాతో అంటే అన్నావు కానీ బయట ఎవరితో అనకే నిన్ను ఆ కాళీ గాడితో సమానంగా చూస్తారు. నువ్వేక్కడ వాడెక్కడ నీ మీద కోపం ఆ కాళీ గాడు వదిన మీద చూపించాడు.
క్రిష్: నా సత్య క్షేమంగా బయటపడాలి. నీదే భారం అని వినాయకుడిని కోరుకుంటాడు. ఇక డాక్టర్ వచ్చి మాధవ్ తలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల కోమాలోకి వెళ్లాడని చెప్తాడు. సత్యకు ప్రాణాపాయం తప్పిందని చెప్తారు. సునంద ఏడిస్తే విశాలాక్షి ఓదార్చుతుంది. మాధవ్ మాధవ్ అంటూ గట్టిగా ఏడుస్తుంది. ఇక శేఖర్ మాధవ్‌ని తీసుకొని అమెరికా వెళ్లిపోదాం అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ప్రియాంక: రహస్యంగా పెళ్లి, ఏడాదికే ఎండ్ కార్డ్ వేసిన సీరియల్ నటి ప్రియాంక?