Satyabhama Serial Today April 11th: సత్యభామ సీరియల్: ఫుల్లుగా తాగి సంపంగి గదికి వెళ్లనని గోల చేసిన క్రిష్.. జీవితంలో క్షమించనని భార్యతో చెప్పిన హర్ష!
Satyabhama Serial Today Episode తన కూతుర్ని నీ పుట్టింటి వాళ్లు ఏడిపిస్తున్నారు అని సత్యతో మహదేవయ్య చెప్పడం తన తల్లిదండ్రులు అలా చేయరని సత్య చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode తన ఇంట్లో సత్యను ఎవరైనా సతాయిస్తున్నారా.. ఇబ్బంది పెట్టారా.. ఏమైనా అంటున్నారా.. ఈ ఇంట్లో నీకు ఏమైనా లోటు జరిగిందా చెప్పమ్మా అని మహదేవయ్య సత్యని అడుగుతాడు. లేదు అని సత్య చెప్తుంది. దీంతో మహదేవయ్య మరి మీ ఇంట్లో వాళ్లు ఎందుకు నా కూతుర్ని సతాయిస్తున్నారు తనని ఏడిపిస్తున్నారు అని అడుగుతాడు.
సత్య: మా వాళ్లు ఎప్పుడూ అలా చేయరు.
మహదేవయ్య: అంటే నా కూతురు అబద్ధం చెప్పిందా.. నేను అబద్ధం చెప్తున్నానా..
సత్య: అలా అని కాదు.. అది..
మహదేవయ్య: మరి.. మీ అన్న నా బిడ్డను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు తెలుసు. ఈడ నిన్ను మేం ఏడిపిస్తే ఆడ నా బిడ్డను ఏడిపించడానికి మరి ఇక్కడ మేం నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం అక్కడ నా బిడ్డని ఏం చేయాలి నెత్తిన పెట్టి చూసుకోవాలి. కానీ కష్టాలు పెడుతున్నారు ఎందుకు అట్లా.. నా కొడుకు కోరుకున్నాడు అని నిన్ను ఇచ్చి పెళ్లి చేశా.. మీ అన్న కోరుకున్నాడు అని నా బిడ్డను ఇచ్చి చేశా.. మీ నాన్న ఉద్యోగం తీయించాలి అంటే ఒక్క నిమిషం చాలు. మీ అన్నని జైలుకి పంపాలి అంటే ఒక్క ఫోన్ చాలు. నా బిడ్డతో ఒక్క కంప్లైంట్ ఇప్పించాను అనుకో ఊచలు లెక్కిస్తాడు. ఇంకోసారి నా బిడ్డ నాకు కంప్లైంట్ ఇస్తే నేను చేసే పని ఇదే. మీ వాళ్లకు చెప్పు. ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలీదు. ఆడ నా బిడ్డ కంట్లో నీటి చుక్క కారితే ఈడ నీ కంట్లో నెత్తుటి చుక్క కారుతుంది.
ఏడుస్తూ గదికి వచ్చిన సత్య మామ మాటలు తలచుకొని బాధ పడుతుంది. ఇంతలో తన చెల్లి సంధ్య ఫోన్ చేస్తుంది.
సంధ్య: వచ్చేయ్ అక్క నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయ్.. నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయ్. అన్నీ ప్రాబ్లమ్సే అక్క. నందిని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అన్నీ ప్రాబ్లమ్సే. ఏ రోజు ప్రశాంతంగా గడవడం లేదు.
సత్య: ఏమంటుంది.
సంధ్య: ప్రతి చిన్న విషయానికి గొడవ పెడుతుంది. అమ్మా నాన్నలకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు.
సత్య: అన్నయ్య ఏం చేస్తున్నాడు.
సంధ్య: చెప్తున్నాడు. బుజ్జగిస్తున్నాడు. కానీ వినడం లేదు. గొడవ పడుతుంది. వాళ్ల నాన్నకు కంప్లైంట్ ఇచ్చింది. కూతురు చెప్పగానే వచ్చి ఇంటి మీద పడటమేనా.. బెదిరించడమేనా.. తప్పు అంతా అన్నయ్యదే అన్నట్లు మాట్లాడి వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. అంతా నీ వల్లే. నువ్వు ఆ ఇంటికి కోడలిగా వెళ్లడం వల్లే కదా ఇదంతా. నువ్వు చేసిన తప్పు వల్ల అందరం శిక్ష అనుభవిస్తున్నాం. ఈ గొడవలు ఇంతటితో ఆగేలా లేవు అక్క.
సత్య: సంధ్య కంగారు పడకు. నేను ఉన్నా కదా.. ఏం కాకుండా నేను చూసుకుంటా.. సంధ్య ఫోన్ కట్ చేసేస్తుంది. నేను ఇక్కడ కష్ట పడుతున్నాను అనుకొని అన్నయ్య ఆ కోపం నందిని మీద చూపిస్తున్నాడు. దీనికి పరిష్కారం నా దగ్గర ఉంది. నేనే ఏదో ఒకటి చేయాలి.
మరోవైపు రాత్రి క్రిష్ ఫుల్లగా తాగి తూగుతూ ఇంటికి వస్తాడు. భైరవి పిలిచినా గుర్తుపట్టడు. ఎవరు అని అడుగుతాడు. వింతగా ప్రవర్తిస్తాడు. సోఫాలో పడిపోతాడు. రూంలో పడుకో అని భైరవి అంటుంది.
క్రిష్: ఈడ పడుకుంటే ఏంది.. సత్రంలో పడుకుంటే ఏంది.. రూంలో పడుకుంటే ఏంది.. పెళ్లి అయిన బ్రహ్మచారి ఎక్కడ పడుకున్నా ఒకటే. కాషాయం కట్టినట్లే.. నేను ఏక్ నిరంజన్.. ఏక్ నిరంజన్..
భైరవి: సత్యతో ఏంటే గుడ్లు అప్పగించి తమాషా చూస్తున్నావా రా ఇటు.. నా చిన్న నీ వల్లే కరాబు అవుతున్నాడు. తాగి పిచ్చోడిలా అవుతున్నాడు.
సత్య: మీ అబ్బాయికి తాగడం కొత్తేమీ కాదు అత్తయ్య. పెళ్లికి ముందే అలవాటు ఉంది.
భైరవి: అలా అని వాడి ఖర్మకు వాడిని విడిచి పెడతావా. నీకు ఏం సంబంధం లేదా.. మార్చుకోవా.. ఇంతకు ముందే నీకు చెప్పా.. మళ్లీ చెప్తున్నా మొగుడు చెప్పు చేతుల్లో లేడు అంటే కారణం కట్టుకున్న పెళ్లామే..
క్రిష్: వావ్..సూపర్.. ముత్యం లాంటి మాట చెప్పింది ఎవరో.. అదే మాట నా పెళ్లానికి కూడా చెప్పారా.. మీరు ఎవరు..
భైరవి: ఏందే అది సినిమా చూస్తున్నావా మొగుడుని లోపలికి తీసుకెళ్లవా అది నేనే చెప్పాలా..
క్రిష్: అమ్మా నేను ఆ సివంగి రూమ్‌కి పోనే అది నాకాళ్లు చేతులు కట్టేస్తుంది.
మరోవైపు నందిని బెడ్ మీద బట్టలు చిందర వందరగా పడేసి ఉంటుంది. హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటుంది. అది చూసిన హర్ష ఏంటి ఇదంతా అని అడుగుతాడు. నందిని నీ బట్టలే అంటుంది. నందిని బట్టులు తీసిన హర్ష ఇది నా బట్టలా అని అడుగుతాడు. అన్నీ సర్దుకోమని నందినికి చెప్తే నీకు ఇప్పుడు ఏం పని ఉందా లేకపోతే అన్నీ సర్దేయ్ అని అంటుంది. నేనా అని హర్ష అడిగితే నీ పెళ్లం బట్టలే కదా సర్దేయ్ అని చెప్తుంది. నందిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. తన తండ్రి డబ్బు ఇస్తున్నాడు కదా పని ఆమెను పెట్టుకో అని అంటుంది.
హర్ష: నా స్వార్థం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను అని ఈ నిమిషం వరకు బాధ పడుతున్నాను. నిన్ను కష్ట పెట్టాను అని ఫీలవుతున్నాను. ఎలా అయినా సరే నిన్ను సంతోషంగా చూసుకోవాలి అని ఆశపడుతున్నాను. ఆరాట పడుతున్నాను. కానీ నువ్వు నా ఆశల మీద నీళ్లు చల్లావు. నీ గురించి జాలి పడకూడదు అనేలా చేశావ్. నీ మీద అసహ్యం వచ్చేలా చేశావ్.
నందిని: మనసులో.. నాకు కావాల్సింది కూడా అదే.
హర్ష: నువ్వు ఎంత బాధ పెడుతున్నా మా అమ్మా నాన్న నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మీ నాన్న నా పొజిషన్‌లో ఉండి ఉంటే స్పాట్‌లోనే అడ్డంగా నరికేవాడు. నేను కాబట్టి భరిస్తున్నాను. గుర్తించుకో నువ్వు ఈ రోజు చేసిన తప్పునకు ఈ జన్మలో నిన్ను క్షమించను. నీకు దగ్గర కాను. ఎవరికి కంప్లైంట్ ఇస్తావో ఇచ్చుకో.
నందిని: ఇదే కదా రాజా నీ నుంచి నేను కోరుకున్నది. అయినా ఇంత రెచ్చగొట్టినా సర్దుకుపోతావ్ ఏంటి. నన్ను మెడ పట్టి బయటకు గెంటవేంటి. ఆ రోజు ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు మనం విడాకులు తీసుకుంటామో..
మరోవైపు విశ్వనాథం బావ మాటలు తలచుకొని బాధ పడుతాడు. ఇంతలో సత్య తండ్రికి కాల్ చేస్తుంది. పరధ్యానంలో ఉండి విశ్వనాథం పట్టించుకోడు. విశాలాక్షి చూసి సత్య కాల్ చేసింది అని చెప్తుంది. ఇక విశ్వనాథం కూతుర్ని నువ్వు అక్కడ ఎలా ఉన్నావని అడుగుతాడు. దీంతో సత్య సంతోషంగా ఉన్నాను నాన్న అంటుంది. దాంతో విశ్వనాథం నాకు ఎందుకు అమ్మ అలా అనిపించడం లేదు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.