Satyabhama Serial Sandhya: 'సత్యభామ' సీరియల్ సంధ్యకు మరో ఆఫర్... 'భానుమతి'లోకి మహాదేవయ్య గారి కోడలు ఎంట్రీ
Satyabhama Serial Actress Akhila Gowlikar: సత్యభామ సీరియల్ ద్వారా తెలుగు వీక్షకులలో పేరు తెచ్చుకున్న నటి అఖిలా గోవాలికర్. ఇప్పుడు ఆమెకు 'భానుమతి' సీరియల్ చేసే అవకాశం వచ్చింది.

స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ 'సత్యభామ' (Satyabhama Serial) గుర్తు ఉందా? అందులో సంధ్య రోల్ చేసిన అమ్మాయి గుర్తు ఉందా? ఆ అమ్మాయే ఈ అమ్మాయి... పేరు అఖిలా గోవాలికర్ (Akhila Gowlikar). ఇప్పుడు ఈ అమ్మాయికి మరో సీరియల్ ఆఫర్ వచ్చింది.
'భానుమతి'లో మహాదేవయ్య గారి కోడలు
Star Maa Bhanumathi Serial Cast: స్టార్ మాలో ఇటీవల ప్రారంభమైన కొత్త సీరియల్ 'భానుమతి'. అందులో అఖిలకు అవకాశం వచ్చింది. ఆ విషయం చెప్పడంతో పాటు తన కొత్త లుక్ కూడా రివీల్ చేసింది అఖిల. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది.
'సత్యభామ'లో సత్య సిస్టర్ సంధ్య పాత్రలో నటించింది అఖిల. మహదేవయ్య అసలైన చిన్న కొడుకు సంజయ్ భార్యగా తనదైన నటనతో వీక్షకులను ఆకట్టుకుంది. ఆ పాత్రతో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు 'భానుమతి'లో లుక్ చూస్తుంటే... ట్రెడిషనల్ రోల్ అని అర్థం అవుతోంది. మరి ఈ క్యారెక్టర్ ఆవిడకు ఎటువంటి పేరు తీసుకు వస్తుందో చూడాలి. ఇప్పటి వరకు తాను ఇటువంటి రోల్ చేయలేదని అఖిల పేర్కొంది. ఇటువంటి పాత్రలో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.
Also Read: ఎవరీ ఐశ్వర్య? స్టార్ మా సీరియల్ 'భానుమతి'లో విలన్ గురించి తెల్సా... సినిమాల్లోనూ నటించిందండోయ్!
View this post on Instagram
అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియో సంస్థ ఈ 'భానుమతి' సీరియల్ ప్రొడ్యూస్ చేస్తోంది. 'భానుమతి'లో తన లుక్ రివీల్ చేయడానికి ఒక్క రోజు ముందు అన్నపూర్ణ స్టూడియోలో అడిగిన ఫోటోలను అఖిల షేర్ చేసింది. ఎప్పటి నుంచో తాను అన్నపూర్ణ స్టూడియో సంస్థలో పని చేయాలని అనుకుంటున్నానని, ఆ అవకాశం ఇప్పటికి వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.
View this post on Instagram





















