Satyabhama Serial Today January 6th: సత్యభామ సీరియల్: పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు.. మహదేవయ్య జోరు మామూలుగా లేదుగా!
Satyabhama Today Episode సత్య, మహదేవయ్య ఒకరికి ఒకరు ఆఫర్లు ఇచ్చుకోవడం ఇద్దరూ తగ్గేది లే అంటూ ఛాలెంజ్‌లు చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode క్రిష్ ఫ్రెండ్స్ క్రిష్ ఎలక్షన్‌లో సత్య వైపు నిల్చొంటాడా.. మహదేవయ్య వైపు నిల్చొంటాడా.. అని మాట్లాడుకుంటారు. ఇద్దరూ పొట్లాడుకుంటూ చివరకు బొమ్మా బొరుసు వేస్తారు. ఇంతలో క్రిష్ వచ్చి కాయిన్ పట్టుకొని నేను ఎవరి వైపు ఉండాలో నేను తీసుకోవాల్సిన నిర్ణయం అని అంటాడు. ఎవరి వైపు ఉండాలని నిర్ణయం తీసుకున్నావ్ అన్నా అని వాళ్లు అడిగితే అంత ఈజీ కాదురా అని అంటాడు.
బాపుకి మాట ఇచ్చానని క్రిష్ అంటే అతని ఫ్రెండ్స్ అది వదిన ఎలక్షన్‌లో నిల్చొంటా అని చెప్పక ముందు మాట అని ఇప్పుడు వదిన కూడా నీ మద్దతు కోసం ఎదురు చూస్తుంటుంది కదా తనని వదిలేయడం తప్పు కదా వదిన పట్ల నీకు బాధ్యత లేదా అంటారు. దానికి క్రిష్ ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నా అని అంటాడు.
క్రిష్: కని పెంచిన బాపు రుణం తీర్చుకోవాలి కదరా. అలా అని సత్యని ఎలా వదిలుకోవాలి. బాపుకి నేను అవసరం మాత్రమే కానీ సత్యకి నేనే అన్నీ. నేను పక్కకి లేకపోతే తను ఒంటరి అయిపోతుందిరా. నేను నిర్ణయం మార్చుకుంటా ఏమో అని తను వెయిట్ చేస్తుంది. తను మనసు మార్చుకుంటుందేమో అని నేను వెయిట్ చేస్తున్నా. రోజూ ఈ విషయంలో ఇంట్లో కిరికిరి నడుస్తుంది. ఏటూ చెప్పలేకపోతున్నా. నాకు అటు బాపు సంతోషం కావాలి ఇటు సత్య సంతోషం కావాలి.
ఫ్రెండ్: ఎట్లా జరుగుతుంది వదిననే తగ్గాలి.
క్రిష్: రేయ్ తను ఎట్లా తగ్గాలిరా. తను న్యాయం దిక్కు ఉంది. పోట్లాడుతుంది. తను తగ్గితే ఎట్లా. ఇక నేను బాపుని తగ్గమని చెప్తే అదే నేను బాపుతో మాట్లాడిన ఆఖరి మాట అవుతుంది. బాపు ఎట్లా అయినా ఎమ్మెల్యే అవ్వాల్సిందే.
ఫ్రెండ్: నీ నెత్తి నొప్పి నువ్వే పడు అన్నా కావాలంటే బొమ్మ బొరుసు వేసుకో.
క్రిష్ బొమ్మ బొరుసు వేస్తాడు. అయితే కాయిన్ మధ్యలో నిల్చొండిపోతుంది. దేవుడికి కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదని అనుకుంటారు. మరోవైపు మహదేవయ్య ఆలోచిస్తూ ఉంటే అక్కడికి భైరవి వస్తుంది. చిన్నా మారిపోయాడు వాడు కొట్టింది పనోడు కాదు మనల్నే అని పనోడిని తిట్టలేదు మననే తిట్టాడు అని సత్య మర్యాద కాపాడటం వాడి బాధ్యత అని తేల్చేశాడని చిన్నా మన చేయి జారిపోయాడు అని వాడిని మర్చిపో అని అంటుంది.
మహదేవయ్య: వాడు ఎప్పటికీ నా దిక్కే ఉంటాడు.
భైరవి: వాడు ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్తే అది చేశాడు. కానీ ఇప్పుడు అలా లేదు. నువ్వంటే అంత ఇష్టం ఉన్నవాడు సత్యని అడ్డుకోలేకపోతున్నాడు. పెళ్లానికి ఎదురు నిలబడలేకపోతున్నాడు.
మహదేవయ్య: వాడు తన మాట వినడు. నేను వాడిని దూరం పెట్టను.
భైరవి: వాడిని దూరం పెట్టకు కానీ నీ పెద్దొడు రుద్రని దగ్గర పెట్టుకో. సత్య దూకుడు ఆపాలి అంటే నీ పక్కన రుద్ర లాంటి వాడు ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు ఈ టైంకి రుద్ర ఇంట్లో ఉండాలి అంటే.
సంధ్య సంజయ్‌కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. ఎవరూ సత్యని సపోర్ట్ చేయలేదు అని చెప్తుంది. నువ్వు అయినా సపోర్ట్ చేయ్ అంటే సంధ్య చేయను అని అంటుంది. అక్క ఆవేశం చూస్తే భయంగా ఉందని మనం దూరం అయిపోతామేమో అని అంటుంది. మొత్తం నేను చూసుకుంటా అన్న సంజయ్ సంధ్య తన దారిలోకి వచ్చిందని అంటాడు. సత్య దిగులుగా ఇంటికి వస్తే మహదేవయ్య అడ్డుకొని రేసుగుర్రంలా పుట్టింటికి వెళ్లి కుంటి గుర్రంలా వచ్చావ్ అని అంటాడు.
మహదేవయ్య: ఈ ఎలక్షన్‌లు నామినేషన్లు అన్నీ మర్చిపో ఇందుకు నీకు నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా నీ తప్పులన్నీ మాఫీ చేస్తా నీ పుట్టింటి జోలికి వెళ్లను. ఈ ఇంట్లో నీ కోడలు జాబ్ పక్కా చేస్తా ప్రశాంతంగా బతకొచ్చు.
సత్య: ఎవరు మీరా నేనా. నాకు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి టెన్షన్లు అలవాటు అయిపోయావి కానీ మిమల్ని నేను ప్రశాంతంగా ఉంచను. నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. మీరు రెండు పనులు చేస్తే మీకు ప్రశాంతత ఉంటుంది. ఎలక్షన్ నుంచి నేను దూరంగా ఉంటా. ఒకటి నా భర్తని మీరు స్వార్థం కోసం ఎప్పుడూ ప్రమాదంలోకి నెట్టకూడదు. రెండు మీరు ఎన్నికల్లో గెలిస్తే పేదవాళ్లకి అండగా నిలవాలి. ఈ రెండు విషయాల్లో మీరు నాకు హామీ ఇస్తే క్రిష్ మీ కన్న కొడుకు కాదు అనే నిజాన్ని జీవితాంతం నా గుండెల్లోనే దాచుకుంటా. ఎవ్వరికీ ఎప్పటికీ చెప్పను. ఏమంటారు. నా కండీషన్స్‌కి ఓకేనా.
మహదేవయ్య: పెద్దగా నవ్వుతూ కుక్క బిస్కెట్లు వేసి పులిని లోపలికి తీసుకురావాలి అనుకుంటున్నావా. కండీషన్లు పెట్టాల్సి నేను ఒప్పుకోవాల్సింది నువ్వు.
సత్య: బేరాలు లేవు మామయ్య ఎస్ ఆర్ నో ఒకటిచెప్పండి ఇప్పుడు మీరు కండీషన్లు పెట్టే స్థితిలో లేరు ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నారు.
మహదేవయ్య: బెదిరించకు ఈ మహదేవయ్యని బెదిరించాలని చూడకు. ఆ చిన్నా గాడు జీవితాంతం నాకు నా చావుకి మధ్య నిలబడాల్సిందే. నా బదులు వాడు ప్రమాదంలో పడాల్సిందే. అది నేను వాడికి రాసిన తలరాత. నేను ఎమ్మెల్యే అయ్యేది పేదవాళ్లని ఆదుకోవడానికి కాదు అడ్డొచ్చిన వాళ్లని తొక్కి పైకి ఎదగడానికి.
సత్య: సరే అయితే ఇద్దరి ఆఫర్లు క్యాన్సిల్ నేను నా నామినేషన్ వేస్తాను నన్ను ఎవరూ ఆపలేరు.
మహదేవయ్య: నీ వెనక ఎవరూ లేరు.
సత్య: వస్తారు ఇంకా రెండు రోజులు ఉందిగా.
హర్ష సత్య ఫొటో చూస్తూ బాధ పడుతుంటాడు. నందిని గదిలోకి వస్తుంది. సత్య విషయంలో తప్పు చేశానని బాధ పడుతున్నావా. వదిన ఏ నిర్ణయం అయినా ఆచితూచి తీసుకుంటుంది న్యాయంగా నిలబడే వారికి సపోర్ట్ చేయాలి అని అంటుంది. ఎప్పుడూ ఈ ఇంటి సమస్యలు తీర్చే వదిన మొదటి సారి అండగా ఉంటారు అని సాయం అడిగింది అందరూ తిట్టి పంపేశారు అని అంటుంది. సత్య ప్రమాదంలో ఉందని హర్ష అంటే.. చెల్లి కష్టంలో ఉంటే అన్న అండగా నిలవాలి తల్లికి సర్దిచెప్పాలి అని మైత్రికి సాయం చేసినప్పుడు నీకు నచ్చినట్లు చేశావ్ కదా అని అంటుంది. అందరూ సపోర్ట్ చేయడం మానేస్తే సత్య ఆలోచనలో పడుతుందని హర్ష అంటాడు. ఇక సత్య పుట్టింటి వాళ్ల మాటలు గుర్తు చేసుకుంటుంది. క్రిష్ సత్య దగ్గరకు వచ్చి పక్కన కూర్చొంటాడు. సత్య లేచి వెళ్లిపోతుంటే క్రిష్ ఆపుతాడు. ఏమైందని క్రిష్ అడిగితే ఒంటరి అయిపోయాను అని సత్య బాధ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!