Satyabhama Serial Today January 3rd: సత్యభామ సీరియల్: సత్యని కాల్చేసిన మహదేవయ్య.. పుట్టింట్లో కంగారు కంగారు.నందిని మీద ఫైర్!
Satyabhama Today Episode సత్యని మహదేవయ్య గన్‌తో కాల్చి చంపేసినట్లు విశాలాక్షి కల కని పుట్టింట్లో ఎవరూ సత్యకి సపోర్ట్ చేయకూడదని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode మహదేవయ్య సత్యతో నామినేషన్ వేయడానికి సంతకం పెట్టడానికి పది మంది కూడా నీకు లేరంట నీ మొగుడు చెప్పాడని నవ్వుతాడు. మీ రక్తం పంచుకుపుట్టిన కూతురే నా వైపు ఉంది. అలాగే అందరూ వస్తారని మీకు రోజు రోజుకి గండం మొదలవుతుందని అంటుంది. ఇక విశ్వనాథం ఇంట్లో అందరూ నందిని కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో నందిని వచ్చి పుట్టింటికి వెళ్లానని మా బాపుతో తాడో పేడో తేల్చుకోవాలని వెళ్లానని అంటుంది.
విశ్వనాథం: మాతో చెప్పకుండా ఎందుకు వెళ్లావమ్మా.. నువ్వు కూతిరిలా వెళ్లి గొడవ చేసినా మీ నాన్న కోడలిలా వెళ్లి గొడవ చేశావని మేమే రెచ్చగొట్టామని అంటారు. ఆయన పగ పెంచుకొని అక్కడ సత్యని ఇబ్బంది పెడతారు. ఇప్పటికే సత్య చేసిన పనులకే చాలా కష్టపడుతుంది.
సంధ్య: వదిన రెండు కుటుంబాల మధ్య గొడవ పెట్టేలా ఉంది ఇలా అయితే నేను సంజయ్ విడిపోతామేమో. ఎలా అయినా గొడవకు అడ్డు పడాలి.
నందిని: వదిన గురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మా బాపుని ఎలా కంట్రోల్‌లో పెట్టాలో వదినకు బాగా తెలుసు.
హర్ష: సత్య మీ బాపుని కంట్రోల్ చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావ్. తను ఆ ఇంటి కోడలు కలిసి మెలసి ఉండాలి. అత్తామామలకు గౌరవం ఇవ్వాలి.
సంధ్య: అయినా నువ్వు చేసిన పని ఏం బాలేదు వదినా. మీ బాపుకి మా అక్కకి మధ్య గొడవ జరుగుతుంది అని తెలిసి కూడా ఇంకా గొడవ పెంచావు. రాజకీయంగా సపోర్ట్ చేస్తానని అందరి ముందు చెప్పి వచ్చింది అక్క నామినేషన్ మీద సంతకం పెడుతుంది అంట.
నందిని: వదిన చేసింది మంచి పని అని అనిపించింది అందుకే చెప్పి వచ్చా.
సంధ్య: నువ్వు చేసిన పనికి మీ నాన్న మా ఫ్యామిలీ మీద కోపం చూపిస్తాడు.
నందిని: నేను కూడా ఈ ఫ్యామిలీ మనిషినే నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఎలా ఊరుకుంటా అనుకుంటా.
సంధ్య: ఏం చేస్తావ్ ఏం చేయగలవు ఆయనకు ఉన్న శక్తి ముందు మనం ఎంత.
నందిని: ఒక్కటి గుర్తు పెట్టుకో మా బాపు ఈ ఫ్యామిలీ జోలికి రావాలి అంటే వదినను దాటుకొని రావాలి.
సంధ్య: ఏంటి అన్నయ్య వదిన ఇలా మాట్లాడుతుంది ఈ తండ్రీ కూతుళ్లు ఎప్పటికైనా కలిసి పోతారు మనం మధ్యలో బాధపడాలి.
నందిని: ఎవరు ఎన్ని చెప్పినా నేను వినేదిలేదు. నా సపోర్ట్ వదినకే.
హర్ష: అసలు నందిని సత్యకి సపోర్ట్ చేసిందనే విషయం నీకు ఎలా తెలుసు.
సంధ్య: సంజయ్ అంటే నేను దొరికిపోతా. అక్కే చెప్పింది..
సత్య రాత్రి బెడ్ సర్దుతుంటే క్రిష్ వస్తాడు. క్రిష్ సరిగా మాట్లాడకుండా ముఖం తిప్పుకుంటే సత్య వెళ్లి గది బయటే మనం గొడవ పడాలి గదిలో సరదాగా సంతోషంగా ఉండాలి అని క్రిష్‌ని బెడ్ మీదకు లాగేస్తుంది. సత్యతో క్రిష్ నువ్వు ఎన్ని తింగరి వేషాలు వేసినా నేను భరించబట్టే మన కాపురం ఇలా అయినా ఉందని అని క్రిష్ అంటాడు. సొంత మొగుడే సపోర్ట్ చేయడం లేదని రేపటి నుంచి జైత్ర యాత్ర మొదలవుతుందని మొదటిగా మా పుట్టింటికి వెళ్తున్నా అని సత్య చెప్తుంది. ఉదయం సత్య రెడీ అయి వెళ్తుంటుంది. మహదేవయ్య చూసి ఆపుతారు. ఎక్కడికి వెళ్తున్నావ్ అంటే నామినేషన్ సంతకాలకు పది మంది కావాలి కదా నా ప్రయత్నాలు చేస్తున్నా అంటుంది. మహదేవయ్య సత్యని ఇంటి నుంచి కాలు బయట పెట్టొద్దని చెప్తాడు. నన్ను చూసి భయపడుతున్నారా అని అడుగుతుంది.
క్రిష్: సత్య ఇంక ఆపు బాపుకి ఎదురు తిరగకు.
సత్య: క్రిష్ నేను చాలా సార్లు చెప్పాను ఎలక్షన్ విషయంలో వెనక్కి తగ్గను మామయ్యగారికి చెప్పు నాకు అడ్డు పడొద్దు అని. నాకు ఎదురు తిరగొద్దని చెప్పు.
క్రిష్: సత్య మా బాపు మాట వినాల్సిందే ఎలక్షన్లో బాపుకి ఎదురు నిలబడొద్దు.
భైరవి: దానికి బతిమాలడం ఏంట్రా లోపల గదిలో పడేయ్.
క్రిష్: సత్య పరిస్థితి అక్కడి వరకు తీసుకురాకు. లోపలికి నడు.
సత్య: మీరు ఎంత చెప్పినా నేను మాట వినేది లేదు. నేను నా మనసు చెప్పినట్లు మాత్రమే నడుస్తాడు. ఎవరి మాట వినను.
మహదేవయ్య: కాలు బయట పెట్టు అప్పుడు చెప్తా
సత్య: ఏం చేస్తారు
మహదేవయ్య: గన్ గురిపెట్టి... చంపేస్తా.
క్రిష్: బాపు.
మహదేవయ్య: అయిపోయిందిరా నీ పెళ్లాన్ని కంట్రోల్ చేయడానికి నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఇక నేనే చూసుకుంటా.
సత్య: మీ రివాల్వర్లో గుళ్లు ఉంటే నా గుండె నిండా ధైర్యం ఉంది. మీరు నన్ను ఏం చేయలేరు. నన్ను చంపితే ఎమ్మెల్యే కాలేరు హంతకులు అవుతారు. జీవితాంతం చిప్పకూడు తింటారు అందుకు సిద్ధ పడితే కాల్చండి.
సత్య వెళ్తుంటే మహదేవయ్య పిలిచి గన్‌తో కాల్చేస్తాడు. సత్య సత్య అని కంగారుగా విశాలాక్షి ఏడుస్తు బయటకు వచ్చి సత్యని చంపేశాడు అని ఏడుస్తుంది,. ఇంట్లో అందరూ బయటకు వస్తారు. విశాలాక్షికి పీడ కల వచ్చిందని అందరూ సర్దిచెప్తారు. సత్య ఎలక్షన్‌లో నిలబడకూడదు అని అంటుంది. సత్యని కాపాడుకోవాలని చెప్తుంది. నామినేషన్‌కి సపోర్ట్ చేయొద్దని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారం బతికే ఉందా.. మరి రాజు తీసుకొచ్చిన శవం ఎవరిది? అసలేంటీ ట్విస్ట్!?