Satyabhama Serial Today January 30th: సత్యభామ సీరియల్: పరువు పోయే.. లేచిపోయిన సంధ్య.. సంజయ్‌తో పెళ్లి చేయమని క్రిష్‌ని కోరిన సంధ్య!
Satyabhama Today Episode సంధ్య సంజయ్‌కి కాల్ చేసి తనని పెళ్లి చేసుకోమని చెప్పి క్రిష్‌కి కాల్ చేసి పెళ్లి చేయకపోతే సూసైడ్ చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య సంధ్యకి పెళ్లి చూపులకు ఒప్పించడానికి వెళ్తే సంధ్య అడ్డం పడొద్దు అక్క అని ఏడుస్తుంది. దాంతో సత్య ఇష్టమైన వ్యక్తి మీద ఎవరైనా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. నీ విషయంలో నేను అదే చేస్తున్నాను అని అంటుంది. నువ్వు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నావ్. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు కష్టపడకూడదని అనుకుంటున్నాను అని సత్య అంటుంది.
సంధ్య: నాకు ఒకటి అర్థమైంది అక్క. నేను అందరూ ఉన్న అనాథని. నువ్వు బావతో ఉండటం నాకు ఇష్టం లేదు వదిలేయ్ అంటాను. బావని వదిలేస్తావా.
సత్య: నువ్వు ఉక్రోషంతో మాట్లాడుతున్నావ్ సంధ్య. నీతో చాలా చెప్పాలి అని ఉంది కానీ పెళ్లి వాళ్లు వచ్చేస్తున్నారు. నాన్న పరువు నిలబెట్టు. పెదాల మీద చిరునవ్వు అత్తుకొని ముద్దుగా పెళ్లి చూపుల్లో కూర్చొ పెళ్లి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మనిద్దరం మాట్లాడుకుందాం. ఇదిగో నీ కోసం ఈ చీర చూడు ఎంత బాగుందో పెళ్లి కొడుకు నిన్ను ఇలా చూస్తే ఇటు నుంచి ఇటే నిన్ను ఎత్తుకెళ్లిపోతాడు. రెడీ అవ్వమ్మా.
పెళ్లి వాళ్లు వస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. వాళ్లు చాలా సరదాగా అందరినీ వరసలు కలిపి చాలా సరదాగా మాట్లాడుతారు. అబ్బాయి వాళ్ల అమ్మ విశ్వనాథం వాళ్లతో తన కొడుకికి వచ్చిన సంబంధాలు అన్నీ తన భర్తే చెడగొట్టాడని విశ్వనాథం గారి అమ్మాయే తన కొడుకుకి సరైన జోడీ అని పట్టు పట్టి మరీ ఈ సంబంధం కావాలని అంటుంది. ఇక నందిని పొగిడి తనకు మంచి భర్త దొరికాడని మంచి ఫ్యామిలీ దొరికిందని అంటుంది. విశాలాక్షి కూడా మాకు మంచి కోడలు పొగిడిందని అంటుంది. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇంతలో సంధ్య హర్షకి కాల్ చేస్తుంది.
సంధ్య: నేను ఇక్కడ టెన్షన్ పడి చస్తున్నాను. నీకు చీమ కుట్టినట్లు లేదా. అవతల పెళ్లి వాళ్లు వచ్చారు ఏం చేయాలి నేను.
సంజయ్: ముందు నువ్వు పెళ్లి చూపుల్లో కూర్చొని పెళ్లి కొడుకు నచ్చలేదు అని చెప్పు తర్వాత మనకి ఓ సొల్యూషన్ చూద్దాం. మా బిగ్ డాడీని ఒప్పించాలి అంటే మీ అక్క తన కండీషన్‌కి ఒప్పుకోవాలి.
సంధ్య: ఒప్పుకోదు అస్సలు ఒప్పుకోదు. నాకు అదంతా తెలీదు. ఇది మన లైఫ్ మనం నిర్ణయం తీసుకోవాలి. ఎవరితోనూ మనకు సంబంధం లేదు. నువ్వు మీ బిగ్ డాడీ గురించి మర్చిపో. నేను మా అక్క గురించి మర్చిపోతా.
సంజయ్: మనసులో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది. సత్యని పోటీలో లేకుండా చేయడానికే కదా దీంతో పెళ్లి అని అంటుంది. కొంచెం టైం తీసుకొని చూద్దాం సంధ్య.
సంధ్య: నువ్వు లేకుండా నేను బతకను. అలా అని నేను ఒక్కదాన్నే నష్టపోను. అర్జెంటుగా గడప దాటి వచ్చి నా మెడలో తాళి కట్టు. లేదంటే నా చనిపోతున్నా అని లెటర్ రాస్తా. అందులో నా చావుకి నువ్వు, మీ బిగ్ డాడ్, మా అక్క అని రాసి చస్తా.
సంజయ్: మనసులో దీని ముఖం మండ ఇలా ఇరికిస్తుందేంటి. ఇప్పుడేం చేయాలి.
సంధ్య: వస్తావా చావనా. నన్ను ఎక్కడికి రమ్మంటావో చెప్పు.
సంజయ్: నువ్వు శివాలయానికి రా.
సంధ్య: తప్పకుండా వస్తావ్ కదా.
సంధ్య రెడీ అవుతూ ఉంటే సత్య చూసి నవ్వుకొని వెళ్లిపోతుంది. అక్క ఎలా అయినా తన పెళ్లి చేసేస్తుందని బావ సపోర్ట్ తీసుకోవాలి అనుకొని క్రిష్‌కి కాల్ చేస్తుంది. మా పెళ్లి మీరు చేయండి అని చెప్తుంది. శివాలయానికి నేను, సంజయ్ వస్తాం మీరు వచ్చి పెళ్లి చేయండి అని ఈ పెళ్లి ఆపాలి అని చూసినా అక్కకి విషయం చెప్పినా నా శవాన్ని చూస్తారని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వెళ్తే సత్యతో కష్టం వెళ్లకుంటే సంధ్యతో కష్టం అని క్రిష్ అనుకుంటాడు. ఇక సంధ్య ఓ నోట్ రాసి వెళ్లిపోతుంది. పెళ్లి వాళ్లు అమ్మాయిని తీసుకురావడంతో సత్య గదిలోకి వస్తుంది. అక్కడ సంధ్య ఉండదు. మొత్తం వెతికిన సత్య లెటర్ చూసి షాక్ అయిపోతుంది. మీరు నా కోసం వెతకొద్దు మీరు వెతికేలోపు మేం పెళ్లి చేసుకుంటాం అని రాసి అంటుంది. అది చూసి సత్య షాక్ అయిపోతుంది. చాలా పెద్ద తప్పు చేశావ్ సంధ్య అని సత్య ఏడుస్తుంది. ఇంతలో విశాలాక్షి వచ్చి సంధ్య గురించి అడుగుతుంది.
విశాలాక్షి కూడా లెటర్ చూసి ఏడుస్తుంది. విశ్వనాథం కూడా లోపలికి వస్తే విషయం తెలిసి షాక్ అయిపోతాడు. నందిని, హర్ష కూడా వస్తారు. అందరికీ విషయం తెలుస్తుంది. హర్ష చెల్లిని వెతికి తీసుకొస్తానని పెళ్లి వాళ్లని మ్యానేజ్ చేయమని సత్యతో చెప్తాడు. సత్య పెళ్లి వాళ్లతో నేనే ఏదో సర్ది చెప్పి పంపిస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కూతురి పరిస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప.. జ్యోత్స్న బుద్ధి ఇంత దారుణమా!





















