Satyabhama Serial Today February 19th: సత్యభామ సీరియల్: పాతికేళ్ల నిజం తెలుసుకున్న భైరవి.. కంట తడి పెట్టించిన తల్లీకొడుకులు.. క్రిష్ పని అయిపోయినట్లే!
Satyabhama Today Episode సంజయ్ తమ కొడుకే అని మహదేవయ్య భైరవికి చెప్పడం సంజయ్‌ని పట్టుకొని భైరవి ఎమోషనల్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సంజయ్‌కి పది కోట్లు ఇస్తానని చెప్పిన మహదేవయ్య మీద భైరవి కేకలేస్తుంది. వాడిని చూసుకోవడానికి వాడి తండ్రి ఉన్నాడు కదా.. పంది కొక్కులా ఇంట్లో పడి తింటున్నాడు ఇప్పుడు డబ్బు కూడానా అని అంటుంది. దాంతో మహదేవయ్య భైరవి మీద కేకలేస్తాడు. సంజయ్ కూడా దూరం నుంచి వాళ్ల మాటలు వింటాడు.
మహదేవయ్య: ఇంకోసారి సంజయ్ మీద పడి ఏడవకు. సంజయ్ చక్రవర్తి గాడి కొడుకు కాదు నా కొడుకు మన కొడుకు. చిన్నా గాడే పరాయి వాడు చక్రవర్తి కొడుకు. ఇది పాతికేళ్లగా నా గుండెల్లో పాతి పెట్టుకున్న నిజం. దావాఖానాలో నీ డెలివరీ టైంలో కొంత మంది నన్ను చంపుతానని అన్నారని మొత్తం జరిగింది అంతా భైరవికి చెప్తాడు. భైరవి, సంజయ్ ఇద్దరూ షాక్ అయిపోతారు.
భైరవి: అంటే అంటే సంజయ్ మన కొడుకా..
మహదేవయ్య: అవును అందుకే వాడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నా. ఏం కావాలి అన్నా చూసుకుంటున్నా.
భైరవి: ఇంత కాలం ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచావ్ అయ్యా. కన్న తల్లి నుంచి బిడ్డని దూరం చేయడం తప్పు అనిపించలేదా. నా చిన్న కొడుకు సంజయ్ దగ్గరకు వెళ్లా ఒక్కసారి ప్రేమగా బిడ్డా అని పిలిచి గుండెకు హత్తుకొని..
మహదేవయ్య: ఓసేయ్ పిచ్చిదాన్నా అలా చేయకు. నిజం బయటకు తెలిస్తే చిన్నా వెళ్లిపోతాడు.
భైరవి: చిన్నా కూడా నా బిడ్డ నాతోనే ఉంటాడు. వాడిని సంజయ్‌తో సమానంగా చూసుకుందాం.
మహదేవయ్య: ఛీ నోర్ముయ్ సంజయ్, చిన్నా ఎలా ఒకటి అవుతారే. వాడు మన కాపలా కుక్క. సంజయ్ తల మీద కిరీటం అయితే చిన్నా గాడు కాలి కింద చెప్పు. అరిగిపోయే దాక చెప్పులు కాలికి ఉండాల్సిందే సంజయ్ మనకు దూరం ఉండాల్సిందే. నా లెక్క ఆ బాధ భరించాల్సిందే.
భైరవి చాలా ఏడుస్తుంది.
సంజయ్: ఇది మహదేవయ్య రక్తం. ఈ ఇంటి వారసుడి రక్తం. నీకు ఈ ఇంటికి సంబంధం లేదు అని తెలిశాక ఇంకా నేను నిన్ను ఈ ఇంట్లో ఉంచితే నేను చేతకాని వాడిని అవుతాను. నన్ను కొట్టిన దెబ్బకు ఎదురు దెబ్బ కొట్టబోతున్నా. చావు దెబ్బ కొట్టబోతున్నా. బీ రెడీ బ్రో. ఇప్పుడు నా వెనక మహదేవయ్య అనే కొండ అండగా ఉంది.
సంధ్య జీవితం ఓ రాక్షసుడి చేతిలో పెట్టేశానని క్రిష్ సత్యని చూసి బాధ పడతాడు. సంజయ్ వల్ల సంధ్యకి ఎలాంటి నష్టం రానివ్వను అని అంటాడు. ఇక సత్య దగ్గరకు సంధ్య వస్తుంది. ఏం కావాలమ్మా అని అంటుంది. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్లిపో అని సంధ్య అంటుంది. నువ్వు నాకు కనిపిస్తుంటే చిరాకుగా ఉంది అని అంటుంది. సత్య ఏడుస్తుంది. నీకు ఈ ఇంట్లో విలువ లేదు బావ కూడా పట్టించుకోడు.. నీ కంటే నేను బెటర్ పొజిషన్‌లో ఉన్నాను కదా నీకు నేనంటే ఈర్ష్య అని అంటుంది. నీకు సిగ్గులేదా అక్క అని సంధ్య నోటికొచ్చినట్లు అంటుంది. దాంతో క్రిష్ వచ్చి దేవతలాంటి మీ అక్కని అంటున్నందుకు నీకు సిగ్గు ఉండాలి అని సంధ్య మీద చేయి ఎత్తుతాడు. సత్య ఆపుతుంది.
క్రిష్: మీ అక్క నిన్ను నిజంగా ద్వేషిస్తే అసలు నువ్వు ఈ ఇంట్లోనే ఉండవు. ఇప్పుడు అడుగుతున్నా చెప్పు సత్య. సంధ్య ఈ ఇంట్లో ఉండాలా వద్దా.. వద్దు అంటే చెప్పు సత్య ఇప్పుడే ఇంటి నుంచి గెంటేస్తా. నువ్వు అదృష్టవంతురాలివి. ఇలాంటి దేవత లాంటి అక్క ఉన్నందుకు. సంధ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. క్రిష్ సత్యతో మీ చెల్లి మీద అరిచినందుకు సారి చెప్తాడు.
సంజయ్ క్రిష్‌ని ఎలా ఇంటి నుంచి గెంటేయాలా అని అనుకుంటూ ఆలోచించి కుర్చీలో కూలబడితే భైరవి అక్కడికి వచ్చి సంజయ్ తల నిమురుతుంది. మనసులోనే నిన్ను నవమాసాలు మోసి ఇలా కళ్లతో మాట్లాడుకుంటున్నా అని ఏడుస్తుంది. సంజయ్ తల నిమిరి చేయిని ముద్దాడుతుంది. సంజయ్ లేచి ఏం తెలీనట్లు ఏమైంది మామ్ అంటాడు. ఏంటి కొత్తగా పిలిచావ్ అని భైరవి అంటే బిగ్ మామ్ అనబోయి మామ్ అన్నానని అనేస్తాడు. భైరవి సంజయ్ మెడలో చైన్ వేసి ఉంచుకోరా అని చెప్పి వెళ్లిపోతుంటుంది.
సంజయ్: అమ్మా.. నిజాన్ని నీలోనే దాచుకొని ఈ బిడ్డని ఇంకా అనాథగా మార్చివెళ్లిపోతున్నావా అమ్మా. ఇంతకు ముందు నువ్వ డాడ్ మాట్లాడింది మొత్తం వినేశాను. భైరవి ఏడుస్తూ సంజయ్‌ని హత్తుకుంటుంది. అమ్మ ప్రేమని అడ్డం పెట్టుకొని క్రిష్‌ని ఓ ఆట ఆడిస్తానని అనుకుంటాడు. అమ్మ పుట్టికతోనే అందరికీ దేవుడు అమ్మని ఇస్తాడు. కానీ నాకు పాతికేళ్ల తర్వాత అమ్మని ఇచ్చాడు. ఈ అమ్మని ఒక్క కోరిక అడగొచ్చా..
భైరవి: అడుగురా బిడ్డ..
సంజయ్: ఇక నుంచి క్రిష్ స్థానంలో నేను ఉండాలి వాడిని ఇంటి నుంచి తరిమేయాలి.
భైరవి: తప్పు కదరా వాడిని ఇన్నాళ్లు కన్న కొడుకులా పెంచినా. ఒక్కసారిగా ద్వేషం నింపుకొని తరిమేయాలి అంటే కష్టంరా.
సంజయ్: సరే అమ్మ వాడినే చూసుకో నేను అనాథలా వెళ్లిపోతా. కొడుకులా వాడు పెత్తనం చేస్తుంటే నేను తట్టుకోలేను. నేను ఇప్పుడే వెళ్లిపోతా.
భైరవి: సంజయ్ నిన్ను పాతికేళ్లు దూరం ఉన్నావ్ ఇప్పుడు వద్దురా. నువ్వు ఎలా అంటే అలా..కానీ వాడిని ఎలా పంపాలో.
సంజయ్: అది నేను చూసుకుంటా. నేను చెప్పినట్లు నువ్వు చూసుకో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

