అన్వేషించండి

Satyabhama Serial Today December 21st: సత్యభామ సీరియల్: తండ్రీకొడుకుల సెంటిమెంట్ అదుర్స్.. ఎవరి కొడుకు వారి గిఫ్ట్‌లు.. లవ్‌బర్డ్స్‌ సత్యకి దొరికిపోతారా!

Satyabhama Today Episode క్రిష్‌ కోసం చక్రి తన మెడలో చైన్ ఇస్తే మహదేవయ్య సంజయ్‌కి ఇవ్వడం సత్య మొత్తం ఫొటోలు తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సంధ్యని సంజయ్ తన గదిలోకి తీసుకెళ్తాడు. గడియ ఎందుకు పెట్టావ్ మా అక్క చూస్తే అంతే సంగతి అని సంధ్య అంటుంది. దానికి సంజయ్ వయసులో ఉన్న వాళ్లు ఒకే గదిలో ఉంటే ముందు తలుపు గడియ పెట్టాలని ఇక సత్య అయితే తన గది వైపే రాదు రిలాక్స్ అయిపో అని సంధ్యతో చెప్తాడు. ఇక సత్య సంధ్య గురించి వెతుకుతూ ఉంటుంది. ఇక సంధ్యతో  సంజయ్ రొమాంటిక్‌గా మాట్లాడుతూ కిస్ చేయడానికి వెళ్తాడు. సంధ్య తోసేసి పారిపోబోతే సంజయ్ బెడ్ మీదకి సంధ్యని లాగేస్తాడు. 

మరోవైపు పుట్టిన రోజు సెలెబ్రేషన్స్‌ చేయడానికి అందరూ బయటకు వస్తారు. క్రిష్‌ డ్రస్ బాగుందని మహదేవయ్య అంటే క్రిష్‌ సత్య సెలక్షన్ అని అంటాడు. సత్యకి తన గురించి ఆలోచన ఎక్కువ ఆరాటం ఎక్కువ సత్య అంటే నాకు ప్రాణం అని క్రిష్ అంటాడు. ఇంతలోనే కాకపోతే మా బాపు తర్వాతే ఎవరైనా అని అంటాడు. ఇంతలో చక్రవర్తి వచ్చి క్రిష్‌కి పుట్టిన రోజు విషెష్ చేప్తాడు. ఇక పొద్దున్నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నా అని క్రిష్ అంటాడు. 

నందిని: ఇవాళ చిన్న అన్నదే కాదు సంజయ్ పుట్టిన రోజు కూడా. బాబాయ్ నువ్వు చిన్నన్న కోసం వచ్చావా సంజయ్ అన్న కోసం వచ్చావా.
క్రిష్: బరాబర్ నా కోసమే వచ్చాడు రాసిస్తా. బాబాయ్ పుట్టిన రోజుకి నేను దగ్గరుండి చూసుకున్నా అందుకే నాకోసం వచ్చారు అంతే కదా సత్య.
సత్య: అవునవును సంజయ్ పట్టించుకోకపోయినా నవ్వు కన్నకొడుకులా దగ్గరుండి చూసుకున్నావ్. నాకు బాగా గుర్తుంది.
చక్రి: అవన్నీ ఇప్పుడెందుకు సత్య.
క్రిష్: ఉన్నవి చెప్పుకోవాలి కదా బాబాయ్ అవన్నీ సరే నువ్వు ఎవరి కోసం వచ్చావో చెప్పు అది చాలు.
చక్రి: డౌట్ ఎందుకు రా నీకోసమే వచ్చా సంజయ్‌కి సెంటిమెంట్స్ తక్కువ. నాకు నీతో అటాచ్ మెంట్ ఎక్కువ. 
సత్య: మహదేవయ్యతో కొంపలంటుకుంటున్నాయ్ మామయ్య మీ పచ్చ బొట్టు కొడుకు ఏంటి బాబాయ్ మీద తెగ ప్రేమ కురిపిస్తున్నాడు. ఏదో తేడా కొడుతుందే. ఎక్కడో పోపు మాడుతుందే. 
చక్రి: నువ్వు పిలుస్తావో లేదో అని వెయిట్ చేశానురా.
క్రిష్: పిలవకపోయినా వస్తావా రావా అని చూస్తున్నా బాబాయ్.
సత్య: ఏదైతే ఏంటి లెండి చిన్న మామయ్య మీ కొడుకు పుట్టిన రోజుకి మీరు వచ్చారు కదా.
నందిని: చిన్నన్నని పట్టుకొని నీ కొడుకు అంటుందేంటి బాబాయ్.
సత్య: అంటే నా ఉద్దేశం సంజయ్‌ కోసం వచ్చారని.
చక్రి: కానీ ఒక విషయం సంజయ్ పుట్టిన రోజు గుర్తుంచుకోవడం వల్ల నాకు క్రిష్‌ పుట్టిన రోజు గుర్తుండటం లేదు. క్రిష్ పుట్టిన రోజు గుర్తుండటం వల్ల సంజయ్ పుట్టిన రోజు గుర్తుంది.
సత్య: ఏదో జరుగుతుంది మామయ్య నాకు అర్థం కావడం లేదు. మీ చిన్నా మీ కోసం కాకుండా బాబాయ్ కోసం ఆరాట పడుతున్నాడేంటి.

ఇక అందరూ సంజయ్ కోసం అడిగితే సత్య పిలుస్తానని వెళ్తుంది. ఇక సంధ్య సంజయ్ భుజం మీద వాలిపోయి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సత్య వచ్చి డోర్ కొడుతుంది. సంజయ్ డోర్ తీస్తే సంధ్య డోర్ వెనక దాక్కుంటుంది. సత్య గది మొత్తం చూస్తుంది. సంజయ్ ఎప్పటిలా గొడవ పడుతూ సత్యని గదిలోకి రానివ్వడు. నువ్వెందుకు నన్ను పిలవడానికి వచ్చావ్ నీ పనికి మాలిన డౌట్లు ఏంటి అని అడుగుతాడు. ఇక అప్పుడే సంధ్య ఫోన్ వస్తే సత్య ఎవరు అని అడుగుతుంది. దానికి సంజయ్ నా ఫోన్ అని చెప్తాడు. కావాలంటే రింగ్ ఇస్తా అని తన ఫోన్‌తో సంధ్య ఫోన్‌కి కాల్ చేసి అది తన ఫోనే అని కవర్ చేస్తాడు. ఇక 
సత్య వెంటే సంజయ్ వెళ్తాడు. సంజయ్‌ని తన అక్క కాస్త కూడా మర్యాద ఇవ్వడం లేదని నిజంగా అక్క మారిపోయిందని రాక్షసిలా తయారైందని అనుకుంటుంది. 

మరోవైపు మహదేవయ్య సత్య పుట్టిళ్లు తనది అని గొడవ చేసిన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చావ్‌రా అని అడుగుతాడు. డబ్బు కావాలని ఆ వ్యక్తి చెప్తాడు. నందిని తండ్రిని ఆ వ్యక్తిని చూసి గుర్తు పట్టి వాడేంటి ఇక్కడికి వచ్చి బాపుతో మాట్లాడుతున్నాడని అనుకుంటుంది. తండ్రి ఆయనకు డబ్బు ఇవ్వడం చూసేస్తుంది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక కేక్ కటింగ్ దగ్గరకు సంజయ్ వస్తాడు. క్రిష్, సంజయ్ కేక్ కట్ చేస్తారు. క్రిష్ బాపు అని కేక్ పెట్టేసరికి అక్కడ చక్రి ఉంటాడు. ఇక క్రిష్ షాక్ అయి బాపుని పిలిస్తే సత్య వద్దని చక్రికే తినిపించమని అంటుంది. దాంతో సంజయ్ మహదేవయ్యని పిలిచి కేక్ తినిపిస్తాడు. ఇక హడావుడిగా వచ్చాను గిఫ్ట్ ఏం తీసుకురాలేదని చక్రి తన మెడలో చైన్ తీసి ఇచ్చి ఎప్పటికీ నా గుర్తుగా ఉంచుకోరా అని అంటాడు. ఇక మహదేవయ్య తన మెడలో చైన్ తీసి సంజయ్‌కి వేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: భార్య, మామల్ని దారుణంగా అపార్థం చేసుకున్న రాజు.. తండ్రిని చేరిన పసికందు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget