Satyabhama Serial Today December 11th: సత్యభామ సీరియల్: సత్య పుట్టింటి పరిస్థితి దారుణం.. కనీసం కరెంట్ కూడా లేదే.. మామ దెబ్బకు అల్లాడిపోతున్న సత్య!
Satyabhama Today Episode సత్య పుట్టింటికి వెళ్లడం ఇష్టం లేని భైరవి వంట పేరుతో సత్యని ఇబ్బంది పెట్టడం సత్య చేసిన పనికి అత్తకి బొమ్మ కనిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode భైరవి ఆరు బయట కూర్చొంటే అక్కడికి పారిజాతం వచ్చి కావాలని సత్య మీద చాడీలు చెప్పి భైరవిని మరింత రెచ్చ గొడుతుంది. సత్యని ఇంటికి రప్పిస్తే మీరు నిండు కుండ లేదంటే ఒట్టి కుండ అని అంటుంది. దాంతో భైరవి ఇక్కడ వంట చేసి పెట్టడానికి అయినా అది వస్తుందని అంటుంది. పెద్ద కోడలు ఉంది కదా అని అంటే ఏం చేస్తారు అంటే పెద్ద కోడలు తన పుట్టింటికి వెళ్తుందని చెప్తుంది. బామ్మ చనిపోయింది అనే నెపంతో రేణుకని పుట్టింటికి పంపేస్తుంది.
సత్య: మా నాన్న మమల్ని ఎంత గారాబంగా పెంచారో ఈ ఇంటికి అంతే ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడు ఇళ్లు మాకు కాకుండా పోతుంది అంటే ఎలా క్రిష్ ఏం చేయాలి ఇప్పుడు. నాన్నని ఎలా ఓదార్చాలి పలకరిస్తే చాలు నాన్న ఏడుస్తున్నారు. భోజనం కూడా చేయకుండా ఏడుస్తున్నారు. మా నాన్నని ఇలా చూడటం నా వల్ల కాదు ఏదో ఒకటి చేయాలి.
క్రిష్: వాడు ఎవడో చేసిన తప్పునకు మనం బలి అవ్వడం ఏంటి మనం కూడా మొండి కేస్తే. మన దగ్గర రౌడీలు ఉన్నారు కదా మనం ఎదురు తిరుగుతున్నాం.
సత్య: మా బాధలు మేం పడతాం క్రిష్ నువ్వు ఇబ్బంది పడొద్దు
క్రిష్: మా బాధలు ఏంటి సత్య ఎందుకు నన్ను వేరు చేస్తున్నావ్.
సత్య: అది కాదు క్రిష్ ఇంతకు ముందు నువ్వు మాకు సాయం చేయాలి అని చాలా ఇబ్బంది పడ్డావ్. ప్రస్తుతం నా పుట్టింటికి అత్తింటికి మధ్య ఓ గీత ఉంది ఆ గీతని గీతలాగే ఉండనిద్దాం. ఇంతలో భైరవి కాల్ చేస్తుంది.
భైరవి: బిజీగా ఉన్నట్లున్నా.. ఇంట్లో చాయ్ పెట్టే దిక్కులేదు నాకు మోకాల నొప్పులు ఈరోజు అందరూ పస్తులు ఉండాల్సిందే నువ్వు ఖుషీగా ఉన్నావ్ కదా అదే చాలులే. అత్తింటిలో నీ అవసరం ఉంది.
సత్య ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. క్రిష్ నేను ఏదో ఒకటి చెప్తా అంటే వద్దు అంటుంది. ఇక భైరవి కిచెన్‌లో కూర్చొని ఉంటే పారిజాతం వచ్చి నన్ను వంట చేయొద్దని చెప్పారు చిన్న కోడలు రాలేదు అంటే భైరవి చిన్న కోడలు వస్తుందని అంటుంది. భైరవి సత్య రాక కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంతలో క్రిష్ కారు వస్తుంది. సత్య వచ్చిందని భైరవి తనకు బాలేదు అన్నట్లు ముఖం పెడుతుంది. ఇంతలో క్రిష్ క్యారేజ్ తీసుకొని భైరవి ముందు పెడతాడు. భైరవి షాక్ అయిపోతుంది. తిండి కష్టమని చెప్పావ్ వండి పంపిందని చెప్తాడు. జయమ్మ వచ్చి వండి పంపడం ఏంట్రా అని తిడుతుంది. నాకు చెప్పినా నేను వండేదాన్ని అని జయమ్మ తిడుతుంది. ఇంత శాడిస్టిలా తయారయ్యావేంటే అని భైరవిని జయమ్మ తిడుతుంది.
ఇక సత్య భోజనాలు సిద్ధం చేసి అందరిని పిలుస్తుంది. ఎవరూ ఉలకరు పలకరు తండ్రిని.. ఎవరిని పిలిచినా రారు. నందిని మాత్రం తనకు ఆకలిగా ఉందని ఎవరూ రాకపోతే నేను ఎలా వస్తాను అంటుంది. సత్య తండ్రి దగ్గరకు వెళ్లి ఎలా ఎందుకు నాన్న బాధ పడతారు. దిగులు పడుతూ ఉంటే కాదని ధైర్యం చెప్తుంది. రెండు రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని అనే ఆలోచనే సరిగ్గా ఉండనివ్వడం లేదని విశ్వనాథం ఏడుస్తాడు. ఇక సత్య నాన్న మీరు తినకుండా ఇంట్లో ఎవరూ ముద్ద కూడా ముట్టరు అది ఎన్ని రోజులు అయినా అని అంటుంది. ఇక బామ్మ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని పిలుస్తుంది. ఎవరూ రాకపోవడంతో నేను ఇంటికి వెళ్లిపోతా అంటుంది. దాంతో విశ్వనాథం తింటానని అంటాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటారు. సత్య వడ్డిస్తుంటుంది. ఇంతలో కరెంట్ పోతుంది.
అందరి ఇళ్లలో కరెంట్ ఉంటుంది కానీ మనకే లేదు ఎందుకని అనుకుంటారు. కరెంట్ ఆఫీస్‌కి హర్ష కాల్ చేసి అడిగితే రెండు లక్షల బిల్ పెండింగ్ ఉందని కరెంట్ కట్ చేశామని అంటారు. దాంతో అందరూ షాక్ అయిపోతారు. విశ్వనాథం బాధతో తిండి దగ్గర నుంచి వెళ్లిపోతాడు. ఇక సంధ్య తన గదిలో ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ నేను పరీక్షలు రాయలేనే ఇంట్లో కరెంట్ లేదు దోమలు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది మా పరిస్థితి బాలేదు అని ఏడుస్తుంది. సత్య ఆ మాటలు విని ఏడుస్తుంది. తర్వాత హర్ష, మైత్రి మాట్లాడుకోవడం విని బాధపడుతుంది. ఇక విశ్వనాథానికి పాలు తాగమని విశాలాక్షి ఇస్తే విశ్వనాథం భార్య మీద అరుస్తాడు. విశాలాక్షి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కిలాడీ లేడీని పట్టించిన సీత.. మహాలక్ష్మీ యాక్టింగ్ అంతా తుస్సేనా!