Janaki Kalaganaledhu July 25th: ‘జానకి కలగనలేదు’ సీరియల్: భార్య రాకతో సంతోషంలో సంబరాలు చేసుకుంటున్న రామ, జానకి ఎంట్రీతో వణికిపోతున్న మనోహర్?
తన భార్య పోలీస్ అధికారిగా తిరిగి ఇంటికి వస్తుందన్న సంతోషంతో రామ సంబరాలు చేసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Janaki Kalaganaledhu July 25th: రామ ఇల్లు ఎలా క్లీన్ చేయాలో మల్లికకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక అఖిల్ వాళ్లు కూడా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో మల్లికకు బాగా కోపం వస్తుంది. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోగా మల్లిక భార్య ఐపీఎస్ అయినందుకు స్వీట్స్ అమ్మేవాడు అసిస్టెంట్ అయ్యాడు అన్నట్లు ఉంది అని వెటకారంగా డైలాగు కొడుతుంది.
ఇక జ్ఞానంబను చూసి దెబ్బకు సైలెంట్ అవుతుంది. ఇక మల్లికకు మంచి పని అప్పగించాను అని అనుకుంటుంది. ఇక మరోవైపు వెన్నెల కిషోర్ తో చాటింగ్ చేస్తూ ఉంటుంది. కిషోర్ ఫోన్ చేస్తున్న సమయంలో గోవిందరాజులు మెడిసిన్ తీసుకొచ్చి దాని సమయం చూడమని అంటాడు. ఇక అది చూసి వెన్నెల అక్కడి నుంచి కంగారుగా వెళ్తుంది. గోవిందరాజులు ఏం జరిగింది అన్నట్లుగా ముఖం పెడతాడు.
రోడ్డుపై ఒక అబ్బాయి అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తుండగా వెంటనే జానకి అతని పట్టుకొని చితక్కొట్టి జైల్లో వేయమని పోలీసులకు అప్పచెప్పుతుంది. ఇక అమ్మాయితో పాటు అక్కడ అందరికీ తన సహాయం ఎప్పుడూ ఉంటుంది అని ధైర్యం ఇస్తుంది. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ని కలుస్తుంది. తను ఎవరికి కనిపించకుండా ముఖానికి అడ్డుగా గుడ్డ కట్టుకోవడంతో కిషోర్ తీయమని బ్రతిమాలుతూ ఉంటాడు.
ఎందుకంత భయపడుతున్నావు అంటూ అడుగుతాడు. ఇక వెన్నెల తన వదిన తిరిగి ఇంటికి వస్తుందని ఇకపై కలవడం కుదరదు అని చెబుతూ బాధపడుతుంది. ఇక కాసేపు తమ పెళ్లి గురించి కూడా చర్చ చేసుకుంటారు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు. రామ తన భార్య జానకి వస్తుందని ఇల్లంతా మామిడి తోరణాలతో అలంకరిస్తూ ఉంటాడు. ఇక వెన్నెల కాసేపు ఆట పట్టిస్తూ ఉంటుంది.
ఇదంతా ఎవరి కోసం అని అంటుంది. ఇక జానకి రాకముందుకే వచ్చావ వదిన అనటంతో వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక అందరూ తెగ నవ్వుకుంటారు. ఆ తర్వాత జానకి కోసం ఎదురుచూపులతో ఆశగా కనిపిస్తూ ఉంటాడు. ఇక క్యాబిన్ లో పోలీసుల మీటింగ్ అవుతూ ఉంటుంది. ఇక ఏసీపీ గా వచ్చిన జానకిని పెద్ద ఆఫీసర్ పొగుడుతూ ఉంటాడు. అంతేకాకుండా తను ఈవ్ టీజింగ్ నుంచి ఒక అమ్మాయిని రక్షించిందని తెలియటంతో ఆమెను అందరి ముందు మరింత పొగుడుతాడు.
ఇక బయట మనోహర్ కు ఒక కానిస్టేబుల్ వచ్చి కొత్త ఏసీపీ వచ్చింది చాలా షార్ప్ అంటాడు. అయితే తనని ఎలాగైనా పరిచయం చేసుకోవాలి అని మనోహర్ అనుకుంటాడు. అప్పుడే జానకి రావడంతో జానకిని చూసి షాక్ అవుతాడు. తనే ఏసీపీ అని తెలియటంతో భయంతో వణికి పోతాడు. జానకి కూడా అతనితో గట్టిగానే మాట్లాడుతుంది. జానకి అక్కడి నుంచి వెళ్ళిపోగా తను ఇరికిపోయాను అని భయపడతాడు.
also read it : Trinayani July 25th: ‘త్రినయని’ సీరియల్: సుమన చెంప పగలగొట్టిన అత్త.. తిలోత్తమా చీర కొంగుకు చుట్టుకున్న శంఖం?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial