అన్వేషించండి

Prema entha maduram Serial Today February 26th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఆర్య ఆఫీసుకు వచ్చిన మాన్షి – ఆఫీసు నుంచి గెంటేసిన నీరజ్

Prema entha maduram Today Episode: ఆర్య ఆఫీసుకు ఆనంది, మాన్షి రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema entha maduram Serial Today Episode: కేశవ ఇంటికి వచ్చి ఆనంది వెళ్లిన గది ఓపెన్‌ చేసి చూస్తే అక్కడ ఆనంది కనిపించదు. ఆనంది గదిలో చూస్తే కూడా ఆనంది కనిపించదు దీంతో కేశవ పైన మొత్తం వెతుకుతాడు. అయినా ఆనంది కనిపించకపోవడంతో కేశవ నిరుత్సాహంగా కిందకు వస్తుంటాడు. ఇంతలో శారదాదేవి వచ్చి కేశకు భోజనం ఇస్తుంది. ఆఫీసులో అందరు కలిసి తినమని చెప్తుంది. భోజనం క్యారియర్‌ తీసుకుని బయటకు వచ్చి కారు ఎక్కిన కేశవ షాక్‌ అవుతాడు. వెనక సీట్లో ఆనంది కూర్చుని ఉంటుంది.

కేశవ: పాప నువ్వు కారులో ఎందుకు ఉన్నావు. ఎలా వచ్చావు.

ఆనంది: నేను మీతో పాటు ఆఫీసుకు వస్తాను.

కేశవ: వద్దమ్మా మేమంతా బిజీగా ఉంటాము..

అనగానే ప్లీజ్‌ నేను వస్తాను. తీసుకెళ్లండి.. అనగానే కేశవ ఆనందిని తీసుకుని ఆఫీసుకు వెళ్తాడు. ఆఫీసులో ఆర్య, అను బిజీగా ఉంటారు. ఇంతలో మాన్షి వస్తుంది. మాన్షిని చూసిన ఆర్య, అను షాక్‌ అవుతారు. మాన్షి ఏడుస్తూ ఉంటుంది. ఆర్య ఎందుకొచ్చావు అని అడగ్గానే మాన్షి ఏడుస్తూ నేను మీ అందరికీ చాలా ద్రోహం చేశాను. సరిదిద్దుకోలేని తప్పులు చేశాను అని ఏడుస్తుంది. అను కోపంగా తిడుతుంది.

మాన్షి: నా అనే వాళ్లు లేక ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను.

అను: అయ్యో మీరు ఒంటరివాళ్లు ఎందుకవుతారండి. కుట్రలు, కుతంత్రాలు పన్నే వాళ్లు మీకు తోడుగా ఉండనే ఉన్నారు కదా?

మాన్షి: వాళ్లను నమ్మి మీకు ద్రోహం చేసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది.

అంటూ మాన్షి ఏడుస్తూ అను కాళ్లు మొక్కబోతుంటే అను పక్కకు తప్పుకుంటుంది. కుటుంబ సభ్యురాలిగా కాకపోయినా పనిమనిషిగానైనా నాకు ఇంట్లో చోటు ఇవ్వండి అని అడుక్కుంటుంటే.. ఇంతలో నీరజ్‌ వచ్చి మాన్షిని కొడతాడు. మా జీవితాలు నాశనం చేసింది సరిపోలేదా? అంటూ తిడుతూ బయటకు గెంటివేస్తుంటే.. మాన్షి ఏడుస్తూ అందరినీ బతిమాలుతుంది. ఎవ్వరూ పలకపోయేసరికి మాన్షి బయటకు వెళ్లిపోతుంది.

ఆర్య: నీరజ్‌ ఆవేశపడకు

నీరజ్‌: దాన్ని చూస్తేనే నాకు ఇరిటేషన్‌ వస్తుంది. నా కోపాన్ని నేను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నాను.

అను: వదిలేసేయండి సార్‌ తన తప్పులకు శిక్ష అనుభవిస్తుంది కదా? అందరూ ఉన్నా కూడా అనాధ అయిపోయానని బాధపడుతుంది.

నీరజ్‌: నో వదినమ్మా తను చెప్పేదంతా నిజం కాదు. మళ్లీ ఏదో కుట్రతోనే వచ్చింది. ఆల్రెడీ నన్ను స్కూల్‌ దగ్గర కలిసింది వదినమ్మా.. దయచేసి మీరు దాని మీద జాలి చూపించకండి కోరి ప్రమాదాన్ని తెచ్చుకోకండి.

అంటూ చెప్పి నీరజ్‌ వెళ్లిపోతాడు. కేశవ ఆనందిని తీసుకుని ఆఫీసుకు వస్తాడు. ఆఫీసులోంచి బయటకు వెళ్తున్న మాన్షి, ఆనందిని చూస్తుంది.

కేశవ: ఎందుకొచ్చారు..?

మాన్షి: అది జెండే సార్‌

కేశవ: సార్‌.. రెస్పెక్ట్‌ మీ మాటల్లో రెస్పెక్ట్‌ కనిపిస్తుందంటే మీ మనసులో ఏదో కుట్ర ఉందనే అర్థం.

 అంటూ మాన్షిని మరోసారి ఇటువైపు రావొద్దని వార్నింగ్‌ ఇచ్చి కేశవ లోపలికి వెళ్తాడు. ఆనందిని ఒకచోట ఉండమని చెప్పి మీటింగ్‌ హాల్  లోకి  కేశవ వెళ్లబోతుంటే అక్కడ అఖి, అభయ్‌ ఆడుకోవడం చూసి వీళ్లేంటి ఇక్కడ అని ఆశ్యర్యపోతాడు. ఆనందిని ఇక్కడ చూస్తే పిల్లలు హర్ట్‌ అవుతారేమో అనుకుంటుండగా మీటింగ్‌ లోంచి ఆర్య, అను, నీరజ్‌ బయటకు వస్తారు. పిల్లలతో అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: 'లుట్ ఫుట్ గయా' పాట పాడి అదరగొట్టిన అల్లు అయాన్ - ఫిదా అవుతూ ట్వీట్ చేసిన షారుక్ ఖాన్, రిప్లై ఇచ్చిన బన్నీ!

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today June 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: శత్రువులకు చేతులు జోడించి దండం పెట్టి వేడుకున్న రామరాజు! ప్రేమ శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోతుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: శత్రువులకు చేతులు జోడించి దండం పెట్టి వేడుకున్న రామరాజు! ప్రేమ శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోతుందా!
Nithika Chowdary: 'కలవారి కోడలు కనక మహాలక్ష్మి' సీరియల్ సహస్ర.. రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
'కలవారి కోడలు కనక మహాలక్ష్మి' సీరియల్ సహస్ర.. రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Lakshimi Raave Maa Intiki Serial Today June 5th:తన పుట్టుక గురించి సూర్యనారాయణకు నిజం చెప్పేసిన శ్రీలక్ష్మీ.. రౌడీల నుంచి తప్పించుకున్న ప్రియంవద భర్త
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: తన పుట్టుక గురించి సూర్యనారాయణకు నిజం చెప్పేసిన శ్రీలక్ష్మీ..రౌడీల నుంచి తప్పించుకున్న ప్రియంవద భర్త
Jagadhatri Serial Today June 5th:నిషిక ప్రెగ్నెన్సీ గురించి సుధాకర్‌కు నిజం చెప్పేసిన డాక్టర్‌...జగధాత్రి, కేదార్‌కు సుధాకర్‌ క్షమాపణలు
జగద్ధాత్రి సీరియల్: నిషిక ప్రెగ్నెన్సీ గురించి సుధాకర్‌కు నిజం చెప్పేసిన డాక్టర్‌... జగధాత్రి, కేదార్‌కు సుధాకర్‌ క్షమాపణలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Next Generation Hyundai i20: హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
Embed widget