Prema Entha Madhuram October 11th: అను కాళ్లు పట్టిన ఆర్య.. త్వరలోనే ఒక్కటవుతారని చెప్పిన పూజారి!
ఇద్దరు త్వరలో కలవబోతున్నారని సూచనలు ఉన్నాయి అని పూజారి చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema entha madhuram October 11th: ఈరోజు ఎపిసోడ్లో
నీరజ్: నన్ను క్షమించండి దాదా, ఈ పెళ్లిని ఆపడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను.
అంజలి: అవును సార్ మీ గురించి తెలిసి కూడా మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాము. ఆ స్కూల్ కోసం పెళ్లి చేసుకుంటున్నారు అనుకున్నాను.
నీరజ్: అయినా ఛాయదేవికి అలా జరగడం మంచిదే అయింది. కానీ ఇంత జరిగినా కూడా వదినమ్మ ఇక్కడికి రాకపోవడమే బాధగా ఉంది.
ఆర్య: తనకి తెలుసు నీరజ్, నేను తనని తప్ప ఇంక ఎవరి వైపు చూడను, ఎవరిని పెళ్లి చేసుకోను అని. ఆ ధీమాతోనే తను రాలేదు. అయినా సరే ఎప్పటికైనా నేను అనుని పట్టుకుంటాను. చివరి శ్వాస వరకు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాను.
ఆ మాటలను ఒక మూల నుంచి వింటున్న అను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆరోజు రాత్రి ఆర్య పడుకుంటుండగా కలలోకి సోధమ్మ వచ్చి రేపు అను పుట్టినరోజు నాడు అష్టమి అని గుర్తు చేస్తుంది. అప్పుడు ఆర్య వెంటనే వెళ్లి క్యాలెండర్ చూడగా అక్కడ అష్టమి అని ఉంటుంది. ఆర్య జెండేకి ఫోన్ చేస్తాడు.
జెండే: ఏంటి ఆర్య, ఈ టైంలో ఫోన్ చేశావు?
ఆర్య: రేపు అను పుట్టినరోజు. మన సెక్యూరిటీని పెడదాము. అను ఈ సిటీలో ఏ గుడికి అయినా వస్తుంది అనే నమ్మకం నాకుంది. నాకెందుకో అనుని కలుస్తాను అని చాలా ఆశగా ఉంది. ఎందుకో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి.
జెండే: నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ నాకు ఒక మాట ఇవ్వు ఆర్య. మనం ప్రయత్నించిన తర్వాత కుడా కనబడకపోతే బాధపడొద్దు మళ్లీ ప్రయత్నిద్దాం.
ఆర్య: అలాగే జెండే. నాకెందుకో అను ఆ ఒక్క గుడికి వస్తాదని మాత్రం నమ్మకం గట్టిగా ఉన్నది. ప్రయత్నం అయితే చేద్దాం.
ఆ తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలు ఇద్దరు దేవుడి గదిలో పూజలు చేసి వెంటనే అను దగ్గరికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. అదే సమయంలో మరోవైపు ఆర్య ఇంట్లో కూడా అను పుట్టినరోజు కోసం పూజలు చేస్తారు.
ఆర్య: హ్యాపీ బర్త్ డే అను నువ్వు నాకు ఎంత దూరంగా ఉన్నా ఎప్పటికీ మనిద్దరం ఒకటి అవుతాం అని నమ్మకం నాకుంది.
అంజలి: దేవుడా దయచేసి అనుని, ఆర్య సార్ని కలిపేలా చూడు. అప్పుడే సార్ ముఖంలో అసలైన ఆనందం కనిపిస్తుంది.
నీరజ్: హ్యాపీ బర్త్ డే వదినమ్మ దయచేసి త్వరగా వచ్చేయండి. మీ కోసం మేము ఎదురు చూస్తున్నాము అని అనుకుంటాడు.
ఇటువైపు పిల్లలు ఇద్దరు పూజని పూర్తి చేస్తారు.
అను: ఏంటి పిల్లలు ఇద్దరు ఈ రోజు నా కన్నా ముందే లేచారు? పూజ కూడా చేసేసినట్టున్నారే.
అభయ్: మా బర్త్ డే రోజు నువ్వు కూడా పూజలు చేస్తావు కదా అమ్మ అందుకే నీ పుట్టినరోజున మేము పూజ చేశాము.
అక్కి: అయితే పదమ్మ వెళ్లి కేక్ కట్ చేద్దాము.
అభయ్: ఎందుకు? స్కూల్ ఎగొట్టే ప్రయత్నాలు చేస్తున్నావా?
అను: ఇప్పుడు నేను గుడికి వెళ్లి వస్తాను, సాయంత్రం మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాం. సరేనా?
అక్కి: నేను కూడా గుడికి వస్తాను అమ్మ.
అభయ్: అమ్మ చెప్పింది చెయ్యి అక్కి. స్కూల్ మానేయడానికి ప్రయత్నించకు అని చెప్పి అక్కిని తీసుకొని వెళ్లిపోతాడు.
ఆ తర్వాత అను గుడికి వస్తుంది. గుడికి వచ్చిన తర్వాత తనకి ఒక అన్యోన్యమైన జంట గుడిలో కనిపిస్తుంది. అప్పుడు అనుకి తన గతంలో ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. అను ప్రదక్షణాలు చేసి అలసిపోయి ఆర్య పక్కన వచ్చి కూర్చుంటుంది.
ఆర్య: ఎందుకు అను అంత కష్టపడి ప్రదక్షణాలు చేస్తున్నావు? కష్టపడకపోతే దేవుడు నీకు వరాలు ఇవ్వడా?
అను: మీ ఎంప్లాయిస్ కష్టపడకపోతే మీరు జీతాలు ఇస్తారా సార్?
ఆర్య: ప్రతి దానికి ఒక జవాబు ఉంటుంది అను నీ దగ్గర. అయినా అంత కష్టపడి ప్రదక్షిణాలు చేసే అంత కోరిక ఏం కోరావు?
అను: నా జీవితంలోని ఆనందమంతా మీ రూపంలోనే ఉంది సార్. అందుకే ఈ ఆనందం ఎప్పుడూ నాతోనే ఉండాలి అని కోరుకున్నాను అని అనగా అను అలసిపోయింది అని ఆర్య అను కాళ్లు పడతాడు.
ఈ సంఘటనని అంతా అను గుర్తుతెచ్చుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి పూజారి గారు వస్తారు.
పూజారి: గతంలోని మధుర క్షణాలు గుర్తుతెచ్చుకుంటున్నావా? కంగారు పడకు ఇప్పటివరకు వేచి ఉన్నత కాలానికి ఫలితం త్వరలోనే రానున్నది. అంతా మంచే జరగనున్నది సమయం మారుతుంది. అంతా త్వరలోనే జరుగుతాది కేవలం వేచి చూడాలి. అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు పూజారి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial