అన్వేషించండి

Prema Entha Madhuram serial January 15th - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: బాధతో కన్నీరు పెట్టుకున్న అంజు, ఆనంద్, ఆకాష్.. అక్కి చెంప పగలగొట్టిన దివ్య!

Prema Entha Madhuram Serial Today Episode: దివ్య అక్కి చెంప పగలగొట్టడంతో బాధతో ఓ గదిలో కూర్చుంటుంది. ఆపై ఏం జరుగుతుంది అనే ఉత్కంఠత కధలో ఏర్పడుతుంది. 

Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో గెస్ట్ లు వస్తే ఎంటర్టైన్ చేయాలి కానీ ఇలా భయపెడతారా అని అడుగుతాడు యాదగిరి.

ఆనంద్ : ఇదే మా ఎంటర్టైన్మెంట్ అంకుల్.

ఆకాష్ : పైగా మా ఎంట్రీ అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలి కదా అంటాడు.

పిల్లల నవ్వులతో అందరూ శృతి కలుపుతారు. ఆ తర్వాత అక్కి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అంజు వాళ్లకి పరిచయం చేస్తుంది. ఈయనే మా నాన్న అని చెప్పి ఆర్య ని పరిచయం చేసి మేము ఫ్రెండ్ అని పిలుస్తాము ఇకమీదట అన్ని ఆయనే మాకు అని చెప్తుంది అక్కి. మీకు ఫ్రెండ్ అయితే మాకు కూడా ఫ్రెండే మేము కూడా ఫ్రెండ్ అని పిలుస్తాము అని అంటారు అంజలి వాళ్ళు. ఆ తర్వాత 

సుగుణ: మీరు మాత్రమే వచ్చారేంటి మీ అమ్మానాన్న వాళ్ళని కూడా తీసుకురావాల్సింది అంటుంది.

బాధతో కన్నీరు పెట్టుకుంటారు అంజలి వాళ్ళు. ఏం జరిగింది అని కంగారు పడతారు అక్కడున్న వాళ్ళందరూ.

అక్కి : వాళ్లకి అమ్మ లేదు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట అంటుంది.

అను: బాధపడకండి మీ అమ్మ ఎక్కడికి వెళ్లరు, మీతోనే ఉంటారు. మీకు కనిపించకపోయినా ఆమె  మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మీరేమీ బాధపడకండి నన్ను అమ్మ అని పిలవండి అంటుంది

ఉష : మీ నాన్నకి పెళ్లి చేసేస్తే మీకు మళ్ళీ అమ్మ వస్తుంది అంటుంది.

మాటలకి అందరూ షాక్ అవుతారు.

ఆకాష్ : మా అమ్మ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు, అయినా అందుకు మా నాన్న కూడా ఒప్పుకోరు.

ఆర్య : అవును మనసు ఒకరికి కనెక్ట్ అయిపోతే ఆ మనసులో మరొకరికి స్థానం ఇవ్వలేము అంటాడు.

సుగుణ: ఆడవాళ్లు భర్త లేకపోయినా బ్రతకగలరు కానీ మగవాళ్ళకి అలా కాదు భార్య లేకపోతే ఆ జీవితం శూన్యం అయిపోతుంది. అందుకే మీ నాన్నకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అంటుంది.

అక్కి : మీ నాన్న ఒప్పుకోకపోతే చెప్పండి మా నాన్న వచ్చి ఒప్పిస్తారు అంటుంది.

ఇంక పెళ్లి పనులు ప్రారంభిద్దాం అని యాదగిరి అనడంతో రెండు పార్టీలుగా విడిపోయి హంగామా చేద్దాం అప్పుడే సరదా వస్తుంది అని చెప్పి అక్కి, అభయ్ ఆర్యవైపు అంజు వాళ్ళు అను వైపు నిలబడతారు.

దివ్య: ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేక పోతుంది ఇక్కడ వాళ్ళ పెళ్లే కాదు నా పెళ్లి కూడా జరుగుతుంది అని రోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు మెహందీ రుబ్బుతున్న సుగుణ చుట్టూ కూర్చుంటారు పిల్లలు. మేము కూడా సాయం చేస్తాం నానమ్మ అని అభయ్, ఆకాష్ రుబ్బుతూ ఉంటారు.

అంజు, అక్కి వాళ్ళిద్దర్నీ ఏడిపిస్తారు. రేపటి రోజున ఉద్యోగం రాకపోయినా రుబ్బు షాపు పెట్టుకొని బ్రతికేస్తారు అచ్చు హోటల్ సర్వర్స్ లాగా ఉన్నారు అనడంతో వాళ్ళిద్దర్నీ కొట్టడానికి బయలుదేరుతారు మగ పిల్లలు ఇద్దరు వాళ్లకి అందకుండా పరిగెడతారు ఆడపిల్లలు ఇద్దరు. అది చూసి ఆనందంగా నవ్వుకుంటుంది  సుగుణ.

మరోవైపు దివ్య హరీష్ కి ఫోన్ చేసి మ్యాచింగ్ డ్రెస్ వేసుకో మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి అని చెప్తుంది. ఇంతలో అనుకి చీర తీసుకుని వెళ్లి ఫంక్షన్ కి ఈ చీర కట్టుకోండి బాగా కనిపిస్తారు అని చెప్తుంది ఉష. ఆ మాటలు విన్న దివ్య నిన్ను నా పనులు చూసుకోమన్నాను కదా, ఇద్దరు పిల్లల తల్లికి పెళ్లి ఏంటని ఇప్పటికే అందరూ నవ్వుకుంటున్నారు. తూతు మంత్రం గా జరగాల్సిన పెళ్లిని ఆర్భాటంగా చేస్తున్నారు ఏంటో నాకు వెళ్లి అనే ఎంజాయ్మెంట్ లేకుండా పోతుంది అని కోప్పడి బయటికి వస్తుంటే పిల్లలు ఆడుకుంటూ వచ్చి  దివ్య ని గుద్దేస్తారు. ఆమె ఫోన్ కిందపడి పగిలిపోతుంది.

దివ్య: కోపంతో అక్కి చంప పగలగొడుతుంది. మీ అమ్మ కన్నా నేను అందంగా కనిపించకూడదని ఇలా చేసావు  అంటుంది.

సుగుణ: చిన్నపిల్లని కొడతావా అంటూ కోపంతో దివ్య చెంప పగలగొడుతుంది.

ఆర్య కూడా అక్కి ని వెనకేసుకురావడంతో ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు అప్పుడే పిల్లల్ని బాగానే ఓన్ చేసుకున్నావు. ఈ ఇంట్లో పరాయి వాళ్ళకి ఉన్న విలువ నాకు లేకుండా పోతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

సుగుణ : అల్లుడుగారు అక్కి ఏం మనసు కష్టపెట్టుకుంటుందో ఏమో వెళ్లి ఓదార్చండి  అని చెప్పడంతో యాదగిరి అక్కి దగ్గరికి బయలుదేరుతాడు. అక్కడితో ఈరోజు కథ ముగుస్తుంది.

Also Read: పేరు మార్చుకున్న ప్రభాస్ - న్యూమరాలజీ ప్రకారం ‘ది రాజా సాబ్’ నుంచి!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget