(Source: ECI/ABP News/ABP Majha)
Prema Entha Madhuram Serial February 2nd - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: పెళ్లి ఆపేయమంటూ దివ్యని రెచ్చగొట్టిన హరీష్.. అనుని భయపెట్టిన మాన్సీ, ఛాయదేవి!
Prema Entha Madhuram Serial Today Episode: మెడలో ఉన్న తాళి తీసేయాలేమో అని అను భయపడుతుండటంతో కథలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత ఏర్పడుతుంది
Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఛాయాదేవి హరీష్ కి ఫోన్ చేసి నీ కాబోయే భార్యని రెచ్చగొట్టి ఎలా అయినా ఆర్య వాళ్ళ పెళ్లి ఆగిపోయేలాగా చేయు అని ఆర్డర్ వేస్తుంది.
హరీష్: దివ్యని పిలిచి అసలు ఇక్కడ జరుగుతున్నది మన పెళ్లేనా అసలు మనకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు అంటాడు.
దివ్య: నాక్కూడా అలాగే అనిపిస్తుంది. కానీ మా అమ్మతో ఎంత గొడవ పడినా ఎవరూ వినిపించుకోవడం లేదు అంటుంది.
హరీష్: కానీ మా అమ్మ భయపడుతుంది. ఒకే మండపంలో అన్న చెల్లెలు ఇద్దరికీ పెళ్లి జరగకూడదంట, జరిగితే ఒక జంటకి బాగోదంట మన పెళ్లి పోస్ట్ పోన్ అవుతుందేమో అని కంగారుగా ఉంది అంటాడు.
దివ్య: మన పెళ్లి ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది, అవసరం అయితే వాళ్ల పెళ్లి పోస్ట్ పోన్ చేయిస్తాను ఇప్పుడే వెళ్లి అమ్మతో మాట్లాడుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత మాన్సీ,ఛాయాదేవి ఇద్దరు అను రూమ్ కి వెళ్తారు.
ఛాయాదేవి : ఇప్పుడు నేను నిన్ను ఏమని పిలవాలి అను అని పిలవాలా రాధా అని పిలవాలా అని వెటకారం గా అడుగుతుంది.
అను: మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు బయటికి పొండి అని కేకలు వేస్తుంది.
మాన్సీ: మీరేదో సరదాగా పెళ్లి చేసుకుంటే చూద్దామని వచ్చాము మమ్మల్ని వెళ్ళిపోమంటావ్ ఏంటి, అయినా నువ్వు పెళ్లి చేసుకునేది నీ భర్తనే కదా ఆ విషయం ఆయనకు చెప్పొచ్చు కదా ఎందుకు మళ్లీ ఈ పెళ్లి,ఇంత డబ్బు ఖర్చు అంటుంది.
అను: అది మా పర్సనల్ విషయం నీకు అనవసరం ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి అంటుంది.
ఛాయాదేవి: పెళ్లికూతురు అలా కోప్పడకూడదు అంటూ మాన్సీ తో పెళ్లికూతురు మెడలో తాళిబొట్టు ఉండకూడదు కదా, ఆర్య కట్టిన తాళిని సూర్య కట్టే తాళితో రీప్లేస్ చేస్తారా అని వెటకారంగా అడుగుతుంది.
మాన్సీ: అంతే కదా, గట్టిగా మాట్లాడితే ముందు ఈ మెడలో ఉన్న తాళి తీసేయాల్సిందే అంటూ అను తాళి మీద చెయ్యి వేయబోతుంది.
అను: కోపంతో ఆ చేతిని పట్టుకొని విదిలిస్తుంది అను. నా తాళి జోలికి రావద్దు అని హెచ్చరిస్తుంది.
ఛాయాదేవి: అను ఎందుకో భయపడుతుంది అని మాన్సీతో చెప్తూ అను నీకు ఏమైనా భయంగా ఉంటే మాతో షేర్ చేసుకో అవసరం అయితే ఈ పెళ్లి ఆపేస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మాన్సీ వాళ్ళు.
మరోవైపు సుబ్బు వాళ్ళు పెళ్లికి వస్తారు. తన కూతురి ప్లేస్ లో మరొక అమ్మాయి వస్తున్నందుకు బాధపడుతుంది పద్దు.ఆమె కి ధైర్యం చెప్తాడు సుబ్బు.
ఇంతలో సుగుణమ్మ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. పిల్లలు కూడా ఇంత ఆలస్యంగా వచ్చారు ఏంటి అని అమ్మమ్మ తాతయ్యలని హత్తుకుంటారు.
సుగుణ: హడావుడి ఎంత వీళ్ళదే అంటుంది.
సుబ్బు: తండ్రి రాబోతున్నాడు అన్న ఆనందం వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు అని సుగుణతో అంటాడు.
అంతా దైవ నిర్ణయం అని చెప్పి కూడా సుబ్బు దంపతులను పెళ్లికూతురుల దగ్గరికి తీసుకు వెళుతుంది సుగుణ.
అక్కడ పద్దు అనుకి చీర పెడుతుంది. అను తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేస్తుంది. వాళ్ళు అనుని తలుచుకొని బాధపడతారు.
తర్వాత దివ్య కి కూడా చీర పెడతారు. తర్వాత సుగుణ వాళ్ళను తీసుకుని బయటికి వెళ్లిపోతుంది.
అను: జరిగేది ఆర్య సార్ పెళ్లి అని మీకు తెలుసు, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న, మీరు ఎంత బాధ పడతారో నేను అర్థం చేసుకోగలను అని మనసులో బాధపడుతుంది.
మరోవైపు పెళ్ళికొడుకులు ఇద్దరినీ కాళ్లు కడగడం కోసం పీటల మీద కూర్చోమనటంతో హరీష్, ఆర్య ఇద్దరూ మండపం దగ్గరికి వస్తూ ఉంటారు. దారిలో సుబ్బు వాళ్ళని చూసిన ఆర్య సుబ్బుతో ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తాడు.
సుబ్బు: మీరు మీ మంచితనంతో ఒంటరి పోరాటం చేస్తున్నారని అర్థమైంది అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.