అన్వేషించండి

Prema Entha Madhuram December 25 Episode: ఆర్య కళ్ళు తెరిపించిన అక్కి, అభయ్..  పిల్లలను చూసి కుళ్లిపోతున్న అను!

Prema Entha Madhuram Today Episode: ఆర్య సర్ కి దూరంగా ఉండడం పట్ల అను తీవ్రమైన మానసిక సంఘర్షణ అనుభవిస్తూ ఉంటుంది. దాంతో కథలో కీలకమైన మలుపులు ఏర్పడతాయి.

Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పేపర్స్ మాకే ఇచ్చినట్లు ఏంటి రుజువు అని ఛాయదేవి అడగటంతో మోసపోయానని గ్రహిస్తుంది సుగుణ.

సుగుణ: అది నా పిల్లల భవిష్యత్తు కోసం నేను సంపాదించుకున్న ఆస్తి ఇప్పుడు అది లేకపోతే నా పిల్ల పెళ్ళి ఆగిపోతుంది. మీరు కూడా ఆడపిల్లలే కదా దయచేసి అర్థం చేసుకోండి అని వాళ్ళ కాళ్లు పట్టుకో పోతుంది.

అను: మీరు వాళ్ళ కాళ్లు పట్టుకోవడం ఏంటాంటి అని వారించి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇలా మోసం చేసి ఆస్తులు సంపాదించడం ఏమిటి మర్యాదగా తిరిగి ఇచ్చేయండి అంటుంది.

మాన్సీ: మేము చేసింది మోసం అయితే మరి నువ్వు చేసింది ఏమిటి, అనురాధ ఆర్య వర్ధన్ అయిన నువ్వు వీళ్ళ దగ్గర కేవలం రాధ లాగే ఉంటున్నావు అది మోసం కాదా మమ్మల్ని నిజం చెప్పేయమంటావా అని బెదిరిస్తుంది.

అను: ఇప్పుడు విషయం నా గురించి కాదు ఆమె ఆస్తి గురించి అంటుంది.

ఛాయాదేవి: విషయం ఏదైనా మా టార్గెట్ మాత్రం నువ్వు, ఆర్య వర్ధనే అంటుంది. మా విషయంలో నువ్వు కామ్ గా ఉంటే నీ విషయంలో మేము కామ్ గా ఉంటాము అంటుంది.

దాంతో అను సుగుణని తీసుకొని బయటికి వచ్చేస్తుంది.

సుగుణ: వాళ్ళు ఏమన్నారు.

అను: వాళ్లు డబ్బులు ఇవ్వరంట.

సుగుణ: ఇప్పుడు ఎలా, నా పిల్లలకి మొహం ఎలా చూపించాలి అని ఏడుస్తుంది.

అను: బాధపడకండి మీ అబ్బాయికి విషయం చేబ్దాం అర్థం చేసుకుంటారు. ఆయన మీద నమ్మకం ఉంచండి ఎలాగైనా ల్యాండ్ తిరిగి తీసుకువస్తారు అని ధైర్యం చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఇంట్లో అయ్యప్ప పూజ చేస్తారు పిల్లలు. తర్వాత పిల్లలకి అరిటాకులో బిక్ష పెట్టాలనుకుంటుంది అను. కానీ పిల్లలు నేల మీద భోజనం చేస్తాం అంటారు.

అను: నేల మీద భోజనం చేయటం ఏమిటి ఇప్పటికే మీరు చాలా కఠోరంగా దీక్ష చేస్తున్నారు అంటుంది.

ఆర్య: మరీ అంత మూఢనమ్మకం పనికిరాదు ఆకులలో భోజనం చేయండి.

పిల్లలు: మూఢనమ్మకం కాదు ఫ్రెండ్ నమ్మకం మనం ఎంత నిష్టగా చేస్తే భగవంతుడికి అంత దగ్గరగా వెళ్తాము. మన లాజిక్ ఎండ్ అయినచోటే భగవంతుడే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది అని గురువుగారు చెప్పారు. మనం ఎన్ని రోజుల నుంచి మా నాన్నని వెతుకుతున్నాను నువ్వు కూడా వెతుకుతున్నావు కదా అయినా దొరకలేదు అంటే దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు కొన్ని ఉంటాయి అంటారు. నువ్వు కూడా నన్ను చూడు ఫ్రెండ్ అంటారు.

ఆర్య: నేను కూడా దేవుడిని ఎప్పుడూ ఇంతలా నమ్మలేదు నమ్మి ఉంటే బాగుండేదేమో ఇప్పుడు భగవంతుడిని నమ్ముతాను నా భార్య పిల్లలు ఎక్కడ ఉన్నా నా దగ్గరికి చేరుకోవాలి అని సంకల్పంతో ఆర్య కూడా నేల మీదే భోజనం చేస్తాడు.

ఆ తరువాత నిద్రపోతున్న అనుకి సడన్ గా మెలకువ వస్తుంది తను ఆర్యకి దూరంగా ఉన్నందుకు తీవ్రమైన మానసిక సంఘర్షణ అనుభవిస్తూ ఉంటుంది. రాజనందిని ఆత్మ బయటకు వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అంటుంది. లేదు నేను ఆయనకు దగ్గరవుదాం అనుకున్న ప్రతిసారి ఆయనకి ప్రమాదం వస్తుంది ఎందుకు అంటుంది అను.

ఆత్మ: అది నువ్వే తెలుసుకోవాలి ప్రేమ అంటే తప్పించుకుని పారిపోవటం కాదు తెగించి పోరాడటం అంటుంది.

అను : పరిస్థితులతో పోరాడవచ్చు మనుషులతో పోరాడవచ్చు కానీ విధితో ఎలా పోరాడగలను అంటుంది.

ఆత్మ: నీలో పుట్టిన రాజనందిని ఆత్మ విధిని గెలిచి వచ్చిందని మరిచిపోయావా, ప్రేమకు మించిన శక్తి లేదు ప్రమాదమని ప్రేమని దూరం చేయకు ఆర్య దగ్గరికి వెళ్లి తన ప్రేమని తనకి దక్కించు.

ఆయన దగ్గరికి వెళ్ళలేను ఆయన ప్రాణాలకి ప్రమాదం తీసుకురాలేను అని అను అనటంతో నీ ప్రేమే ఆయనకి ప్రాణం అంటుంది ఆత్మ ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget