అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today November 2nd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:    అన్నదమ్ముళ్ల మధ్య మొదలైన గొడవ – తనకు అనుకూలంగా మార్చోకోవాలనుకున్న రాకేష్‌

Prema Entha Madhuram  Today Episode:  జాబ్‌ విషయంలో శంకర్‌ కు వాళ్ల తమ్ముళ్లకు గొడవ జరగుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: శంకర్‌ తమ్ముళ్లిద్దరూ జాబ్‌ కోసం ఇంటర్వూకు వెళ్తుంటారు. ఇంటి ఓనరు పాండు వచ్చి వాళ్లకు వినిపించేలా శంకర్‌ అసలు లోకజ్ఞానం లేదని ఇంకా పద్దతి పాడు అని పట్టుకుని కూర్చుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయి. తనంటే కష్టపడ్డాడు తన తమ్ముళ్లను కూడా కష్టపెట్టాలా? అంటాడు. పాండు మాటలు విన్న చిన్నొడు, పెద్దొడు నిజమే ఇంటర్వూలు అన్నీ బోగస్‌ కానీ మన ప్రయత్నం మనం చేద్దాం తర్వాత మను రికమండేషన్‌ కావాలంటే అన్నయ్య చూసుకుంటారులే అనుకుని వెళ్లిపోతారు. మరోవైపు రాకేష్‌ నంబూద్రిని కలిసి మాట్లాడుతుంటాడు.

రాకేష్‌: దీపావళికి వాళ్లిద్దరికీ కంపెనీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదు.

నంబూద్రి: నమ్మకం.. ఆ కుటుంబాన్ని కవచంలా కాపాడుతున్న శక్తి.. అభయ్‌ తన తల్లిదండ్రులను చూస్తుందని నమ్మకం.

రాకేష్‌: అంటూ అభయ్‌ ఆరోజు గౌరి, శంకర్‌ లను చూస్తాడు.

నంబూద్రి: దీపావళి లోపు వాళ్లను అడ్డు తొలగించకపోతే జరిగేది అదే.

రాకేష్‌: ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి నాకున్న ఒకే ఒక్క ఆయుధం అభయ్‌ వాడు వాళ్ల అమ్మా నాన్నాలను చూస్తే వాడు నా చేయి దాటిపోతాడు. ఆ రోజు అభయ్‌ సిటీలోనే లేకుండా చేస్తాను.

  అని చెప్పి రాకేష్‌ వెళ్లిపోతాడు. నంబూద్రి మాత్రం రాజనందిని గురించి బంధించడానికి అది సామాన్య శక్తి కాదని అనుకుంటాడు. మరోవైపు గౌరి ఏదో బడ్జెట్‌ తేడా కొడుతుందని శంకర్‌ ను పిలుస్తుంది. ఇంతలో శ్రావణి, సంధ్య స్వీట్లు తీసుకుని వచ్చి గౌరికి తినిపిస్తూ తమకు జాబ్స్‌ వచ్చాయని చెప్తారు. శంకర్‌ రాగానే స్వీట్స్‌ ఇచ్చి జాబ్స్‌ వచ్చాయని చెప్పగానే శంకర్‌ హ్యాపీగా ఫీలవుతాడు.

శంకర్‌: ఇంతకీ ఏ కంపెనీలో వచ్చాయి జాబ్స్‌..

శ్రావణి: ఆర్యవర్ధన్‌ ఇండస్ర్టీస్‌..

గౌరి: అది అకి వాళ్ల కంపెనీ కదే..

శంకర్‌:  గౌరి గారు మొత్తానికి అకి రికమండేషన్‌తో మంచి జాబ్‌ పట్టేశారన్నమాట.

గౌరి: శంకర్‌ గారు నేను అసలు అకిని కానీ జెండే సార్‌ ను కానీ ఏమీ అడగలేదు.

శ్రావణి: అవునండి మాకు క్యాంపస్‌ ఇంటర్వూ లోనే జాబ్‌ వచ్చింది. ఎవ్వరి రికమండేషన్‌ లేదు.

శంకర్‌: నాకు తెలుసమ్మా మీ ఇద్దరూ కష్టపడి చదువతారు. కష్టపడేవాళ్లకే ఫలితం ఉంటుంది.

   అని అందరూ హ్యాపీగా మాట్లాడుతుండగానే పెద్దొడు, చిన్నొడు డల్లుగా వస్తారు. శంకర్‌ వాళ్లను పిలిచి ఏమైందని అడుగుతాడు. మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారా..? అని అడుగుతాడు. శంకర్‌ ఏమైందిరా అలా ఉన్నారేంటి అని ప్రశ్నించడంతో మాకు జాబ్స్‌ రాలేదన్నయ్యా అని డల్లుగా చెప్తారు. దీంతో శంకర్‌ డిస్సపాయింట్‌ గా మాట్లాడతాడు. తర్వాత వాళ్లను ఓదారుస్తూ.. మీకెందుకురా..? మీరు జెమ్స్‌ కే జెమ్స్‌ మీరేం బాధపడకండి అని భరోసా ఇస్తారు. అయినా పెద్దొడు, చిన్నోడు శంకర్‌ మీద అలిగిపోతారు. మరోవైపు జెండే, యాదగిరి అకి, అభయ్‌, రాకేష్‌ మాట్లాడుతుంటారు.

యాదగిరి: పిల్లలిద్దరూ కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది నాకు.

అభయ్‌: ఇక మీదట మీ సపోర్టు కూడా మాకు చాలా అవసరం.

అకి: రవి ఎలాగూ ఆఫీసులోనే ఉంటాడు కదా అన్నయ్యా.. మామయ్యను ఎందుకు ఇబ్బంది పెట్టడం.

యాదగిరి: నేను అసలు ఆ విషయం మాట్లాడటానికే వచ్చాను సార్‌. మా వాడిని నమ్మి అంత పెద్ద బాధ్యత అప్పజెప్పడం అంటే నాకెందుకో ఇష్టం లేదు సార్‌.

జెండే: యాదగిరి రవి మీద నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వు దాని గురించి ఆలోచించకు అంతా మంచే జరుగుతుంది. అవును శంకర్‌ వాళ్ల బ్రదర్స్‌ క్యాంపస్‌ సెలెక్షన్స్‌ కు వెళ్లారు కదా ఏమైంది.

యాదగిరి: వాళ్లు సెలెక్టు కాలేదంట సార్‌.

జెండే: ఓ అలాగే మన కంపెనీలోనే ఏదైనా జాబ్‌ చూద్దాం.

   అని చెప్పగానే యాదగిరి వద్దని శంకర్‌ కు రికమండేషన్‌ ఇష్టం ఉండదని చెప్తాడు. వాళ్లకు నేను జాబ్‌ ఇచ్చి నేను వాడుకుంటాను అని మనసులో అనుకుంటాడు రాకేష్‌. అందరూ వెళ్లిపోయాక అకి, రవికి చాలా దగ్గర అవుతున్నట్లు ఉందని అభయ్‌ మనసులో అనుమానపు విషం నింపుతాడు రాకేష్‌. మరోవైపు తమకు జాబ్స్ ఇవ్వమని జెండే సార్‌ ను అడగండి అని చిన్నొడు, పెద్దొడు… శంకర్‌ ను అడుగుతాడు. అది కరెక్టు కాదని నా ప్రాణం పోయినా నేను అడగను అని శంకర్ చెప్పగానే ఇద్దరూ అలిగి వెళ్లిపోతారు. మరోవైపు అకి కారులో యాదగిరిని ఇంటి దగ్గర డ్రాఫ్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Issue: మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Issue: మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Pushpa 2 Collection: 'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Embed widget