Prema Entha Madhuram Serial Today March 21st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఆర్య ఇంటికి వచ్చిన అజయ్ ఫ్యామిలీ – అమ్మ మాటే తన మాట అన్న ఆర్య
Prema Entha Madhuram Today Episode: అజయ్ ఫ్యామిలీతో సహా ఆర్యవర్ధన్ ఇంటికి రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: ఆర్యవర్దన్ ఇంటికి అజయ్, మీరాను తీసుకుని లగేజీతో వస్తాడు. ఇంట్లో ఉన్న కేశవ అజయ్‌ని అపుతాడు. ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతాడు. ఇంతలో నీరజ్ వచ్చి ఇది ఆర్యవర్థన్ ఇల్లు ఇక్కడ ఆర్యవర్ధన్ ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. ఇక్కడికి ఎందుకొచ్చావని ప్రశ్నిస్తాడు. దీంతో అజయ్.. నీరజ్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని మనది బ్రదర్స్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ అంటూ మాటలు చెప్తుంటే ఇంకో కొత్త నాటకం మొదలు పెట్టావా? అంటూ కేశవ నిలదీస్తాడు.
నీరజ్: ఏం మాట్లాడుతున్నావు ఎందుకొచ్చావు ఇక్కడికి..
అజయ్: నా ఇంటికి నేను రాకూడదా? ఐమీన్ మన ఇల్లు ఇక మీదట మనందరం కలిసిమెలసి ఉండాలని ఫ్యామిలీతో సహా వచ్చేశాను తమ్ముడు.
కేశవ: నువ్వు మాతో ఇంట్లో కలిసి ఉండటం ఏంటి? గెట్ లాస్ట్
మీరా: ఈ ఇంట్లో ఉండే సర్వహక్కులు మాకు ఉన్నాయని తెలిశాకే ఇక్కడికి వచ్చాము..
నీరజ్: ఎవరు చెప్పారు నీకు..
మీరా: చెప్పిన వాళ్లనే అడగండి
అనగానే శారదాదేవి ఆనందిని తీసుకుని లోపలికి వస్తుంది. దీంతో అమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కేశవ, నీరజ్ అడుగుతారు. పిల్లలు ఈ ఆనందిని ఎందుకు తీసుకొచ్చావు అంటూ నిలదీస్తారు. దీంతో మీరా మా కూతురు మాతో పాటే కదా ఉండాలి అనడంతో నీరజ్, కేశవ, పిల్లలు షాక్ అవుతారు.
నీరజ్: వాట్ ఆనంది మీ కూతురా?
అజయ్: ఎస్ నువ్వు తనకి ముద్దుల బాబాయి..
నీరజ్: అంటే కావాలనే ఆనందిని ఇక్కడికి పంపించి ఇంత డ్రామా ప్లే చేశారా?
అజయ్: అసలు డ్రామా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది తమ్ముడు. టైం వచ్చాకా నీకే తెలుస్తుందిలే
నీరజ్: అమ్మా నువ్వేం మాట్లాడవు అమ్మా..
అంటూ అడగ్గానే శారదాదేవి ఇవాళ్టీ నుంచి అజయ్ తన భార్యా, పాపతో ఇక్కడే ఉంటాడు అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఆర్య, అను ఇంట్లోకి వస్తుంటారు.
నీరజ్: అమ్మా ఏమైందమ్మా నీకు అసలేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటమ్మా... దాదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ పాప ఆనంది అజయ్ మీరా వాళ్ల కూతురంట. తెలివిగా ఆ పాపని మన దగ్గరకు పంపించి మన ఫ్యామిలిలో డిస్టబెన్స్ చేయాలని చూస్తున్నారు. అమ్మ కూడా వాళ్లకే సపోర్టు చేస్తుంది దాదా?
అజయ్: అమ్మా చెప్పడం దేనికి తమ్ముడు.. నేను చెప్తాను.
నీరజ్: అమ్మా కాదు పెద్దమ్మ.. నువ్వు నన్ను తమ్ముడు అని పిలవకు అలా పిలిచే హక్కు మా దాదాకే ఉంది.
అజయ్: అమ్మ ఎవరికైనా అమ్మే కదా తమ్ముడు.. అన్ని నిదానంగా తెలుస్తాయిలే తమ్ముడు. అప్పటిదాకా నేను ఇదే ఇంట్లో ఉంటాను.
నీరజ్: అతను నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు దాదా?
ఆర్య: నేను అమ్మ మాటకు ఎప్పుడూ ఎదురుచెప్పనని నీకు తెలుసుకదా నీరజ్
కేశవ: అమ్మ ఏదో సెంటిమెంటల్‌గా ఆలోచిస్తుంటే నువ్వైనా అమ్మకు చెప్పు
ఆర్య: అమ్మా ఈ ఇంట్లో నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు.
శారదాదేవి: వర్ధన్ కుటుంబం అంటేనే ఐకమత్యం బంధాలకు విలువ ఇవ్వడమే ఈ ఇంటికి తెలుసు. అలాంటి కుటుంబంలో ఆస్థుల గొడవలు రాకూడదు. ఆస్థుల కోసం ఎవ్వరూ కూడా కోర్టు మెట్లు ఎక్కకూడదంటే అందరూ ఈ ఇంట్లో కలిసే ఉండాలి
అనగానే ఆర్య మీ ఇష్టం అమ్మా అంటాడు. నీరజ్, కేశవ అడ్డుచెప్పబోతే అమ్మ డిసీజనే నా డిసీజన్ అంటాడు. ఇంతలో పిల్లలు ఆనంది ఇక్కడ ఉండకూడదు అంటారు. దీంతో మీరా ఈ ఇంట్లో ఉండటానికి మీకు ఎంత హక్కు ఉందో ఆనందికి అంతే రైట్స్ ఉన్నాయి అని బేబీ నీకిష్టమైన రూం ఏదో అక్కడికి వెళ్లు అని చెప్పగానే ఆనంది వెళ్తుంది. అజయ్, మీరాను తీసుకుని రూంలోకి వెళ్లిపోతాడు. పిల్లలు, ఆర్య, అను, నీరజ్, కేశవ, శారద అందరూ బాధపడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఉస్తాద్ భగత్‌సింగ్‌లోని గ్లాస్ డైలాగ్‌పై ఎన్నికల సంఘం ఆరా- నోటీసులు ఇస్తామన్న ముకేష్ కుమార్ మీనా