Prema Entha Madhuram Serial Today July 17th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఈవెంట్ కోసం అభయ్ ఇంటికి వచ్చిన గౌరి, శంకర్ - జెండేకు వార్నింగ్ ఇచ్చిన రాకేష్
Prema Entha Madhuram Today Episode: ఈవెంట్ గురించి మాట్లాడటానికి గౌరి, శంకర్ లు కలిసి అభయ్ వాళ్ల ఇంటికి రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: నేను జలంధర్ అని పిలిస్తే నువ్వు ఆగావేంటి అని రాకేష్‌ను అడుగుతాడు జెండే. మొన్న మీరు అకి, అభయ్ డిష్కష్ చేయడం విన్నాను అందుకే ఆగిపోయాను అంటాడు రాకేష్. అయితే జలందర్ కొడుకు దొరుకుతాడా అని జెండే అడిగితే దొరకడని మీకున్న కాలిబర్‌కు ఇదివరకే దొరకాలని ఇంకా దొరకలేదంటే ఇక దొరకడనేగా అర్థం అని చెప్పి వెళ్లిపోతాడు. పక్కకు వెళ్లిపోయిన రాకేష్, జెండేకు ఫోన్ చేస్తాడు.
రాకేష్: హలో జెండెజీ హౌ ఆర్ యూ
జెండె: హూ ఈజ్ దిస్
రాకేష్: వాట్ ఈజ్ దిస్ జెండేజీ నాకోసం వెతుకుతున్నారని తెలిసి పాపం మిమ్మల్ని కష్టపెట్టకూడదని తెలిసి నేనే ఫోన్ చేస్తే ఇంకా ఎవరని అడుగుతారా? ఇంకా గుర్తు పట్టలేదా? జలంధర్ కొడుకుని నేనే
జెండే: నువ్వా?
రాకేష్: నమ్మటం లేదా? నా గొంతు వింటే మా నాన్న గుర్తు రావటం లేదా? లేక మీరు మా నాన్నకు చేసింది ఒక్కొక్కటి గుర్తు చేయాలా? సైలెంట్ అయిపోయావేం జెండేజీ
జెండే: మీ నాన్న లెక్కలేనన్ని పాపాలు చేశాడు. అలాంటి మీ నాన్నని ఏదో గొప్పవాడని ఫీలయ్యి అతని పగని పంచుకోవడం నీ మూర్ఖత్వం మిస్టర్.
రాకేష్: మా నాన్నని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను మిమ్మల్ని ఏం చేయడానికైనా వెనకాడను. వర్దన్ ఫ్యామిలీ లేకుండా చేస్తాను.
ఫోన్ మాట్లాడుతూ పైకి వెళ్లి రాకేష్‌ను చూసిన జెండే ఈ కాల్ రాకేష్ చేయలేదన్నమాట అని వెళ్లిపోతాడు. కానీ రాకేష్ ఇయర్ బర్డ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతుంటాడు. నిన్ను, ఆర్యవర్ధన్ పిల్లల్ని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో అని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో అభయ్ వచ్చి రాకేష్ ను తీసుకుని కిందకు వస్తాడు. జెండే ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు. అభయ్ ఎందుకు అలా కూర్చున్నారని అడుగుతాడు. ఏం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు యాదగిరి భార్య గౌరిని వదిన అని శంకర్‌ను అన్నయ్యా అని పిలవడంతో అందరూ కన్ఫీజ్ అవుతుంటారు. ఇంతలో ఇంటి ఓనరు వచ్చి ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారని అడుగుతాడు. మేము ఖాళీ చేయడం లేదని అందరం కలిసి గౌరి గారి ఇంట్లో ఉంటామని శంకర్ చెప్పగానే
ఓనర్: నా అగ్రిమెంట్ ప్రకారం ముగ్గురికి మించి ఉండకూడదు.
శంకర్: ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు గౌరి గారు చెప్పాలి. గౌరి గారు చెప్పండి.
గౌరి: అవును ఓనరు గారు చెప్పింది నిజమే ముగ్గురికి మించి ఉండకూడదు. మీరు మా ఇంట్లో ఉండటానికి కుదరదు.
శంకర్: ఈ ట్విస్ట్ ఏంటండి నిన్న మీరే ఒప్పుకున్నారు కదా?
గౌరి: నేనేం ఒప్పుకోలేదు. మీరే ఒప్పించారు.
అనగానే శంకర్ అయితే ఈరోజు నుంచి మీతో నేను బిజినెస్ చేయను. నేను వేరే కుంపటి పెట్టుకుంటాను. అనగానే గౌరి కంగారుగా అదేం లేదంటి నేను ఓనరుతో అగ్రిమెంట్ ఉందని చెప్పాను కానీ మిమ్మల్ని ఉండనివ్వను అనలేదండి అంటుంది. ఇంతలో ఓనరు ఏదేదో మాట్లాడుతుంటే యాదగిరి ఓనరును పక్కకు తీసుకెళ్లి గౌరి నోటి దూలకు వాళ్లు రెండు రోజులు కూడా తట్టుకోలేరని చెప్పడంతో ఓనరు ఓకేనని వెళ్లిపోతాడు. ఇంతలో యాదగిరి భార్య వచ్చి ఇంట్లో పాలు పొంగించమని లోపలికి తీసుకెళ్తుంది. గౌరి, శంకర్ లోపలికి అడుగుపెడుతుంటే వాళ్లకు హారతి ఇస్తుంది. తర్వాత ఇద్దరి బిజినెస్ సక్సెస్ కావాలని దేవుడి ముందు దీపం వెలిగించమని చెప్తుంది. తర్వాత గౌరి, శంకర్ ఈవెంట్ గురించి మాట్లాడటానికి అభయ్ వాళ్ల ఇంటికి వస్తారు. గౌరి ఆ ఇల్లును చూడగానే ఏదో గుర్తొచ్చినట్టు లోపలికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ప్రకృతి అందాల మధ్య ముత్యంలా మెరిసిపోతున్న 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు