Prema Entha Madhuram Serial Today february 22nd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఆర్య చేతిలో గ్లాస్ తోసిన ఆనంది – కొత్త డ్రామాకు తెరతీసిన మాన్షి
Prema Entha Madhuram Today Episode: మాన్షి మారినట్లు నటిస్తూ నీరజ్ ను కలవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: అను రూంలో తాళాలు వెతుకుతూ కింద పడబోతుంటే ఆర్య వచ్చి పట్టుకుంటాడు. నా ప్రేమలో ఎప్పుడో పడిపోయావు మళ్లీ మళ్లీ ఎందుకు పడతావంటూ రొమాంటిక్‌గా మాట్లాడతాడు ఆర్య. ఇంతలో అను బయటకు వెళ్లిపోతుంటే
ఆర్య: తాళాలు కిందపడిపోతే తీసి ఇచ్చాను. కనీసం థాంక్స్ కూడా చెప్పరా?
అను: థాంక్యూ సో మచ్ శ్రీవారు.
ఆర్య: ఆ చెప్పేదేదో ఈ బుగ్గకు చెప్పొచ్చు కదా?
అనగానే అను థాంక్యూ సో మచ్ సార్ అంటూ ఆర్య బుగ్గలు గిల్లుతుంది. నేను చెప్పమంది ఇలా కాదు ఇలా అంటూ అనును ఆర్య కిస్ చేస్తాడు. దీంతో అను చూస్తుండిపోతుంటే నచ్చలేదా అయితే నాది నాకు ఇచ్చేయ్ అని ఆర్య అనగానే అను కూడా ఆర్యను కిస్ చేసి వెళ్తుంది. అయితే కింద పడిపోయిన డాక్యుమెంట్స్ చూసిన ఆర్య ఇవి లివీ గార్డెన్ కు సంబంధించినవి ఇక్కడ ఎందుకున్నాయి అనుకుని బయటకు వెళ్తాడు. అఖి, అభయ్ ఆడుకుంటుంటే ఇందిరాదేవి వాళ్లకు టిఫిన్ తినిపిస్తుంది. పైనుంచి ఆనంది చూస్తుంటుంది. ఇంతలో నీరజ్, కేశవ్ బయటి నుంచి వస్తారు. పైనుంచి ఆర్య, అను వస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. అను వంటమనిషి కమలను ఆర్యకు జ్యూస్ తీసుకునిరా అని చెప్తుంది. అలాగేనని జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది కమల. ఆర్య జ్యూస్ తాగబోతుంటే ఆనంది వచ్చి జ్యూస్‌ను తోస్తుంది. గ్లాస్ కింద పడి పగిలిపోతుంది. అందరూ షాక్ అవుతారు.
అను: ఎంటమ్మా ఎందుకు గ్లాస్ అలా నెట్టేశావు. తప్పుకదా?
ఇందిరాదేవి: అసలు ఎందుకు నెట్టేశావు.
అఖి: అడుగుతుంటే ఆన్సర్ చేయవేంటి? మా నాన్న గ్లాస్ ఎందుకు పడేశావు.
ఆర్య: అఖి అలా శౌట్ చేయకూడదు. బీ కామ్. ఏమైంది ఆనంది. ఎందుకలా చేశావు.
ఆనంది: మీరు ఆ జ్యూస్ తాగకూడదు.
నీరజ్: ఏ ఎందుకు
ఆర్య: చెప్పమ్మా ఎందుకు?
ఆనంది: తాగకూడదు అంతే
అనగానే ఇందిరాదేవి పాప ఏంటా సమాధానం అంటే ఆర్య ఇందిరాదేవిని ఊరుకోమని చెప్పి ఆనందిని పైకి వెళ్లమని చెప్తాడు. ఆనంది పైకి వెళ్తుంది. అందరూ ఆనందినే చూస్తుంటారు.
అభయ్: ఎందుకు నాన్న తనని ఏమీ అనలేదు. ఇలా చేస్తే పనిష్‌మెంట్ ఇవ్వాలి కదా?
ఆర్య: అభయ్ డోంట్ టాక్ లైక్ దట్ ఆ అమ్మాయి డిస్టబెన్స్ లో ఉంది.
మీరు స్కూలుకు వెళ్లండి అని చెప్పి ఆర్య ఆనంది గురించే ఆలోచిస్తుంటాడు. కేశవ్ ఆర్యను ఇంకా ఆ పాప గురించే ఆలోచిస్తున్నావా? అని అడగ్గానే అవును అని ఆర్య చెప్పగానే కేశవ్ వెళ్లి సీసీటీవీ పుటేజ్ తీసుకొస్తాడు. అందులో కమల జ్యూస్ తాగి ఆర్యకు తీసుకురావడం ఉంటుంది. అది చూసిన వెంటనే కేశవ్ కమలను ఇంట్లోంచి వెళ్లగొడతాడు.
కేశవ్: చూశావా ఆర్య ఆ పాప నీ పట్ల చాలా కేరింగ్‌గా ఆలోచిస్తుంది. ప్రొటెక్ట్ చేస్తుంది.
ఆర్య: అసలు కిచెన్‌లో జరిగిన విషయం ఆ పాపకు ఎలా తెలిసింది. నా పట్ల అంత కేర్ ఎఫెక్షన్ దేనికి? అన్ని క్వశ్చన్స్ ఆ పాప వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి.
అనగానే అవునని కేశవ్ అంటాడు. మరోవైపు పిల్లల్ని స్కూల్ లో డ్రాప్ చేయడానికి వెళ్లిన నీరజ్‌కు మాన్షి ఎదురుపడుతుంది. నీరజ్ కోపంగా తిడతాడు. దీంతో మాన్షి ఏడుస్తూ ఆ చాయా వాళ్లు నన్ను నమ్మించి మోసం చేశారు. వాళ్ల మాయలో పడి మన కుటుంబానికి అన్యాయం చేశాను అని ఏడువడంతో నీరజ్ తిడుతూ కొత్త డ్రామా ఏంటి? అని నిలదీస్తాడు. నువ్వు ఎంత ట్రై చేసినా నిన్ను ఎవ్వరూ నమ్మరు అని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: గోవాలో గ్రాండ్ గా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం