Prema Entha Madhuram Serial Today April 12th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: మీరాకు పర్సనల్ అసిస్టెంట్‌గా అను – శివరాం కంపెనీలో ఎంప్లాయిగా ఆర్య
Prema Entha Madhuram Today Episode: కంపెనీకి మళ్లీ చేజిక్కించుకోవడానికి అదే కంపెనీలో ఉద్యోగులుగా ఆర్య, అను చేరడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: అను తమిళ అమ్మాయిలా వేషం వేసుకుని అజయ్ చేజిక్కించుకున్న ఆర్యవర్ధన్ కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్తుంది. మరోవైపు ఆఫీసులో అజయ్, మీరా, శివరాం మాట్లాడుకుంటుంటారు. ఇంతలో శివరాం పీఏ వచ్చి సింగపూర్ క్లయింట్ వస్తున్నాడని చెప్పడంతో శివరాం బయపడతాడు. అతనిచ్చిన డెడ్‌లైన్ అయిపోయిందని కంగారుపడతాడు.
అజయ్: ఏంటి ప్రాబ్లమ్
శివరాం: సింగపూర్ క్లయింట్ ఒకతను ఇక్కడొక స్టార్ హోటల్ కట్టబోతున్నాడు. ఆ కాంట్రాక్టు మేమే తీసుకున్నాము. కానీ ఆ ల్యాండ్‌లో 500 రూమ్స్ ఉండేలా ప్లాన్ గీయమన్నాడు. ఎవ్వరూ గీయలేకపోయారు.
అని మాట్లాడుతుండగానే సింగపూర్ క్లయింట్ వచ్చి శివరాంకు వార్నింగ్ ఇచ్చి అరగంట టైం ఇస్తున్నాను లేదంటే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని చెప్తాడు. దీంతో శివరాం అజయ్‌ని ఏదో ఒకటి చేయమని అడిగితే మాకు దీంతో ఏం సంబంధం అంటాడు. దీంతో శివరాం మీరు ఇందులో పార్టనర్స్ మీరు కూడా పాతిక కోట్లు కట్టాలి అని చెప్పగానే కామ్ గా ఉండిపోతారు. ఇంతలో శివరాం పీఏ ఆర్య సార్ హెల్ప్ తీసుకోండి అనగానే సరేనని పీఏను ఆర్యను తీసుకురావాలని చెప్పగానే ఆర్య లోపలికి వస్తాడు. ఆర్య ఫైల్ చూసి ప్లాన్ గీసేద్దాం అని చెప్తాడు.
శివరాం: అలా అయితే ఆ ప్లాన్ ఏదో త్వరగా తీసేయండి సార్
ఆర్య: ఇస్తాను... ఇప్పుడు ఒక టీ తాగితే బాగుంటుంది.
శివరాం: టీ నే కదా సార్ వంద తాగిస్తాను. అతను అరగంటే టైం ఇచ్చాడు.
ఆర్య: నో ప్రాబ్లమ్ నాకు టెన్ మినిట్స్ చాలు
శివరాం: ఇప్పుడే తెప్పిస్తాను సార్.
ఆర్య: మీరే తెస్తే బాగుంటుందేమో..
శివరాం: ఓకే అర్థమైంది సార్ తీసుకొస్తాను.
అని శివరాం టీ తీసుకొచ్చి సార్ టీ అని సర్వ్ చేయబోతుంటే ఆర్య ఆపి మీ పార్టనర్ సర్వ్ చేస్తే బాగుంటుందేమో అనగానే శివరాం మనసులో సారు రివేంజ్ తీర్చుకుంటున్నాడేమో అనుకుంటాడు. ఇంతలో మీరా టీ ఇవ్వబోతుంటే.. నేను మా ఆవిడ చేసిన టీ తప్పా పరాయి స్త్రీ చేతి టీ తాగను అనగానే మీరా అజయ్‌ని టీ సర్వ్ చేయమని చెప్తుంది. అజయ్ టీ సర్వ్ చేస్తాడు. అజయ్ టీ తాగుతుంటే సింగపూర్ క్లయింట్ వస్తాడు. అజయ్ అతనికి ప్లాన్ మొత్తం ఎక్సప్లెయిన్ చేస్తాడు. ప్లాన్ బాగుందని కంన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టమని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో శివరాం హ్యాపీగా ఫీలవుతూ ఆర్యకు థాంక్స్ చెప్తాడు. దీంతో ఆర్య ఎప్పుడూ ఎవర్నీ తక్కువ అంచనా వేయోద్దని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు అను తమిళ్ అమ్మాయి గెటప్‌లో మీనాక్షి అయ్యర్ పేరుతో మీరా దగ్గరకు ఇంటర్వూకు వెళ్తుంది అను.
అను: వణక్కం మేడం..
మీరా: హాయ్.. యువర్..
అను: మై సెల్ఫ్ మీనాక్షి, మిస్ మీనాక్షి అయ్యర్.
మీరా: సీ మీనాక్షి నేను కొంచెం ఫ్రాంక్‌గా మాట్లాడతాను. నాకు కావాల్సింది పర్సనల్ సెక్రటరీ.. కార్పోరేట్ ఆఫీసులో వర్క్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి కార్పోరేట్ ఆఫీసు మేనేజ్ చేయగలరా అనిపిస్తుంది.
అను: అప్పుడియా మేడం. నా వేషం చూసి నన్ను అంచనా వేయకండి. నేను మేనేజ్ చేయగలను. నాకు 5 బాషలు వస్తాయి.
అంటూ అను 5 బాషల్లో మాట్లాడగానే మీరా షాక్ అవుతుంది. దీంతో మరో రెండు ప్రశ్నలు వేసి అను చెప్పిన సమాధానాలు విని వెంటనే జాబ్ ఇస్తుంది. ఇంత ఈజీగా నా బుట్టలో పడతావని అనుకోలేదు మీరా అని మనసులో అనుకుంటుంది అను. మేనేజర్‌ను వెళ్లి కలువు అపాయింట్మెంట్ ఇస్తాడు అనగానే అను వెళ్లిపోతుంది. మరోవైపు కేశవ, ఆర్య మాట్లాడుకుంటుంటారు. 30 రోజుల్లో కంపెనీని దక్కించుకుంటానని చెప్పాను కదా అందుకే ఆ ఇంటర్వూకి వెళ్లాను అని ఆర్య చెప్పగానే మొత్తానికి కంపెనీని దక్కించుకోవడానికి నువ్వే యుద్దం మొదలుపెట్టావు మరి పార్టీ లేదా నాకు అని కేశవ అడగ్గానే ఇద్దరూ కలిసి పానీపూరి తింటుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: యూరప్ ట్రిప్ లో మహేష్ బాబు- కూతురు, కొడుకుతో ఎంజాయ్