అన్వేషించండి

Podharillu Serial Today April 6th: మాధవ్‌కు కొత్త పెళ్లికూతురుని వెతికిన మహా,చక్రి...మరి పెళ్లిసంబంధం కోసం పెద్దిని మహా ఎలా ఒప్పించింది..?

Podharillu Serial Today Episode April 6th: మాధవ్‌కు కొత్త పెళ్లికూతురుని వెతికిన మహా,చక్రి...మరి పెళ్లిసంబంధం కోసం పెద్దిని మహా ఎలా ఒప్పించింది..?

Podharillu Serial Today Episode: రీల్స్‌ చేసుకోవడం కోసం కేశవ్‌ షాపుకు వచ్చిన శైలూ...అతనితో కలిసి రీల్స్‌ చేస్తుంది. ఒక్కటే చేస్తానని చెప్పి మూడు,నాలుగు రీల్స్ చేసేసరికి కేశవ్‌కు ఆమెపై కొంచెం మంచి అభిప్రాయం కలుగుతుంది. ఒక అమ్మాయిని అంత దగ్గరగా ఎప్పుడూ చూడని కేశవ్‌....శైలూ అలా దగ్గరకు వచ్చి మీదమీదపడటంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్‌ అవుతాడు.రీల్స్‌ చేసుకోవడానికి ఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిన శైలూ... ప్రతిరోజూ ఇలాగే వచ్చి రీల్స్ చేసుకుంటానని బ్రతిమిలాడుతుంది. ఆ అవసరం లేదని ఈ ఫోన్ నువ్వే తీసుకోమని కేశవ్‌ అనడంతో శైలూ షాక్‌కు గురవుతుంది.
ఈ మాటలు అంటుంది నిజంగా నువ్వేనా అని అంటుంది. అవునని చెప్పిన కేశవ్‌...నీ దగ్గర ఉన్నప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వమని చెబుతాడు. ఒకవేళ నేను డబ్బులు ఇవ్వకుండా పారిపోతే ఏం చేస్తావని అడిగితే....నువ్వు అలాంటిదానివని తెలిసే...మీనాన్న నెంబర్‌ నా ఫోన్‌లో సేవ్‌ చేసుకున్నానని...నువ్వు తింగరి వేషాలు వేస్తే మీనాన్నకు ఫోన్ చేసి చెబుతానని కేశవ్ బెదిరిస్తాడు.ఎలాగైతేనేం తన ఫోన్ తన చేతికి వచ్చినందుకు శైలూ ఆనందంగా ఇంటికి వెళ్తుంది.
 
గాయత్రిని ఇచ్చి పెద్దికి పెళ్లి చేయలేమని ఫిక్స్ అయిన మహాలక్ష్మీ...మాధవ్‌కు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ విషయం చక్రితోపాటు మిగిలిన అన్నదమ్ములకు చెబుతుంది.మనం పెళ్లి సంబంధం మాట్లాడటానికిపోయినందుకే మా అన్నయ్య పిచ్చితిట్టుడు తిట్టాడని...ఇప్పుడు కొత్తగా వేరే సంబంధాలు చూస్తే చంపేస్తాడని చక్రి అంటాడు.అలాగని వదిలేస్తామా మనం ఏం చేసి అయిన పెద్ది పెళ్లి చేయాల్సిందేనని అంటుంది. అందుకే మ్యాట్రీమోనీలో మాధవ్ బయోడేటా పెడదామని చెబుతుంది. దీనికి కేశవ్‌,కన్నా ఓకే అని చెబుతారు. దీంతో మహాలక్ష్మీ మాధవ్‌ వివరాలన్నీ ఓ మ్యాట్రీమోనీ సైట్‌లో అప్‌లోడ్ చేస్తుంది.దానికి రిజిస్ట్రేషన్ ఫీజు చక్రి ముక్కుపిండి మరీ వసూలు చేసి కడుతుంది. మాధవ్‌కు ఎలాంటి అమ్మాయి కావాలని  మిగిలిన వాళ్లందరినీ అడిగి ఎవరెవరు ఏం అనుకుంటున్నారో కనుక్కుని అలాంటి అమ్మాయి కోసం వెతుకుతుంది. ఇంతలో మాధవ్ అక్కడికి వచ్చి మళ్లీ అంతా కలిసి ఏం గూడుపుఠానీ మొదలుపెట్టారని అడుగుతాడు. ఏం లేదని తప్పించుకుంటారు.
 
మ్యాట్రీమోనీ సైట్‌లో మాధవ్‌ బయోడేటా చూసిన ఒకర రిప్లై ఇవ్వడంతో మహా ఆ విషయం అన్నదమ్ములకు చెబుతుంది. అమ్మాయి ఫొటో చూసి చాలా బాగుందని చెబుతారు. ఈ అమ్మాయి ఇదే ఊరిలో ఓ జ్యూవెలరీ షాప్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోందని...మన పెద్ది నచ్చి వాళ్ల నాన్న రిప్లై ఇచ్చారని చెబుతుంది. అయితే వాళ్లతో ఎవరు మాట్లాడాలని ఇంట్లో అందరూ చాలాసేపు డిష్కషన్ చేస్తారు. మీనాన్న పెద్దవారు కాబట్టి ఆయనతో మాట్లాడిద్దామని మహా అంటుంది.ఆయన మాట్లాడితే వచ్చిన సంబంధం కూడా చెడిపోతుందని చక్రి వద్దంటాడు. చక్రిని మాట్లాడమంటే...వీడు అన్ని అబద్ధాలు చెబుతారని కేశవ్‌ వద్దంటే వద్దంటాడు.
 
అందరూ కలిసి మహాను మాట్లాడమని ఒత్తిడి చేస్తారు. దీంతో చేసేదిలేక మహా ఆడపెళ్లివారికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అవతలి వాళ్లు ఇంతకు నువ్వు ఎవరమ్మా అని అడిగితే....తప్పక నేను వాళ్ల తమ్ముడు చక్రి భార్యనని చెబుతుంది.మా మాధవ్‌ మీకు నచ్చాడా అని అడిగితే...నచ్చాడని మంచిరోజు చూసుకుని పెళ్లిచూపులకు రమ్మని చెబుతాడు.  ఇక దాచిపెట్టి లాభం లేదని....పెళ్లిసంబంధాలు చూస్తున్నట్లు మాధవ్‌ చెబుతారు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలని అడిగితే....అన్నీ గాయత్రి లక్షణాలు చెప్పడంతో...నువ్వు ఇంకా ఆ గాయత్రిని మర్చిపోలేదా అని ఆటపట్టిస్తారు.
 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 7th:కిడ్నాప్‌ గ్యాంగ్‌ వెనక ఉంది మీనన్‌ అని తెలుసుకున్న జేడీ...సిల్కీని చంపేసిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: కిడ్నాప్‌ గ్యాంగ్‌ వెనక ఉంది మీనన్‌ అని తెలుసుకున్న జేడీ...సిల్కీని చంపేసిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయమేంటి? విహారి ఆఫీస్‌లో శకుంతల ఏం చేసిందంటే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయమేంటి? విహారి ఆఫీస్‌లో శకుంతల ఏం చేసిందంటే!
Godavari Serial Today July 7th: 'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం తీసుకొచ్చిన సింహాద్రి! జాను అనుమానించడానికి కారణమేంటి?
'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం తీసుకొచ్చిన సింహాద్రి! జాను అనుమానించడానికి కారణమేంటి?1
Nindu Manasulu Serial Today July 7th: నిండు మనసులు: సిద్ధూ ప్రేరణల పెళ్లికి ఏర్పాట్లు! ఇందిరకు దొరికిన సాక్ష్యం!
నిండు మనసులు: సిద్ధూ ప్రేరణల పెళ్లికి ఏర్పాట్లు! ఇందిరకు దొరికిన సాక్ష్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget