అన్వేషించండి

chinni serial today April 6th: చిన్ని సీరియల్: కావేరి సమాధి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన బాలరాజు! మ్యాడీ చిన్నిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు?

chinni serial today episode April 6th చిన్నిని మ్యాడీ కావేరి సమాధి దగ్గరకు తీసుకెళ్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని తన తల్లి కావేరి ఫోటో తీసుకొని వచ్చి బెడ్ రూంలో మ్యాడీ తల్లి ఫోటో పక్కన పెడుతుంది. మ్యాడీ వచ్చి చిన్ని వెనకాలే నిల్చొని చూస్తే ఏంటి మ్యాడీ అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. ఏంటి మ్యాడీ మా అమ్మ ఫొటో పెట్టాను అని అనుకుంటున్నావా.. మా అమ్మ ఫొటో మన గదిలో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. మ్యాడీ పెళ్లి కాకముందు నీకు ఎక్కడికి తీసుకెళ్లమని చెప్పినా నన్ను తీసుకెళ్లేవాడివి.. ఈ రోజు మా అమ్మ తిథి.. నన్ను మా అమ్మ సమాధి దగ్గరకు తీసుకెళ్తావా.. నీ కోపం పక్కన పెట్టి తీసుకెళ్తావని అడుగుతున్నా తీసుకెళ్తావా అంటుంది. 

మ్యాడీ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోవాలని అనుకుంటే ప్రమీల, వరుణ్ వస్తారు. భార్యాభర్తలు అన్నాక కోపతాపాలు.. అలకలు వస్తూనే ఉంటాయి.. అలాంటివి వస్తే వాటిని దూరం చేసుకోవాలి తప్ప ఇలా చేయకూడదు అని అంటుంది. దేవాకి సపర్యలు చేస్తున్న నాగవల్లిని ప్రమీల మ్యాడీకి చూపించి మీ అమ్మానాన్న ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూశావా.. వాళ్ల మధ్య ఎన్ని అపార్థాలు వచ్చినా అన్నింటినీ పరిష్కరించుకొని ఇలా ఉన్నారు అని చెప్తుంది. బావ చిన్ని వాళ్ల అమ్మ తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావ్.. అది తప్పని నేను నిరూపిస్తా అని చిన్ని చెప్పింది కదా.. చిన్ని నిరూపించకపోతే కదా నువ్వు చిన్నిని ద్వేషించాలి.. అప్పుడు కదా నువ్వు చిన్ని మీద కోపంగా ఉండాలి.. అని వరుణ్ అంటాడు. చిన్ని మీద అంత కోపం వచ్చింది అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో.. అని చెప్తుంది. అమ్మానాన్న అక్కాచెల్లి, అన్న తమ్ముడు ఇలా ఏ బంధం దూరం అయినా ఎలోగోలా బతకగలరు కానీ దాంపత్యబంధం దూరం అయితే బతుకే శూన్యం అయిపోతుంది అర్థం చేసుకో నాన్న అని ప్రమీల చెప్తుంది.

చిన్ని తల్లి ఫోటో దగ్గరకు వెళ్లి నీ దగ్గరకు తీసుకెళ్లమని అంటే మ్యాడీ అందుకు ఇష్టపడలేదు.. 30 రోజుల్లో నువ్వు నిర్దోషి అని నిరూపిస్తా అనుకున్నా.. గడువు తీరేలోపు నిజం నిరూపిస్తా.. ఆ రోజు మ్యాడీ తనంతట తానే నీ సమాధి దగ్గరకు వచ్చి సారీ చెప్తాడు అని అనుకుంటుంది. ఇంతలో మ్యాడీ చిన్ని చిన్ని అని పిలుస్తూ ఉంటాడు. చిన్ని మొత్తం చూస్తుంది.. మ్యాడీ చూసి నేనే పిలిచాను  అని పిలవడంతో చిన్ని పరుగున వెళ్లి హగ్ చేసుకుంటుంది. అది చూసి లోహిత షాక్ అయిపోతుంది.  మీ అమ్మ సమాధి దగ్గరకు తీసుకెళ్తా అని చెప్తాడు. నన్ను తీసుకెళ్తా అంటున్నావ్ అంటే నా మీద కోపం తగ్గింది కదా అని అంటుంది చిన్ని. లేదు మీ మీద కోపం పోలేదు కానీ అమ్మ ఎవరికైనా అమ్మే కదా.. అమ్మ విలువ నాకు తెలుసు అందుకే నిన్ను బాధ పెట్టోద్దు అని తీసుకెళ్తున్నా అంటాడు.  

నాగవల్లి దేవా మాట్లాడుకుంటూ ఉంటే లోహిత పరుగున వెళ్లి మీ కొంప మునిగింది అని మొత్తం చెప్తుంది. దేవా, నాగవల్లి ఇద్దరూ షాక్ అయిపోతారు. చిన్ని మన మ్యాడీని వలలో వేసుకుంటూ ఉంటే శ్రేయని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని లోహిత అడుగుతుంది. చేసుకుంటాడు.. అని నాగవల్లి అంటుంది. చిన్ని మ్యాడీని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవాలని దేవా అంటాడు. నేను ఫాలో అవుతా అని నాగవల్లి అంటే నువ్వు కాదు అని దేవా తన మనిషికి చెప్తాడు. వాళ్లు చిన్ని వాళ్లని ఫాలో అవుతారు. మరోవైపు ఆఫ్ టికెట్ కావేరి చనిపోయిన ప్లేస్‌కి బాలరాజుని తీసుకొస్తాడు.

కావేరి ప్రాణం వదిలేసిన రాయి దగ్గరకు బాలరాజు వెళ్లి ఎమోషనల్ అవుతాడు. అయిన వాళ్లని వదిలేసి నాతో వచ్చిందుకు నేను నిన్ను చాలా అన్యాయం చేశాను.. ఆ దేవా గాడు నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేసి నాకు జీవితకాలం శిక్ష వేస్తాడు అనుకోలేదు.. నీ మెడలో తాళి కట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు నేను ప్రతీ సారి ఓడిపోతూనే ఉన్నాను.. చిన్ని విషయంలోనూ తండ్రిగా ఓడిపోతూ ఉన్నాను.. కావేరి నీకు తెలుసా.. మన చిన్ని ఆ దేవా కొడుకు మహిని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలిగా వెళ్లింది.. మన అదృష్టం కొద్ది మహి చాలా మంచోడు కాబట్టి  ఆ ఇంట్లో చిన్నికి ఆ ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటాడు.. ఇప్పటి వరకు తండ్రిగా ఓడిపోయినా ఇక ముందు తండ్రిగా ఓడిపోను.. నిండు నూరేళ్లు చిన్ని తన అత్తారింట్లో సంతోషంగా కాపురం చేసుకునేలా చేస్తా అని ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget