బైకర్ థియేట్రికల్ బిజినెస్... శర్వానంద్ ముందున్న టార్గెట్ ఎంత?
Published by: Satya Pulagam
'నారీ నారీ నడుమ మురారి' విజయం తర్వాత వస్తున్న సినిమా కావడం, ముఖ్యంగా శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ 'బైకర్' మీద అంచనాలు పెంచాయి.
ప్రేక్షకులలో శర్వానంద్ అంటే ఉన్న రెస్పెక్ట్, క్రేజ్ వల్ల 'బైకర్' నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది.
సుమారు 32 కోట్ల రూపాయలకు 'బైకర్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ తీసుకుందట.
'బైకర్' థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను 'దిల్' రాజు 23 కోట్లకు తీసుకున్నట్టు తెలిసింది.
కర్ణాటక, ప్లస్ రెస్టాఫ్ ఇండియా, అలాగే ఓవర్సీస్ హక్కుల ద్వారా మరొక 7 కోట్లు వచ్చినట్టు సమాచారం.
'బైకర్' వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 30 కోట్లు.
ఇప్పుడు శర్వానంద్ ముందున్న టార్గెట్ 32 కోట్ల షేర్. థియేటర్ల నుంచి 'బైకర్' రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది.
'బైకర్' కోసం 55 కోట్లకు పైగా ఖర్చు చేశారట. సో... ప్రీ రిలీజ్ బిజినెస్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు 60 కోట్లు వచ్చాయి. బైకర్ కోసం పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చినట్టే లెక్క. అయితే థియేటర్స్ నుంచి ఎక్కువ వస్తే లాభాల్లోకి వస్తుంది.