అన్వేషించండి

Podarillu Serial Today May 29th: మహాను నమ్మించడానికి తండ్రి నానాపాట్లు...చక్రితో బిజినెస్‌ చేపిస్తానంటూ ప్రతిపాదన

Podarillu Serial May 29th: మహాను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు ప్రతాప్‌ ఎత్తులు వేస్తాడు.అల్లుడిపై ప్రేమ ఉన్నట్లు చక్రితో బిజినెస్‌ చేయిస్తానంటూ ప్రతిపాదనతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా మారుతుంది.

Podarillu Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఇవాళ అల్లుడిపై మామదే పైచేయిగా నిలుస్తుంది. కూతురుని పూర్తిగా నమ్మించడానికి ప్రతాప్ వేసిన ఎత్తులకు చక్రి ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో ఈరోజు ఏపిసోడ్ రసవత్తరంగా మారుతుంది.
మాధవ్‌ మనసు దోచిన మనీషా
   పనికి వెళ్తుంటే సైకిల్ పంక్చర్‌ అవ్వడంతో మాధవ్‌కు ఏం చేయాలో తెలియక ఆటోకు వెళ్తామని అనుకుంటాడు. సైకిల్‌రోడ్డుపక్కన పడేసి సాయంత్రం వెళ్లేప్పుడు తీసుకుని వెళ్తామని ఫిక్స్‌అవుతాడు. ఆటోకోసం రోడ్డుపక్కకు వెళ్తుండగా అప్పుడే ఆటోకోసం ఓ హిందీ అమ్మాయి అక్కడ ఉంటుంది. ఇద్దరూ ఆటోను ఆపి ఎక్కబోతుండగా తలలు గుద్దుకుంటాయి. అప్పుడే ఆ అమ్మాయిని చూసి మాధవ్‌ కళ్లు వెలిగిపోతాయి. ఆమెకు తెలుగురాదు....మాధవ్‌కు హిందీరాదు. దీంతో ఆటోవాడు ఎక్కడికి వెళ్లాలని అడిగినా....ఆమె చెప్పేది అర్థంకాదు. దీంతో కొంచెంకొంచెం అర్థంచేసుకున్న మాధవ్‌ అడ్రెస్‌ చెప్పి....తాను కూడా అక్కడికే వెళ్తున్నానని చెప్పి తీసుకెళ్తాడు. డబ్బులు ఇచ్చే దగ్గర కూడా ఆమెకు తెలుగురాకపోవడంతో సాయం చేస్తాడు. దీంతో ఆ అమ్మాయి మాధవ్‌కు థ్యాంక్స్‌  చెప్పి వెళ్లిపోతుంది.

మాధవ్‌ తన పనిలో నిమగ్నమై ఉండగా...అప్పుడే బన్సాల్‌ స్వీట్‌ తీసుకుని వస్తాడు. ఊరు వెళ్లి ఇవాళే వచ్చానని...నీకు ఇద్దామని స్వీట్‌ తెచ్చానని చెబుతాడు. ఈసారి నేను ఒక్కడినే రాలేదని...చెప్పి మనీషాను పిలుస్తాడు.ఎవరు ఈ అమ్మాయి కొంపదీసి పెళ్లిచేసుకుని వచ్చావా అంటే కాదన్నా..ఈ అమ్మాయి  మాచెల్లెలు మనీషా అని చెప్పగానే ఇద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటారు. మీకు ముందే పరిచయం ఉందా  అని బన్సాల్‌  అడగ్గా...ఉదయం ఆటో వద్ద కలుసుకున్నామని చెబుతాడు.దీంతో వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.


చక్రితో ప్రతాప్ మళ్లీ గిల్లికజ్జాలు
                          ఇంట్లో ఒంటరిగా ఉండి బోరుకొడుతున్న మహా...నిహారికతో గుడికి వెళ్దామా అని అడుగుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు గుడికి వెళ్దామని ఎంత పిలిచినా వచ్చేదానివి కాదని...ఇప్పుడేంటి నువ్వే గుడికి వెళ్దామా అని అడుగుతున్నావని అంటుంది.అక్కడికి వెళ్లిన తర్వాత వారంవారం గుడికి వెళ్లడం అలవాటు  అయిపోయిందని...అందుకే వెళ్దామని అంటున్నానని అంటుంది. ఇద్దరూ లలితకు చెప్పి గుడికి నడిచి వెళ్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన చక్రితో ప్రతాప్‌, ఆదిమాటల యుద్ధం మొదలుపెడతారు.దీనికి చక్రి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తాడు. సిరిపాపను స్కూల్‌లోదింపడానికి కారు డ్రైవర్‌  లేకపోవడంతో ప్రతాప్‌ చక్రిని డ్రైవర్‌ ఇటు రా అని పిలుస్తాడు. దగ్గరు వచ్చిన చక్రిని నువ్వు డ్రైవర్‌వే కదా వెళ్లి పాపను స్కూల్‌లో దింపిరమ్మని చెబుతాడు. నేను చేసే పనిని దైవంగా భావిస్తానని కాబట్టి మీరు డ్రైవర్‌ అన్నా ఏం పట్టించుకోనని చక్రి చెప్పి పాపన తీసుకుని వెళ్లిపోతాడు.
చక్రితో బిజినెస్‌ పెట్టిస్తామన్న ప్రతాప్‌
  భోజనాలకు అందరూ కూర్చుని చక్రిని పిలవకపోవడంతో మహా చక్రి  ఎక్కడని అడుగుతుంది. మేం పిలిచామని కానీ అల్లుడుగారే ఇంకా రాలేదని ప్రతాప్ అంటాడు. మహా పిలవడంతో చక్రి భోజనానికి వస్తాడు. ఎవరూ వడ్డించకపోతే ఎలా తింటాడని అనగా....లలిత లేచి చక్రి ప్లేట్‌ నిండా నాలుగుఐదు కూరలతో వడ్డిస్తుంది.అంతపెడితే ఎలా తింటాడని మహా అనగా...ఆ  ఇంట్లో అంటే ఒక్క కూరే ఉంటుంది కాబట్టి తినలేడని...కానీ ఇన్ని కూరలు,ఇన్ని వెరైటీలు ఎప్పుడూ చూసి ఉండడుకదా ఎక్కువే తింటాడులే అని అంటుంది.భోజనం చేస్తుండగా ప్రతాప్‌ చక్రిని ఎన్నాళ్లుగా డ్రైవర్‌ ఉద్యోగం చేస్తున్నావని అడుగుతాడు.పదేళ్లుగా చేస్తున్నానని చె‌ప్పగా....డిగ్రీ  అయిపోగానే ఇదే పనిలో చేరావా అని అంటాడు.ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న అని మహా అడ్డు చెబుతుంది. కాదమ్మా ఇంతకు ముందు అంటే అల్లుడుగారు ఒక్కరే ఉండేవారు కానీ ఇప్పుడు ఫ్యామీలో వచ్చింది కదా ఎక్కువ సంపాదించాలి కదా అని అంటాడు.అందుకే అల్లుడిగారితో బిజినెస్‌ చేయిద్దామని అనుకుంటున్నానని అంటాడు. నాకు బిజినెస్‌లు చేయడం రాదని చక్రి చెబుతాడు. నేను దగ్గర ఉండి చేయిస్తానని హామీ ఇస్తాడు.
మహాను శాశ్వతంగా ఇక్కడే ఉంచేలా ప్లాన్‌
                ఆ డ్రైవర్‌గాడిని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి పంపిచేయమని లలిత ప్రతాప్‌ను కోరుతుంది.అందుకు ఓ మంచి ప్లాన్ వేశానని ప్రతాప్‌ ఆది, లలితతో చెబుతుండగా మహా అక్కడికి వస్తుంది. ఏం మాట్లాడుకుంటున్నారని అడగ్గా....ఏం ఉంటుంది నిన్ను శాశ్వతంగా ఇక్కడే ఉంచుకుని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటున్నారని ఆది అంటాడు.దీనికి మహాకు కోపం వస్తుంది. నేను ఇక్కడే ఉండిపోవడానికి వచ్చానని ఎవరన్నారని అంటుంది. అందేంటే ఆ పనికిమాలిన ఇంట్లో ఎలా ఉంటావు అని లలిత కోప్పడుతుంది. నేను మంచి ఉద్యోగం చేసి నా కాళ్లపై నేను నిలబడే వరకు రానని చెప్పాను కదా నాన్న అని మహా అంటుంది.నీ ఇష్టం వచ్చినట్లే చేద్దామని అంటాడు. నాకు తెలిసిన ఫ్రెండ్‌కు చెప్పి నీకు ఉద్యోగం చూడమని చెబుతానని అంటాడు. మొన్న ఓ ఇంటర్వూకు వెళితే ఆ జుట్టుపోలిగాడు చెడగొట్టాడని చెబుతుంది. ఇంతలో ప్రతాప్‌ ఆదిని పిలిచి వాడిని మళ్లీ మన మహా జోలికి రావొద్దని గట్టిగా చెప్పమని చెబుతాడు. హమ్మయ్యా మావాళ్లు వాడిని వద్దంటున్నారంటే....నేను చక్రితో జరిగింది నిజమైన పెళ్లికాదని చెప్పొచ్చని మహా  అనుకుంటుంది. వాళ్లు ఏం ప్లాన్‌లు చేస్తున్నారో ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో తెలియక చక్రి గింజుకుంటాడు.
              

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget