Podarillu Serial Today June 10th: కన్నా తల్లిని రోడ్డుపై చూసిన మహాలక్ష్మీ...ఆమె గురించి నారాయణను నిలదీసిన మహా...
Podarillu Serial Today Episode June 10th: తొలిరోజు ఆఫీసులో ఆనందంగా గడిపి ఇంటికి వస్తుండగా....మార్గమధ్యలో కన్నా వాళ్ల అమ్మను చూసి గుర్తుపడుతుంది. ఇంటికి వెళ్లి నారాయణను నిలదీస్తుంది.

Podarillu Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఏపీసోడ్ ఆసక్తిగా సాగుతుంది. ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న మహాలక్ష్మీకి దారిలో కన్నా వాళ్ల అమ్మ ఎదురుపడుతుంది. ఆమెను గుర్తించి పలకరించేలోపు వెళ్లిపోతుంది.ఇదే విషయం ఇంటికి వచ్చి నారాయణను నిలదీసినా....అతను తప్పించుకుని వెళ్లిపోవడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా మారుతుంది.
కేశవ్ డబ్బులు తిరిగిచ్చేసిన శైలూ
డబ్బులు ఇవ్వడానికి ఇంటికి వచ్చిన శైలూను కేశవ్ కొట్టి పంపించివేయడంతో ఆమె బాధపడి వెళ్లిపోతుంది. తెల్లారిన తర్వాత కేశవ్ మెకానిక్ షెడ్‌లో పనిచేస్తున్న కుర్రాడు రాగానే...నువ్వు కూడా ఆపనికిమాలిన రీల్స్ పిచ్చిదాని వెంట తిరిగి పాడైపోవద్దని కేశవ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నా వెంట పడటంకోసమే అది నిన్ను వాడుకుంటుందని చెబుతాడు. దీంతో కుర్రాడు డబ్బులు కట్ట కేశవ్ చేతికి ఇచ్చి శైలూ అలాంటిదేమి కాదని...తను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు కాపాడావని థ్యాంక్స్ చెప్పి నీ డబ్బులు ఇవ్వడానికి వస్తే కొట్టి పంపించావని చాలా బాధపడిందని అంటాడు. తన ఛైన్ తాకట్టు పెట్టి నీకు డబ్బులు తెచ్చిందని...అవి ఇవ్వడానికి వస్తేనే నువ్వు అవమానించావని చెప్పడంతో కేశవ్ కూడా బాధపడతాడు..
తొలిరోజు ఆఫీసుకు వెళ్లిన మహా
మహాలక్ష్మీని తీసుకుని చక్రి ఆఫీసుకు వెళ్తూ అన్ని జాగ్రత్తలు చెబుతాడు. ఆఫీసులో రకరకాల మనుషులు ఉంటారని వాళ్లను పట్టించుకోకుంండా నీపని నువ్వు చేసుకునిపోవాలని హితవు పలుకుతాడు. అలాగే మహా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ చూపిస్తాడు. తనకు ఆ బహుమతి నచ్చదేమోనని భయపడతాడు.కానీ చక్రి ఇచ్చిన వాచ్ చూసుకుని మహాలక్ష్మీ చాలా మురిసిపోతుంది. గిప్ఠ్ చాలా బాగుందని చెప్పడంతో చక్రి కూడా చాలా సంతోషపడతాడు. ఆఫీసు దగ్గర దిగిపోతూ...ఎట్టిపరిస్థితుల్లో సాయంత్రం రావొద్దని చెబుతుంది. నేను బస్సులో వస్తానని చెప్పి వెళ్లిపోతుంది.
కేక్ కట్ చేసి సంబరాలు
ఆఫీసులో అడుగుపెట్టగానే అందరూ మహాకు స్వాగతం పలుకుతారు. బాస్ కేక్ తీసుకొచ్చి ఆమెతో కట్ చేయించడానికి ఏర్పాట్లు చేస్తాడు.ఇదేంటి ఇలా అని మహా అడగ్గానే...ఈ ఆఫీసులో బాయ్ జాయిన్ అయినరోజు కూడా ఇలాగే చేశామని ఇక్కడ అందరూ సమానమేనని చెబుతారు.ఇంతలో వాళ్లకు ఓ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. మహాలక్ష్మీ కంపెనీలో అడుగుపెట్టిన వేళావిశేషం వల్లే ఇది సాధ్యమైందని అందరూ ఆమెను గోల్డెన్‌లెగ్ అంటూ విష్ చేసి వెళ్లిపోతారు. మహాకు అక్కడ దివ్య పరిచయమవుతుంది.మన కష్టాన్ని బట్టి శాలరీ పెంచుతారని హోదా పెరుగుతుందని చెబుతుంది. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు.ఇంతలో మహా వ్యక్తిగత విషయాలు గురించి దివ్య అడగ్గా...తనకు ఇంకా పెళ్లికాలేదని అబద్ధం చెబుతుంది.
కన్నా తల్లిని చూసిన మహా
ఆఫీసు అయిపోయిన వెంటనే ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై కన్నా తల్లి మహాను ఢీకొట్టి ఆగుతుంది. సారీ చెప్పి వెళ్లబోతుండగా మహా ఆమెను గుర్తుపట్టి పలకరించేలోపు ఆమె బస్సు ఎక్కి వెళ్లిపోతుంది. అదే ఆలోచిస్తూ మహా ఇంటికి వెళ్తుంది.కన్నా ఏమైందని అడిగితే ఏంలేదని చెబుతుంది. తొలిరోజు ఆఫీసులో అంతా బాగానే జరిగిందని చెప్పిన మహా....నారాయణ వద్దకు వెళ్లి కన్నా తల్లి గురించి ఆరా తీస్తుంది. తన గురించి ఏం అడిగినా నారాయణ తప్పించుకోవడంతో...నేను ఆమెను ఇవాళ చూశానని చెప్పడంతో షాక్ తింటాడు. నువ్వు ఎవరిని చూసి ఎవరో అనుకుని ఉంటావని అంటాడు. నారాయణ నిజం దాచిపెడుతున్నాడని మహా అనుకుంటుంది.
ట్రెండింగ్ వార్తలు





















