అన్వేషించండి

Oorvasivo Rakshasivo Serial Today March 4th: ఊర్వశివో రాక్షసివో సీరియల్: దుర్గే వైష్ణవి అని తెలుసుకున్న విజయేంద్ర.. రక్షిత, ధీరుల ఎదుటే నిలదీత, దుర్గ ఏం చేయనుంది!

Oorvasivo Rakshasivo Serial Today Episode రక్షిత బతిమాలడంతో ధీరుని పెళ్లి చేసుకోవడానికి దుర్గ ఒప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Oorvasivo Rakshasivo Today Episode  రక్షిత తన కొడుకు ధీరుని పెళ్లి చేసుకోమని దుర్గని వేడుకుంటుంది. దీంతో దుర్గ ఏం చేయాలి అని తన తండ్రి దయాసాగర్‌ని అడుగుతుంది. దీంతో దయాసాగర్ నాకు నిజానికి ఈ పెళ్లి ఇష్టం లేదు కానీ ధీరు ప్రేమని నేను నమ్ముతాను చావు దాకా వెళ్లాడు అంటే తన ప్రేమ నాకు అర్థమవుతుంది. నీ నిర్ణయమే నా నిర్ణయం దుర్గ అని దయాసాగర్ అంటాడు.

దుర్గ: మనం ప్రేమించిన వాళ్లని పెళ్లి చేసుకోవడం కంటే మనల్ని ప్రేమించిన వాళ్లని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటామని మీరు నాకు ఎప్పుడు చెప్తుంటారు కదా నాన్న. ధీరుని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటానని అనిపిస్తుంది. నాకు అమ్మ లేదు అమ్మలా ప్రేమను పంచుతాను అంటున్నారు కదా. అంత కంటే ఆడపిల్లకి ఏం కావాలి నాన్న. రక్షిత గారు నేను ధీరుని పెళ్లి చేసుకుంటాను. 
రక్షిత: ఈ నిర్ణయంతో నువ్వు ప్రాణం పోస్తుంది ధీరుకి కాదు నాకు కూడా.. దుర్గ నువ్వు మాతో హాస్పిటల్‌కి రామ్మా. నవ్వు వచ్చి ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్తే ధీరు ట్రీట్మెంట్‌ చేయించుకుంటాడు. 
దుర్గ: నాన్నా..
దయాసాగర్: వెళ్లి రామ్మా.. మనసులో.. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది దుర్గ. కానీ ఇప్పటి నుంచి నీకు ఏమవుతుందా అనే భయం  నాకు ఇంకా ఎక్కువ అవుతుంది. 
దుర్గ: ధీరు.. ఇదంతా నిజమా లేక యాక్ట్ చేస్తున్నాడా..
రక్షిత: ధీరు నీ కోసం దుర్గ వచ్చిందిరా ఒక్క సారి కళ్లు తెరచి చూడు. ధీరు నువ్వు త్వరగా కోలుకుంటే వెంటనే మీ నిశ్చితార్థం, పెళ్లి చేసేస్తా..
ధీరు: మామ్ అబద్ధం చెప్పడం లేదు కదా.. మా పెళ్లికి ఒప్పుకున్నావా.. నేను నీ మాటే నమ్ముతా దుర్గ.. ఇంకా ఎవరి మాటలు నమ్మను.
దుర్గ: మనం పెళ్లి చేసుకోబోతున్నాం. మనసులో.. నీ లైఫ్ సర్వనాశనం అవ్వబోతుంది ఈ దెబ్బతో.. నీకు ఇక లైఫ్ లేకుండా పోతుంది ధీరు. 
విజయేంద్ర: ధీరు కంగ్రాట్స్..
ధీరు: మనసులో.. విజయేంద్ర నువ్వు ఈ జన్మకి ఇక ఇంతే..
రక్షిత: దుర్గ నీకు మీ నాన్నకి ఒకే అయితే రేపే మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపిద్దాం. 
దుర్గ: మీ ఇష్టం రక్షిత గారు. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. నాకు ఏం ప్రాబ్లమ్ లేదు. ఏం జరిగినా నేను మీ ఇంటికి రావడమే కదా ముఖ్యం.. అందరూ కోరుకునేది నేను ధీరు ఒక్కటి అవ్వడం. మీ కోడలిగా.. మీ ఇంటికి రావడం ముఖ్యం కదా అంతే..
రక్షిత: సరే నేను ఏర్పాట్లు చేయిస్తాను. నువ్వు వెళ్లి నీ పనులు చూసుకోమ్మా. ధీరుని ఇంటికి తీసుకొచ్చాక నీకు ఫోన్ చేస్తాను. 
దుర్గ: ధీరు జాగ్రత్త వస్తాను ఆంటీ..

విజయేంద్ర, దుర్గ ఓ చోట నిల్చొంటారు. వైష్ణవితో విజయేంద్ర గడిపిన క్షణాలను చూపిస్తారు. విజయేంద్ర వైష్ణవి గురించి, దుర్గ విజయేంద్ర గురించి ఆలోచించి బాధ పడుతుంది. 
విజయేంద్ర: ఏమైంది దుర్గ ఏం ఆలోచిస్తున్నావ్.. ఏమైంది.
దుర్గ: ఏం కాలేదు. 
విజయేంద్ర: నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ధీరుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా. 
దుర్గ: ఎందుకు అలా అడుగుతున్నావా..
విజయేంద్ర: నాకు ఎందుకో బలవంతంగా నీ మనసుకు నచ్చచెప్పుకొని పెళ్లికి రెడీ అయ్యావు అనిపిస్తుంది. 
దుర్గ: మనసులో.. నా మనసులో నువ్వు ఉన్నావు విజయేంద్ర కానీ నా ముందు ఉన్న లక్ష్యం పవిత్రకు అన్యాయం చేసిన వాళ్ల పతనం. అందుకే నీ మీద ప్రేమకు నచ్చజెప్పి పెళ్లికి సిద్ధపడుతున్నాను. నిన్ను మోసం చేస్తున్నాను. నన్ను క్షమించు.
విజయేంద్ర: నాకు అనిపించింది రైట్ అని నేను అనను కానీ అనిపించింది చెప్తున్నాను. దుర్గ పెళ్లి అనేది ఎవరితో జరగాలి అనేది ముందే నిర్ణయించుంటారు అంటారు కదా నేను దాన్నే నమ్ముతాను. 
దుర్గ: విజయేంద్ర నిన్ను ఏ అమ్మాయి చేసుకుంటుందో కానీ తను లక్కీ. నువ్వు ఎవర్ని బాధ పెట్టవు. రిలేషన్‌ షిప్ష్‌కి విలువిస్తావు. ఎదుటి వారిని బాగా అర్థం చేసుకుంటావు. అందుకే నిన్ను చేసుకోబోయే అమ్మాయి  లక్కీ. 
విజయేంద్ర: ప్రేమించిన అమ్మాయి కనిపించాలి తనకి నా మీద కోపం పోవాలి. అప్పుడు కదా పెళ్లి గురించి ఆలోచించాలి.
దుర్గ: అంటే తను కనిపించకపోతే ఇంకెవరినీ పెళ్లి చేసుకోవా. 
విజయేంద్ర: చేసుకోను. ఇంకేం చేయాలి. నువ్వు ఒకబ్బాయిని ప్రేమించావే అనుకో. తనంటే నీకు ప్రాణం తను కొన్ని రోజులు కనిపించలేదు అని కోపం పెంచేసుకొని మనసులో ఉన్న ప్రేమని చంపుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా..  దుర్గ ఏడిస్తే.. దుర్గ నేను ఏదో నార్మల్‌గా అడిగాను దానికే కంగారు పడిపోయావా ఏంటి. 
దుర్గ: అదేం లేదు. అయినా కాలం మనుషుల్ని మార్చుతుంది. కచ్చితంగా మీకు మంచి భార్య వస్తుంది.
విజయేంద్ర: కాలం పరిస్థితుల్ని మార్చుతుంది. మనుషులు దాని వల్ల కాంప్రమైజ్ అవుతారు కానీ మనసులే దుర్గ నేను చచ్చేదాక నా మనసులో వైష్ణవే ఉంటుంది. వైష్ణవి ఉన్నంత వరకు వేరే అమ్మాయికి నా జీవితంలో స్థానం ఉండదు. 
దుర్గ: మరీ మొండిగా మాట్లాడకండి.. ఇలా అంటున్నాను అని ఫీలవకండి. అసలు తను బతికి ఉందో లేదో.. లేకపోతే ఇంకెవరితో అయినా పెళ్లి అయిపోతుందేమో.. తెలీదు కదా.. అదే జరిగి ఉండి మీరు తన కోసం ఎదురు చూస్తే మీ జీవితానికి అర్థం ఉండదు కదా.. 
విజయేంద్ర: నా జీవితమే తను అయితే ఇక అర్థం ఉండకపోవడం ఏంటి. వైష్ణవి బతికే ఉంటే తను ఎన్ని కష్టాలు వచ్చినా నా కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నన్ను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోదు. ఒకవేళ నువ్వు అన్నట్లు తను లేకపోతే తన జ్ఞాపకాలతో బతికేస్తా..
దుర్గ: విజయేంద్ర ఇప్పటికే నీకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్నావ్. రెండు సంవత్సరాలు నీ జీవితం కోల్పోయావు. ఇంకా ఎందుకు అనవసరం అయిన విషయాల్లో ఇరుక్కోవడం.
విజయేంద్ర: ఇక ఆ టాపిక్ వదిలేయ్. ప్లీజ్.. నా మనసు ఎవరు చెప్పినా మారదు. నేను ఇంతే. నేను ఎవరికీ త్వరగా కనెక్ట్ అవ్వను. నా వైష్ణవి తర్వాత నీతోనే ఇంత క్లోజ్‌గా ఉన్నాను. మీకు తనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. నీకు మాటిస్తున్నాను నీకు నా నుంచి ఎలాంటి టైంలో అయినా ఏ విధంగా హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రామిస్. 
దుర్గ: థ్యాంక్యూ విజయేంద్ర. 
విజయేంద్ర: అవును పానీ పూరీ తిందామా..
దుర్గ: పానీ పూరీనా కుమ్మేస్తా.. ఏమైంది అలా చూస్తున్నావ్..
విజయేంద్ర: నా వైష్ణవి కూడా ఇదే పదం వాడేది కుమ్మేస్తా అని.. పదండి వెళ్దాం. ఇక పానీ పూరీ వ్యక్తి దుర్గ, విజయేంద్రలను లవర్స్ అనుకుంటాడు. పెళ్లి అయిన కూడా తన బండి దగ్గరకే వచ్చి పానీ పూరీ తినమంటాడు. విజయేంద్ర తాము ఫ్రెండ్స్ అని అంటాడు. అందరూ ముందు ఇలాగే చెప్తాడని అతను అంటాడు.

మరోవైపు ఉదయం విజయేంద్రకు తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఏదో చెప్తాడు. విజయేంద్ర నిజమా అని అలా ఎలా అని అడిగి ఎమోషనల్ అవుతాడు. వైష్ణవి, దుర్గలను గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడే నా వైష్ణవిని చూడాలిరా అని బయల్దేరుతాడు. ఇక రక్షిత ఇంట్లో నిశ్చితార్థానికి దుర్గ తన తండ్రి వస్తారు. దుర్గని కూతురిలా చూసుకుంటానని రక్షిత దుర్గతో చెప్తుంది. ఇంతలో విజయేంద్ర పరుగున వచ్చి.. దుర్గని వైష్ణవి అని పిలుస్తాడు. అందరూ షాక్ అవుతారు. 

విజయేంద్ర: దుర్గని పట్టుకొని వైష్ణవి ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావ్. 
ధీరు: బ్రో నీకు ఏమైనా పిచ్చి పట్టిందా తను నా దుర్గ అయితే వైష్ణవి అంటావ్ ఏంటి.
విజయేంద్ర: ధీరు నేను నీతో మాట్లాడటం లేదు నువ్వు సైలెంట్‌గా ఉండు... చెప్పు చెప్పు వైష్ణవి నిజం చెప్పు. గట్టిగా అరిచి చెప్పు నీకు ఏం కాదు. నీకు తోడుగా నేను ఉన్నాను. నువ్వు వైష్ణవే అని చెప్పు. 
దుర్గ: విజయేంద్ర మీకు ఏమైంది నేను దుర్గని.. 
విజయేంద్ర: అబద్ధం.. ఇన్ని రోజులు దుర్గ అనే ముసుగులో అబద్ధపు జీవితం గడుపుతున్నావు. ఇప్పటికైనా నిజంలోకి రా వైష్ణవి.
రక్షిత: విజయేంద్ర ఏం మాట్లాడుతున్నావ్.
విజయేంద్ర: దయచేసి దుర్గ నిజం చెప్పేవరకు ఎవరూ మాట్లాడకండి. 
దుర్గ: మనసులో.. నేనే వైష్ణవి అన్న విషయం విజయేంద్రకు ఎవరు చెప్పారు. ఎలా తెలిసింది.
విజయేంద్ర: ఇప్పటి వరకు నీ కోసం వెతుకుతూ వెతుకుతూ.. నరకం అనుభవించింది చాలు వైష్ణవి. నా మీద కోపం ఉంటే కొట్టు తిట్టు. నేనే యూఎస్ వెళ్లిన తర్వాత ఏమైందో నీకు చెప్పాను. అందువల్లే మిమల్ని కలవలేకపోయాను. అంతే కాక కావాలని నేను రాకుండా లేను వైష్ణవి. నువ్వంటే నాకు ప్రాణం. దుర్గ ఏడుస్తుంది.
ధీరు: బ్రో తను వైష్ణవి కాదు నా దుర్గ. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగావు అంటే బాగోదు చెప్తున్నా.
విజయేంద్ర: పిచ్చిగా వాగడం కాదు నేను చెప్పేది నిజం. దుర్గ రూపంలో ఉంది దుర్గ కాదు నా వైష్ణవి. నిజం చెప్పు ఎవరు నువ్వు దుర్గవా లేక నా వైష్ణవివా..  చెప్పు వైష్ణవి నిజం చెప్పు.
దుర్గ: నేను దుర్గని..
విజయేంద్ర: అబద్ధం చెప్పకు. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 4th: ఆదర్శ్‌ని హగ్ చేసుకున్న ముకుంద.. గాజులతో కన్నింగ్ ప్లాన్.. మురారి కోసం గుడిలో బరితెగింపు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Embed widget