Krishna Mukunda Murari Serial Today March 4th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆదర్శ్‌ని హగ్ చేసుకున్న ముకుంద.. గాజులతో కన్నింగ్ ప్లాన్.. మురారి కోసం గుడిలో బరితెగింపు!
Krishna Mukunda Murari Serial Today Episode ఆదర్శ్ తనని తాకడం ఇష్టం లేని ముకుంద తన చేతి గాజులు పగలగొట్టి ఆదర్శ్‌ని గాయపరచడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Telugu Serial Today Episodes: పంతులు గారు రెండు జంటలకు ప్రదక్షణలు చేయమంటారు. దీంతో ముకుంద షాక్ అయిపోతుంది. ఆదర్శ్ గాలి తగలడమే కష్టం అనుకుంటే హగ్ చేసుకొని ప్రదక్షణలు చేయడం ఏంటి అని ఎలా తప్పించుకోవాలా అనుకుంటుంది. ముకుంద అవసరమా అని అడిగితే రేవతి, కృష్ణలు దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని ముకుందకు వివరిస్తారు.
మధు: దీనికి ఇంత వివరణ ఎందుకు పెద్దమ్మ. అసలు ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరైనా వద్దు అంటారా ముకుంద ఎందుకు వద్దు అంటుందో అర్థం కావడంలేదు.
ముకుంద: నేనేం వద్దు అనడం లేదు. ఒకరి పాదాల మీద ఒకరు నిల్చొంటే నొప్పి పుడుతుంది కదా. అలాంటిది మూడు ప్రదక్షణలు అంటే చాలా ఇబ్బంది కదా..
మురారి: మాకు లేని కష్టం మీకు ఎందుకు.
కృష్ణ: బాగా చెప్పారు ఏసీపీ సార్. భార్యని ఆ మాత్రం మోయకపోతే ఇంకెందుకు. ఆదర్శ్ నువ్వు ఏమైనా ఇబ్బందిగా రెడీ అవుతున్నావా..
ఆదర్శ్: నాకు ఇబ్బంది ఎందుకు నేను రెడీ..
కృష్ణ: ముకుంద చేస్తుంది కదా ఏసీపీ సార్..
మురారి: చేయక ఏం చేస్తుంది వేరే ఛాన్స్ కూడా లేదు. అందరి ముందు ధైర్యంగా నో చెప్పేదే అయితే ఎప్పుడో చేసేసేది.
ముకుంద: మనసులో.. ఇదెక్కడి ఖర్మరా బాబు కాదు అంటే మళ్లీ అదొ గొడవ. ఈ మురారిని అనాలి అనుకొని ఆదర్శ్ పాదలను కొంచెం టచ్ చేసి ఈ మాత్రం చాలు బరువు మోయక్కర్లేదు అంటుంది.
మురారి: నేను చెప్పానా మీరు మమల్ని పట్టుకొని అంత సేపు నిలబడలేరు పడిపోతారు అని మీకు భయం అని.
కృష్ణ: ఏసీపీ సార్ నాకు ఏం భయం లేదు నన్ను ఏం అనొద్దు. ఏంటి ముకుంద నీ వల్ల మనద్దరం మాటలు పడాల్సి వస్తుంది. అయినా పంతులుగారు చెప్పింది మర్చిపోయావా. ఇద్దరూ ఎంత దగ్గర ఉంటే జీవితాంతం అంత దగ్గరగా ఉంటారు కదా.. చూస్తా వేంటి పట్టుకో ఆదర్శ్‌ని ఫస్ట్.
ముకుంద: మనసులో.. ఏం చేసినా వీళ్లకి అనుకూలంగా పాజిటివ్‌గా మార్చుకుంటున్నారు. నాకు ఇష్టం లేదు అని ఎవరికీ అర్థం కావడం లేదు. అర్థమైన మురారి ఇంకా కావాలని ఇరికిస్తున్నాడు అని బలవంతంగా ఆదర్శ్‌ని పట్టుకొని నిల్చొంటుంది. ఇక మురారి, కృష్ణలు సంతోషంగా ఒకర్ని ఒకరు పట్టుకొని ప్రదక్షిణలు చేస్తారు.
ముకుంద: మనసులో..ఇక నా వల్ల కాదు ఏదో ఒకటి చేయాలి ఆలోచించు ముకుంద అనుకొని తన చేతి గాజులను పగలగొట్టుకొని కావాలనే ఆదర్శ్ కాలికింద వేస్తుంది. దీంతో ఆదర్శ్ కాలికి గాజు పెంకులు గుచ్చుకుంటాయి. దీంతో ఆదర్శ్ నొప్పితో విలవిల్లాడి ముకుందని వదిలేస్తాడు.
కృష్ణ: అయినా గాజులు ఇక్కడికి ఎలా వచ్చాయి.
ముకుంద: నా గాజులే కృష్ణ. సారీ ఆదర్శ్ ఇదంతా నా వల్లే.. ఎక్కడ పడిపోతానో అని గట్టిగా పట్టుకున్నాను అందుకే ఇలా జరిగింది సారీ ఆదర్శ్.
ఆదర్శ్: నీ తప్పు ఏముంది ముకుంద అనుకోకుండా జరిగింది కదా కావాలని చేసింది కాదు కదా..
మధు: మనసులో.. నాకు డౌటే.. కావాలనే చూసుంటుంది.
ముకుంద: ఇప్పటికే నా వల్ల చాలా జరిగింది. ఇక మరి ప్రదక్షిణలు వద్దు..
ఆదర్శ్: పర్వాలేదు..
మురారి: వద్దులే ఆదర్శ్ నువ్వు బాధ పడితే ముకుంద అస్సలు తట్టుకోలేదు. అయినా రెండు ప్రదక్షిణలు చేశాం కదా పదండి..
కృష్ణ: ముకుంద కావాలనే చేసింది కదా ఏసీపీ సార్..
మురారి: తెలుసు పూర్తి కాకుండా ఆపగలిగిందేమో కానీ మొదలు పెట్టకుండా ఆపలేకపోయింది కదా అది చాలు పద..
ఇక గుడి ప్రాంగణంలో అందరూ కాయిన్స్ పెడతుంటే నేను పెడతాను అని ముకుంద అంటుంది. కృష్ణ, మురారిలు షాక్ అవుతారు. ఇక మురారికి ముకుంద కాయిన్ అడుగుతుంది. ఇక మనసులో ముకుంద నా కోరిక ఏంటో నీకు తెలుసు అది తీరబోతుంది అని ఇప్పుడు నిరూపిస్తా చూడు అనుకుంటుంది. ఇక కృష్ణ కూడా కాయిన్ అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.