Oorvasivo Rakshasivo Serial Today February 21st: ఊర్వశివో రాక్షసివో సీరియల్: వైష్ణవి ఇంటి దగ్గర వెక్కివెక్కి ఏడ్చిన విజయేంద్ర, దుర్గకు యాక్సిడెంట్
Oorvasivo Rakshasivo Serial Today Episode వైష్ణవి ఇంటికి దుర్గ వెళ్లడంతో అక్కడకి విజయేంద్ర కూడా వస్తాడు. దుర్గకు అక్కడే యాక్సిడెంట్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Oorvasivo Rakshasivo Today Episode: టాక్స్ కట్టడానికి వెళ్లిన దుర్గ తన ఇంటికి చూసి ఎమోషనల్ అవుతుంది. మరోవైపు విజయేంద్ర కూడా అక్కడికే బయల్దేరుతాడు. దుర్గ ఇంటి లోపలికి వెళ్తుంది. తన చెల్లి పవిత్రతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది.
విజయేంద్ర: ఏ అబ్బాయి అయినా ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులల్లో ఆ అమ్మాయిని చూసి అనందపడిపోతాడు. ఇప్పుడు నేను చేయబోయేది కూడా అదే. వైష్ణవిని గుర్తుచేసే ఈ లాకెట్, తన ఇళ్లు తప్ప ఇంకేం లేవురా.
విజయేంద్ర ఫ్రెండ్: వామ్మో ఒకమ్మాయిని ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా.
దుర్గ ఇంటి లోపల ప్రతి ఒక్క వస్తువును చూసి ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. తన తండ్రి తనని చెల్లిని కూర్చొపెట్టుకొని చెప్పిన మాటలు తలచుకొని ఏడుస్తుంది. తర్వాత తన తల్లిదండ్రుల ఫొటో దగ్గర కూలబడి ఏడుస్తుంది. తర్వాత తన ఫొటోని తాను చూసుకుంటుంది. ఇంతలో విజయేంద్ర కూడా అక్కడికి వస్తాడు.
విజయేంద్ర ఫ్రెండ్: తలపులు తెరచే ఉన్నాయి అంటే నీ వైష్ణవి వచ్చే ఉంటుందిరా. విజయేంద్ర పరుగులు తీస్తాడు. ఇంతలో దుర్గ చూసి షాకై పరుగెడుతుంది. విజయేంద్ర వైష్ణవి వైష్ణవి అని అరుస్తాడు.
విజయేంద్ర: వైష్ణవి ఎక్కడున్నావ్. వైష్ణవి..
విజయేంద్ర ఫ్రెండ్: విజయేంద్ర వచ్చుంటుందని నేను జోక్ చేశానురా.. నువ్వు పిచ్చోడిలా పరుగెత్తుకుంటూ వచ్చావురా.
విజయేంద్ర: ఇన్నాళ్లు తనకి దూరంగా ఉంటూ నరకం అనుభవిస్తున్నాను. తను వైష్ణవి అయితే నేను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టిఉండలేను. వైష్ణవి.. ఏమైపోయావ్. నువ్వు ఎక్కడున్నావన్న ఒక్క క్లూ దొరికినా చాలా నిన్ను చేరుకుంటాను. నా ప్రేమ గెలిపించుకుంటాను.
దుర్గ: మనుషులగా చాలా దగ్గరగా ఉన్నాం విజయేంద్ర కానీ మనసులే ఎప్పుడో దూరం అయ్యాయి.
విజయేంద్ర: నువ్వు నా కళ్ల ముందు వచ్చి ఎంత పెద్ద శిక్ష వేసినా భరిస్తాను. కానీ నువ్వు నాకు కనిపించకపోవడం వల్ల దూరం అవ్వడం వల్ల నరకాన్ని భరిస్తున్నానో నీకు తెలీదు. నరకాన్ని ఇంకా అనుభవించలేను వైష్ణవి.
దుర్గ: ఇన్ని సంవత్సరాలు నేను అనుభవించిన బాధతో పోలీస్తే నీది పెద్ద బాధ కాదు విజయేంద్ర. నీ ప్రేమ నిజం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మీద నీ ప్రేమ మీద నమ్మకం పోయింది.
విజయేంద్ర ఫ్రెండ్: విజయేంద్ర ఎమోషనల్ అవ్వకు అని నీకు చెప్పను. కానీ నీ ప్రేమ గెలుస్తుందిరా.
విజయేంద్ర దుర్గ దగ్గర వరకు వస్తాడు. గుండెల మీద చేయి వేసి నా గుండె కొట్టుకుంటుందిరా నాకు తెలుసు నా వైష్ణవి ఇక్కడే ఎక్కడో ఉంది. విజయేంద్రకు కనిపించకుండా దుర్గ వెళ్లిపోవాలి అని కారు దగ్గరకు వస్తే విజయేంద్ర చూసి పిలుస్తాడు.
దుర్గ: మీరేంటి ఇక్కడ.
విజయేంద్ర: వైష్ణవి కోసం వచ్చా.. తను ఇంకా కనిపించలేదు అందుకే తను చిన్నప్పటి నుంచి గడిపిన ఇంటిని చూడటానికి వచ్చా. ఈ ఇంటిని చూస్తే తనని చూసినట్లే ఉంటుంది. ఏదో ఒకరోజు వైష్ణవి నాలాగే తన జ్ఞపకాల్ని చూడటానికి రాకపోతుందా నేను కలవకపోతానా అనే చిన్న ఆశ.
దుర్గ: మనసులో.. నిజంగా నీ మనసులో ఇంత ప్రేమ ఉందా.. లేక సింపథి కోసం నా ముందు ఇలా మాట్లాడుతున్నావా..
విజయేంద్ర: సరదాగా టీ తాగుదామా ఇక్కడ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు నేను వైష్ణవి ఇక్కడే టీ తాగుతాం.
ఇంతలో దుర్గకు తన తండ్రి నుంచి ఫోన్ వస్తుంది. సిగ్నల్ సరిగా లేక కొంచెం దూరంగా వెళ్లి మాట్లాడుతుంది. ఇంతలో రక్షిత రౌడీలు కారుతో దుర్గను ఢీ కొట్టేందుకు రావడంతో విజయేంద్ర చూసి దుర్గను పక్కకు లాగుతాడు. దీంతో దుర్గ కింద పడి పోతుంది. రోడ్డు తలకి తగిలి పడిపోతుంది.
మరోవైపు ధీరు దుర్గ కోసం హాస్పిటల్‌కి వెళ్తాడు. దుర్గ గురించి అడుగుతాడు. ఇక దుర్గ మిస్ అయిందా ఏంటి అని రక్షిత కంగారు పడుతుంది. రౌడీ ఫోన్ చేసి దుర్గని కాపాడాను అని చెప్తాడు. ఇక హాస్పిటల్‌కి దుర్గని విజయేంద్ర ఎత్తుకొని తీసుకొని వస్తాడు. అది ధీరు చూస్తాడు. దుర్గకి ఏమైంది అని విజయేంద్రని అడుగుతాడు. జరిగింది విజయేంద్ర చెప్తాడు. మరోవైపు దుర్గకు ట్రీట్మెంట్ జరుగుతుంది. రక్షిత విజయేంద్రని తిట్టుకుంటుంది. పురుషోత్తం రావడంతో ధీరు గురించి అడుగుతుంది రక్షిత. మరోవైపు వాసుకి రక్షిత ఫోన్ చేసి ధీరు గురించి చెప్పమని అంటుంది. ఇక విజయేంద్ర దుర్గకు ఏం కాకూడదు అని దండం పెట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ ఫిబ్రవరి 21st: బావతో షికారుకెళ్లిన కావ్య - పాపం రాజ్, తట్టుకోలేకపోతున్నాడు