![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Oorvasivo Rakshasivo Serial Today February 19th Episode Written Update In Telugu: ఊర్వశివో రాక్షసివో సీరియల్: దుర్గతో ధీరు పెళ్లి గురించి దయాసాగర్‌తో మాట్లాడిని పురుషోత్తం.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన రక్షిత!
Oorvasivo Rakshasivo Serial Today Episode దుర్గతో తన కొడుకు ధీరుకి పెళ్లి చేయమని దయాసాగర్‌ని పురుషోత్తం అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Oorvasivo Rakshasivo Serial Today February 19th Episode Written Update In Telugu: ఊర్వశివో రాక్షసివో సీరియల్: దుర్గతో ధీరు పెళ్లి గురించి దయాసాగర్‌తో మాట్లాడిని పురుషోత్తం.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన రక్షిత! oorvasivo rakshasivo serial today february 19th episode written update in telugu Oorvasivo Rakshasivo Serial Today February 19th Episode Written Update In Telugu: ఊర్వశివో రాక్షసివో సీరియల్: దుర్గతో ధీరు పెళ్లి గురించి దయాసాగర్‌తో మాట్లాడిని పురుషోత్తం.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన రక్షిత!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/d11fa1a63e380e43948d51dc841307311708326354686882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Oorvasivo Rakshasivo Today Episode: విజయేంద్ర ఫ్రెండ్స్ అని దుర్గకు చేయి ఇస్తే దుర్గ దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు పురుషోత్తం, ధీరు గుడి దగ్గరకు వస్తారు. దయాసాగర్‌తో మాట్లాడమని పురుషోత్తానికి ధీరు పంపిస్తాడు.
దయాసాగర్: అవును ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు ఏంటది.
పురుషోత్తం: అదే మా అబ్బాయి ధీరు గురించి మీ అభిప్రాయం ఏంటండి.
దయాసాగర్: మనసులో.. వాడో నీచుడు అలాంటి వాడి గురించి అభిప్రాయం అడుగుతున్నావ్ చూడు. నీకు అసలు సిగ్గులేదు. ధీరుకే చాలా మంచోడు. తన గురించి నాకు అభిప్రాయం అడుగుతున్నారేంటా అని ఆశ్చర్యపోయాను.
పురుషోత్తం: మా వాడు అని చెప్పడం కాదు కానీ మావాడికి ఈ డేటింగ్‌లు లవ్వులు అలావాటు లేవు అండీ. అలాంటి వాడు మొదటి సారి ఒక అమ్మాయి చూసి నచ్చిందని నాకే చెప్పాడు.
దయాసాగర్: ఇంతకీ ఆ అదృష్టవంతురాలు ఎవరు.
పురుషోత్తం: దుర్గ.. మరోవైపు రక్షిత కూడా అక్కడికి వస్తుంటుంది.
దయాసాగర్: మా అమ్మాయా.. నాకు తెలుసి మా అమ్మాయి ఇంకో వన్ ఇయర్ వరకు పెళ్లి చేసుకోదు.
పురుషోత్తం: పర్వాలేదు అండీ ఒక ఏడాదే కదా మా అబ్బాయి వెయిట్ చేస్తాడు.
రక్షిత: ధీరు, పురు గుడికి వచ్చారా.. చాలా ఆశ్చర్యంగా ఉందే..
పురుషోత్తం: ఆలోగా మనం ఎంగేజ్‌మెంట్ లాంటిది ఏదైనా చేసుకుంటే బాగున్న దయాసాగర్ గారు వాళ్లకి కూడా అర్థం చేసుకోవడానికి టైం దక్కుతుంది కదా..
దయాసాగర్: మీరు అంటున్న దాంట్లో తప్పు లేదు కానీ నేను ఒక్కదాన్నే ఈ విషయం గురించి నిర్ణయం తీసుకోలేను. ఎందుకు అంటే దుర్గ నా ఒక్కగానొక్క కూతురు కదా.. ఇది తన జీవితం. తనకు నచ్చినట్లు తను బతకాలి అని ఫ్రీడం ఇచ్చాను. సో తన అభిప్రాయం అడిగే చెప్తాను. ఎస్ అంటే ఒకే బట్ తను నో అంటే మాత్రం ధీరుని బాధపడొద్దని చెప్పండి.
ధీరు: డాడ్ దయాసాగర్ గారు ఏమన్నారు.
పురుషోత్తం: దయాసాగర్ గారు దుర్గని అడిగి తెలుసుకొని చెప్తాను అన్నారు. పెళ్లి విషయంలో దుర్గ ఇష్టమే తన ఇష్టం అంట. ముందు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకో.
దుర్గ: ఏంటి నాన్న ఎక్కడికి వెళ్లారు.
పురుషోత్తం: ధీరు నాన్న పురుషోత్తంతో మాట్లాడి వస్తున్నా. ధీరుతో నీ పెళ్లి గురించి నాతో మాట్లాడటానికి వచ్చారు. నిన్ను ప్రేమిస్తున్నాడు అంట.
దుర్గ: ఆ ఎదవకి ప్రేమించడం కూడా వచ్చా. వాడు నాకు ఎంత దగ్గర అవ్వాలి అని చూస్తుంటే నేను అంత దూరం పెడుతున్నాను కదా అందుకే పిచ్చివాడు అయిపోతున్నాడు. నేను ఎలా తనకి పడను అని అర్థమయ్యి. ఇలా పెళ్లి నాటకం మొదలు పెట్టి ఉంటాడు. రక్షితకు ఇప్పటికే నా మీద చిన్న అనుమానం ఉంది. కానీ ఏం అర్థం కావడం లేదు.
దయాసాగర్: కేర్ ఫుల్‌గా హ్యాండిల్ చేయ్ దుర్గ. వీళ్లందరికీ గట్టిగా గుణపాఠం చెప్పు.
రక్షిత: దుర్గ, దయాసాగర్ ఇక్కడే ఉన్నారు అంటే వాళ్లు ఇక్కడికి వచ్చేలా దుర్గ ప్లాన్ చేసిందా..
దుర్గ: విజయేంద్ర గారు ఏంటి మీరు నన్ను ఫాలో అవున్నారా..
విజయేంద్ర: ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది.
దుర్గ: గుడి దగ్గరకు వచ్చినప్పుటి నుంచి మీరు నేను ఉన్నదగ్గరే ఉంటే నాకు అనుమానం వచ్చింది.
విజయేంద్ర: అవును నేను మిమల్ని ఫాలో అవుతున్నాను ఎందుకు అంటే మీరే వైష్ణవి కదా. టూ ఇయర్స్ నుంచి నిన్ను మిస్ అవుతున్నా వైష్ణవి అందుకే నీ వెంట తిరుగుతున్నాను.
దుర్గ: మనసులో.. నేనే వైష్ణవి అన్న సంగతి విజయేంద్రకు ఎలా తెలిసింది.
విజయేంద్ర: లేకపోతే ఏంటండి.. గుడి అన్నాక ఎదురు పడకుండా ఎలా ఉంటాం.
దుర్గ: అంటే నేను వైష్ణవి అన్న సంగతి తెలీదు అన్నమాట.
విజయేంద్ర: నేను ముడుపు కడుతుంటే అక్కడికి మీరు వచ్చారు. పంతులు గారికి నా వైష్ణవి గురించి అడిగితే మీకు అడగమన్నారు. ఇప్పుడు ఈ దేవతని అడుగుదాం అంటే మీరు ఎదురు వచ్చారు. నా మీద ఫోకస్ తగ్గించి మొక్కుకోండి. ఇక ఇద్దరు తమ కోరికల్ని మొక్కుంటారు. అక్కడికి ధీరు వస్తాడు.
రక్షిత: ధీరు.. నువ్వు మీ నాన్న నాతో చెప్పకుండా ఎక్కడికో వెళ్లున్నారు అని డౌట్ వచ్చి ఫాలో అయ్యాను. ఇక్కడ మీఅందర్ని చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. ధీరు మీ నాన్న ఎక్కడ. పురు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ చెప్పు.
పురుషోత్తం: దయాసాగర్‌తో చిన్న బిజినెస్ విషయం మాట్లాడాలి అని వచ్చా.
రక్షిత: పురు నిజం చెప్తే అతికినట్లు ఉండాలి.
పురుషోత్తం: నేను విషయం చెప్తే నువ్వు కంగారు పడతావ్ ముందు కూల్‌గా విను. ధీరు పెళ్లి గురించి మాట్లాడాలి అని వచ్చాను.
రక్షిత: వాట్ ధీరు పెళ్లి గురించా అది కూడా దయాసాగర్‌తో ఏం జరుగుతోంది పురు.
పురుషోత్తం: మన ధీరు దుర్గని ఇష్టపడుతున్నాడు. వాడు అడమంటే వచ్చి అడిగా.
రక్షిత: నీకు బుద్దుందా. వాడు అడగమంటే నువ్వు వచ్చావా.. ఆ దుర్గ గురించి నాకు అనుమానాలు ఉన్నాయని నీకు తెలుసు కదా.. వాడికి పరిస్థితి అర్థం కాదు. ఆ పవిత్ర గురించి ఏ చిన్న క్లూ దొరికినా ఇప్పటి వరకు మనం పడిన కష్టం వృథా అవుతుంది.
విజయేంద్ర: పిన్ని..మన సిటీ పోలీస్ కమిషనర్ మీకు బాగా తెలుసు కదా.. మన ఏరియా ఎస్‌ఐ వైష్ణవి గురించి అడిగితే చెప్పడం లేదు మీరు కొంచెం చెప్పిస్తారా అని..
రక్షిత: వైష్ణవి మన దగ్గర్లో ఉందని నీకు ఇంకా నమ్మకం ఉందా విజయేంద్ర. నిజంగా ఇక్కడే ఉంటే ఎవరికో ఒకరికి కనిపిస్తుంది కదా.. వీడు వినేలా లేడు ఏదో ఒకటి చేయాలి. సరే నేను మాట్లాడుతాను.
ధీరు: సారీ మామ్ చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వు ఏంమంటావో అని..
పురుషోత్తం: రక్షిత ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం.
మరోవైపు కొందరు రౌడీలు దుర్గని కామెంట్ చేస్తారు. దీంతో దుర్గ వాళ్లని కొడుతుంది. దీంతో దుర్గని వాళ్లు పట్టుకొని ఏడిపిస్తారు. ధీరు, రక్షిత, పురుషోత్తం చూస్తారు కానీ ఏం అనరు. ఇంతలో విజయేంద్ర వచ్చి చితక్కొడతాడు. వాళ్లు దుర్గకు సారీ చెప్తారు. దీంతో ఆడపిల్లలతో ఇలా ప్రవర్తించే మీ లాంటి వాళ్లని వదలకూడదు అని సీరియస్ అవుతుంది. ముందు మిమల్ని తప్పు చేసిన వెనకేసుకొచ్చే తల్లిదండ్రులను అనాలి అని తిడుతుంది. దుర్గ మాటలకు విజయేంద్రతో, రక్షిత వాళ్లు షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)