అన్వేషించండి

Nuvvunte Naa Jathagaa: విధి వేసిన బంధం... ఎవరికి శిక్ష? ఎవరికి పరీక్ష? ‘ఐ’ సినిమా పాటతో బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్

విక్రమ్ ‘ఐ’ మూవీలో ‘నువ్వుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా’ అనే పాట ఎంత పాపులర్ అయిందో తెలియంది కాదు. ఇప్పుడీ పాట లిరిక్‌తో స్టార్ మా‌ ఛానల్‌లో ఓ సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఐ’ మూవీలో ‘నువ్వుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా’ అనే పాట ఎంత పాపులర్ అయిందో తెలియంది కాదు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతంలో, సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడీ పాట లిరిక్‌తో బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ మా సరికొత్త ట్రీట్ ఇవ్వబోతోంది. అర్థం కాలేదా.. ‘నువ్వుంటే నా జతగా’ అనే టైటిల్‌తో స్టార్ మా‌లో సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదనే రీతిలో ఈ సీరియల్ రూపుదిద్దుకున్నట్లుగా ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. ఓ స్పెషల్ సాంగ్ కూడా ఈ సీరియల్ కోసం రూపొందించారు. ఆ సాంగ్‌లోని లిరిక్స్, పిక్చరైజ్ చేసిన సన్నివేశాలు అయితే హార్ట్ టచ్చింగ్‌గా ఉన్నాయి. ఈ స్పెషల్ సాంగ్‌లోని లిరిక్స్ ఒక్కసారి గమనిస్తే..

‘‘మిగిలింది, సహవాసం.. దూరాల నింగి నేలలా..
ఈ జంటకి, కలలోనూ.. శతమానం కాలేని రెండు గీతలే
ఈనాటికి ముళ్లతోనేరేగిన మంటలో.. ఆనాటి శాపం తీరునా
అల్లాడిపోయే ఆశలో.. గోరంత దీపమారునా
పెదవి మౌనాల పెదవంచునా..
మనువు కలిసింది విధిరాత శిధిలాలలో..’’ అంటూ చాలా అర్థవంతంగా ఉన్న ఈ లిరిక్స్.. ఈ సీరియల్ రూపురేఖల్ని తెలియజేస్తుంది. స్టార్ మా ప్రేక్షకులకు వినూత్నమైన ఫ్యామిలీ అండ్ ప్రేమ కథతో ట్రీట్ ఇవ్వబోతోంది.

మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా.. ఇంట్లోని చిన్న, పెద్ద ఇలా అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయబోతోందని తెలుపుతూ.. స్టార్ మా ‘నువ్వుంటే నా జతగా’ సీరియల్‌ని అనౌన్స్ చేసింది. ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి ఇప్పటికే ఎన్నో కథలు వచ్చాయి. ఇప్పుడలాంటి కథతోనే ఎంతో వైవిధ్యంగా వస్తున్న కథ ఇదని.. ఈ కథ అనుబంధానికి ఓ కొత్త నిర్వచనం అని స్టార్ మా చెబుతోంది. ప్రేమకి ఓ విలక్షణమైన వివరణ. సంప్రదాయానికి, సంస్కృతికి ఎంతో విలువ ఇచ్చే ఒక అమ్మాయికి, గాలికి తిరిగే కుర్రాడికి మధ్య ఒక అనుకోని మూడుముళ్ల బంధం ఈ కథకి మూలం. ఏ అమ్మాయికైనా పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఆ కలలన్నీ ఆ మూడుముళ్లతోనే కరిగిపోతే..? జీవితం అక్కడ ఆగిపోయినట్టు కాదు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్న థియరీని ఒక కొత్త దృక్పథంతో చెప్పే కథ ఇది. ప్రేమతో సాధించలేనిది ఉండదు అని ఆ అమ్మాయి నిరూపించడానికి వస్తోంది. 

Also Readబిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో

ఇక అబ్బాయి విషయానికి వస్తే.. పెళ్లి అనేది ఏదో అలా జరిగిపోయింది గానీ దాని మీద నాకు సీరియస్ నెస్ లేదు అని తన అభిప్రాయాన్ని చెప్పడానికి హీరో వస్తున్నాడు. అదే ఇద్దరి మధ్య ఘర్షణ. దానికి దృశ్యరూపమే ఈ ‘నువ్వుంటే నా జతగా’ సీరియల్. అఖిల్, గీత ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న ఈ సీరియల్ డిసెంబర్ 16 నుంచి రాత్రి 9.30 గంటలకు ప్రైమ్ టైమ్ సీరియల్‌గా ప్రసారం కానుంది. ప్రేమ ఉన్నచోట కోపం ఉంటుందనే ఒక ప్రాథమిక సూత్రానికి, ప్రేమ ఉంటే తప్పుని దిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందనే మౌలికమైన ఆదర్శాన్ని ఈ ధారావాహిక చెప్పబోతోంది.

Also Readఅల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget