Nuvvunte Naa Jathaga Serial Today May 14th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున, దేవాల ఫస్ట్‌నైట్‌కి ముహూర్తం.. హరివర్దన్ మీదకు దేవాని పంపిన పురుషోత్తం!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా, మిథునల శోభనం గురించి బామ్మకి తెలిసి ముహూర్తం పెట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున భర్తతో కాకుండా వంట గదిలో ఎందుకు పడుకుంటుందని బామ్మ అందర్ని ప్రశ్నిస్తుంది. దాంతో కాంతం మిథున రోజూ ఇక్కడే పడుకుంటుందని అంటుంది. బామ్మ షాక్ అయి విషయం అడుగుతుంది. కాంతం చెప్పబోతే అందరూ కాంతం నోరు మూయిస్తారు. దాంతో బేబీ బామ్మ శారదని రెట్టించి అడుగుతుంది. దాంతో శారద వాళ్లకి ఇంకా శోభనం జరగలేదు అని అంటుంది.
బామ్మ షాక్ అయి పెళ్లి జరిగి ఇన్ని రోజులు అయినా ఎందుకు శోభనం జరిపించలేదు అంటుంది. కొడుకుని తిడుతుంది. పిల్లల విషయంలో బాధ్యతగా లేవా అని తిడుతుంది. రేపు పంతుల్ని పిలిపించు అని కొడుకుతో చెప్తుంది. దేవా,మిథునల శోభనానికి నేను ముహూర్తం పెట్టిస్తాను అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఒక అబద్ధం ఆడితే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో చూశావా ఆ దరిద్రుడు నా కడుపున పుట్టడం నా ఖర్మ అని తిట్టుకొని సత్యమూర్తి వెళ్లిపోతాడు.
పురుషోత్తం ఎమ్మెల్యే టికెట్ కోసం పై అధికారులను కలవాలి అనుకుంటాడు. ఇంతలో పురుషోత్తం దగ్గరకు పోలీసులు వచ్చి అరెస్ట్ వారెంటీ ఉందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తారు. పోలీసులు అరెస్ట్ చేయబోతే దేవా ఆపుతాడు. ఏంటి అన్నా ఇది అంటాడు. వారం క్రితమే నోటీసులు ఇచ్చామని ఎస్ఐ చెప్తాడు. నన్ను అరెస్ట్ చేస్తే చేయని నా రాజకీయ జీవితం నాశనం అయితే అవ్వని నువ్వు నీ భార్య సంతోషంగా ఉండమే నాకు కావాలి అంటాడు. అసలేం జరిగిందో చెప్పు అన్న అని దేవా అడుగుతాడు. ఏం చెప్పాలి దేవా నీ కారణంగా నేను అరెస్ట్ అవుతున్నా అని నీకు తెలిస్తే నువ్వు బాధ పడతావ్ అంటాడు. దేవా కారణం అడుగుతాడు. మిథున వల్ల అని పురుషోత్తం చెప్తాడు.
దేవా షాక్ అయిపోతాడు. నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం వల్ల తను మీ ఇంట్లో కూర్చొంది.. వాళ్ల నాన్న చివరి అస్త్రంగా నన్ను టార్గెట్ చేశారు. నువ్వు ఆ మిథునని వదిలేస్తే తప్ప తను నన్ను వదలడు కానీ నువ్వు ఆ అమ్మాయిని పంపేలా లేవు.. దేవా నా రాజకీయ భవిష్యత్ నీ చేతిలోనే ఉంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు అని అంటాడు. అన్నా నీ కోసం నా ప్రాణం ఇస్తా అవసరం అయితే ఎవరి ప్రాణాలు అయినా తీస్తానని అంటాడు. దేవాని హరివర్దన్ మీదకు పంపడానికి పురుషోత్తం పోలీసుల్ని అడ్డుపెట్టుకొని నాటకం ఆడుతాడు.
బామ్మ పంతుల్ని పిలిపించి అందరి సమక్షంలో ముహూర్తాలు పెట్టిస్తుంది. దేవాకి ఒక మాట చెప్దామని ఆనంద్ అంటాడు. అవసరం లేదని బామ్మ అంటుంది. కాంతం భర్తతో వాళ్లకి శోభనం జరిగితే నా ఉత్తమ కోడలు అవార్డు పోతుందని ఎలా అయినా ముహూర్తం ఆపిస్తా అని తుమ్మితే అపశకునం కదా అంటుంది. దాంతో ప్రమోదిని కాంతం ముక్కు పట్టేస్తుంది. ఎందుకు ఇలా చేశావ్ అక్క అంటే మళ్లీ ఇలా చేస్తే ముక్కు గట్టిగా పట్టేస్తా అని నువ్వు చనిపోయినా పర్లేదు ముహూర్తం ఆగకూడదు అని అంటుంది. ఈ రోజే మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. శారద చాలా సంతోషిస్తుంది. సత్యమూర్తి లేచి వెళ్లిపోతాడు. ఇద్దరి మనవలకు ఏర్పాట్లు చూసుకోమని బేబీ చెప్తుంది.
హరివర్దన్ మాటలు తలచుకొని లలిత ఏడుస్తుంది. భర్త కాఫీ అడుగుతాడు. కూతురి టిఫెన్ అడిగినా లలిత ఏడుస్తూ ఉంటుంది. చిన్న కూతురి చూసి ఏమైందని తల్లిని అడుగుతుంది. తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మ ఏడుస్తుంది. ఒక సారి వెళ్లి మాట్లాడండి నాన్న అంటుంది. మీ పట్టుదలతో మిథున చీకటి అయిపోతుందని లలిత భర్తతో చెప్పి ఏడుస్తుంది. తన పెళ్లిని మనం ఒప్పుకుందామని అంటుంది. ఒప్పుకుంటే సమస్యలు తీరిపోవని వాడు రాక్షసుడు అని హరివర్దన్ అంటాడు. నువ్వు కంట తడి పెడితే నేను కాటిలో కలిసిపోయినట్లే అని హరి వర్దన్ అంటాడు. చిన్న కూతురు తల్లీదండ్రికి కాఫీ ఇచ్చి ఇద్దర్ని హగ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని అంటుంది. మిథున తన పెళ్లిని తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!






















