Nuvvunte Naa Jathaga Serial Today May 12th: నువ్వుంటే నా జతగా: మిథున, దేవాల్ని ఒక్కటి చేసే వరకు బేబీ బామ్మ తగ్గేదేలే.. గోరింటాకు.. ప్రేమస్టోరీ అంటూ ట్విస్ట్‌లు!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా మిథునల లవ్ స్టోరీ తెలుసుకోమని కాంతం బామ్మకి తగిలించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode బేబీ బామ్మ మిథునకు గోరింటాకు పెట్టమని చెప్తుంది. దేవా చచ్చినా పెట్టను అంటే అసలు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుంది. బేబీని బాధ పెట్టడం ఇష్టం లేక పెట్టడానికి రెడీ అవుతాడు. దానికి బామ్మ ఇక్కడ కాదురా దానికో ఫీల్ ఉండాలిరా పక్కకు వెళ్లండి అని ఇద్దరినీ పంపిస్తుంది.
దేవా మిథునలు పక్కకు వెళ్తారు. మిథున గోరింటాకు పెట్టమని చేయి ఇస్తుంది. దేవా గోరింటాకు పెడుతుంటే దేవా నుదిట మీద అతుక్కుంటుంది. మిథున నవ్వి తర్వాత తన కొంగుతో తుడుస్తుంది. దేవా, మిథున ఇద్దరూ సైగలు చేసుకుంటారు. గోరింటాకు చూసుకొని మిథున చాలా సంతోషపడతుంది. సత్యమూర్తి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత దేవా తల్లి దగ్గరకు వెళ్లి తల పగిలిపోతుందని అంటాడు. నానమ్మ ఇక్కడి నుంచి వెళ్లిపోతే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది. నానమ్మ వచ్చినప్పటి నుంచి ఆ మిథున ఎక్కువ చేస్తుందని డార్లింగ్ డార్లింగ్ అని ఆ మిథున నన్ను పిలుస్తుంటే చిరాకుగా ఉందని అంటాడు. నానమ్మని పంపించేయమని అంటాడు. అది విని సత్యమూర్తి మా అమ్మని పంపేయాలా టార్చర్ నీకు కాదురా మాకు నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం వల్ల మేం మా అమ్మని మోసం చేస్తున్నాం అని అంటారు. రాక రాక వచ్చిన మా అమ్మని నీ వల్ల మోసం చేయాల్సి వస్తుందని బాధ పడతారు. మా అమ్మని పంపేయాలి అంటావా నీకు అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటారు. దేవా షాక్ అయిపోతాడు.
మిథున తల్లికి కాల్ చేసి గోరింటాకు దేవా పెట్టాడని చెప్తుంది. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. దేవా త్వరలోనే నీకు భార్య స్థానం ఇస్తాడని అంటుంది. అప్పుడే హరివర్దన్ వస్తాడు. లలిత దగ్గర ఫోన్ లాక్కొని కింద విసిరేస్తాడు. మనల్ని కాదు అని రౌడీ కోసం వెళ్లిపోయిన దానితో రాయభారం ఎందుకు అని తిడతాడు. కన్న పేగు పెంచిన బంధం అని లలిత అంటే మామయ్యకు ఏమైనా మీకు పర్లేదా అని త్రిపుర అంటుంది. మామయ్య గారు చావు బతుకుల మధ్యకు రావడానికి కారణం మీరే అయినా మీరు ఏం తెలుసుకోకుండా ఇంకా తనతో మాట్లాడుతున్నారు. మళ్లీ మామయ్యకు ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అంటుంది. మిథున ఆ చెత్త కంపులో దిక్కుమాలిన కొంపలో ఉండటం మీరు కోరుకుంటున్నారు. అంతే మిథున విషయంలో మీరు మామయ్య గారి నిర్ణయాన్ని తప్పు పడుతున్నట్లే కదా అంటుంది. దానికి హరివర్దన్ నా నిర్ణయం తప్పు పట్టడం అంటే నన్ను తప్పు పట్టడమే అంతే మనిషిగా నేను లేనట్లే అని చెప్పి వెళ్లిపోతారు. లలిత చాలా బాధ పడుతుంది.
బామ్మ వీడియోస్ తీసుకొంటూ ఉంటే కాంతం, రంగం వెళ్లి మీ ముద్దుల మనవరాలి ప్రేమ గురించి తెలుసుకున్నారా అని అడుగుతుంది. దాంతో బామ్మ అవును కదా ఇప్పుడే అడుగుదామని మిథునని పిలవమని చెప్తుంది. మిథున రాగానే బేబీ మిథునని కూర్చొమని దేవాని కూడా పిలుస్తుంది. అందరి ముందు కూర్చొపెట్టి బంగారు తల్లి మీ లవ్ స్టోరీ చెప్పమ్మా అని అడుగుతుంది. దేవా, మిథునలు నోరెళ్ల పెట్టి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అంతా నా ఖర్మ అని సత్యమూర్తి నెత్తి బాదుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















