Nuvvunte Naa Jathaga Serial Today March 6th: నువ్వుంటే నా జతగా సీరియల్: భానుకి హర్ట్‌బ్రేక్.. మిధునంటే ప్రాణమన్న దేవా.. కొడుకుని చితక్కొట్టి చచ్చిపోమన్న సత్యమూర్తి!
Nuvvunte Naa Jathaga Today Episode మిధున గాజులు దొంగతనం చేశాడని దేవాని సత్యమూర్తి కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode ప్రమోదిని మిధునని తీసుకొని వెళ్లి బంగారు గాజుల కోసం తమ గదిలో వెతుకుతుంది. తర్వాత శ్రీరంగం వాళ్ల గదిలో వెతకమని అంటారు. మిధున వెతికితే తాము ఇంట్లో వాళ్లకి తెలీకుండా దాచుకున్న బంగారం, డబ్బులు బయట పడిపోతాయని శ్రీరంగం, కాంతం టెన్షన్ పడతారు. ఇక మిధున కూడా తాను వెతకను అని ప్రమోదిని అక్క గదిలో వెతికినందుకే బాధగా ఉందని తన ఇంటి వాళ్లు తీయరు అని నమ్మకం ఉందని అంటుంది. మేం తీయలేదు అని నువ్వు నమ్మినా నీ వాళ్లు నమ్మరు కదా అని సత్యమూర్తి అంటారు.
ఇంతలో సూర్యకాంతం, రంగం తండ్రితో మన ఇంట్లో వాళ్లే కచ్చితంగా తీసుంటారు కానీ ఇక్కడున్న వాళ్లు ఎవరూ తీయలేదు కాబట్టి దేవా తీసుంటాడని అంటారు. మా ఆయన అలా చేయరు అని మిధున అంటుంది. ఇంటిళ్లపాది షాక్ అయిపోతారు. సత్యమూర్తి దేవాకి కాల్ చేయమని అంటాడు. ఫోన్ కలవదు. దాంతో సత్యమూరతి సాయంత్రం వాడు ఇంటికి వచ్చాక ఈ గాజులు విషయం తేల్చేస్తా అంటాడు. గ్యారేజ్ దగ్గర ఉన్న దేవాకి దివ్య కాల్ చేసి అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది నువ్వు టైంకి దేవుడిలా డబ్బు ఇవ్వడం వల్లే ఇదంతా జరిగిందని అంటుంది. ఇక దేవా దగ్గరకు భానుమతి సీరియస్‌గా వస్తుంది.
భానుమతి: ఏం చేయమంటావ్ నన్నేం చేయమంటావ్.
దేవా: ఆటో నడుపుతున్నావ్ కదా అదే కంటిన్యూ చేయ్. ఎస్‌ఐ కూడా ప్రిపేర్ అవుతున్నావ్ కదా గట్టిగా ప్రయత్నించు అది వచ్చేస్తుంది.
భాను: నేను అడుగుతుంది నా లైఫ్ గురించి అవతల మా అమ్మ నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తుంది. నన్నేం చేయమంటావ్.
దేవా: ఏం చేసేదేంటి వెళ్లి పెళ్లి చేసుకో.
భాను: ఆ మాట అన్నావ్ అని చంపేస్తా. నీ కోసం నేను పిచ్చిదానిలా ఎదురు చూస్తుంటే నన్ను వేరే పెళ్లి చేసుకోమంటావా చెప్పు ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావ్.
దేవా: పిచ్చా నీకు అల్రెడీ ఒకర్తి నువ్వే నా మొగుడు అని చంపుకొని తింటుంది. ఆ టార్చర్‌తో చస్తుంటే మధ్యలో నువ్వేంటే.
భాను: దానిది ఉత్తిత్తి పెళ్లి కదా దాని మీద నీకు ప్రేమ లేదు కదా. నేను 13 ఏళ్లగా దేవాని ప్రేమిస్తున్నా కాబట్టి నాకు మాత్రమే దేవా భార్య అయ్యే హక్కు ఉంది.
దేవా: అదంతా నీ భ్రమ నేను ఇష్టంతోనే మిధున మెడలో తాళి కట్టాను. మిధునని భార్యగా చూస్తున్నా. పోస్టర్‌లో ఫొటో వేయించాను. బస్తీ వాళ్ల ఎదుట దండలు మార్చుకున్నాం. ఓకేనా. మిధున అంటే నాకు ఎంత ఇష్టం ఉందో అంత ప్రేమ ఉంది. నీకు క్లారిటీ వచ్చింది కదా. భాను దేవాని లాగిపెట్టి కొడుతుంది. ఓకేనా కోపం తగ్గింగా వెళ్లి మీ అమ్మ చూసిన వాడిని పెళ్లి చేసుకో.
భాను: రేయ్ నన్ను ఏడిపించాలి అని ఇలా చెప్తున్నావ్ కదా. రేయ్ నేను నిన్ను 13 ఏళ్లగా ప్రేమిస్తున్నాను కదా నీకు ఒక్క సారి కూడా ప్రేమించాలి అనిపించలేదా.
దేవా: లేదు నా అభిప్రాయం చెప్పా ఇక నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం వెళ్లు.
భాను ఏడుస్తూ వెళ్లిపోతుంది. దేవాతో తన ఫ్రెండ్స్ నీకు వదిన అంటే ఇష్టమే అని మాకు తెలుసు అంటే దానికి దేవా ఇష్టం లేదు తొక్క లేదు భాను మనసు మార్చడానికి అలా అన్నానని అంటాడు. ఇక సాయంత్రం సత్యమూర్తి ఇంట్లో అందరూ దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవా ఇంటికి వస్తాడు. అందరినీ చూసిన దేవా ఏమైంది ఎందుకు అలా ఉన్నారని అంటాడు. ఇక సత్యమూర్తి దేవాని పట్టుకొని మిధున గాజులు తీశావా అని అడుగుతాడు. దేవా మిధునని కోపంగా చూస్తాడు. సత్యమూర్తి కాలర్ పట్టుకొని అడగటంతో నేనే తీశానని దేవా ఒప్పుకుంటాడు. అందరూ షాక్ అయిపోతారు.
ఇప్పటి వరకు రౌడీవే అనుకుంటే దొంగవి కూడా అయి నా పరువు తీశావురా అని సత్యమూర్తి దేవాని కొడతాడు. ఇంత చిన్న విషయానికి ఆయన్ను ఎందుకు కొడతారు అని మిధున మామయ్యని ఆపాలని చూస్తే సత్యమూర్తి మిధునని మధ్యలోకి రావొద్దని అంటాడు. నా పరువు నా పెంపకం అన్నీ నాశనం అయిపోయావని నువ్వు చనిపోతే బాగున్ను చచ్చిపోరా అని అరుస్తాడు. దేవా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు. ఏంటి అండీ ఆ మాటలు అని శారద ఏడుస్తుంది. నా పరువుని బతికుండగానే తల కొరివి పెడుతున్నాడని కొడతారు. దేవాని తిట్టి వెళ్లిపోమని చెప్తాడు. దేవా బయటకు వెళ్లిపోతాడు. నేను రిటైర్ అయినా నా జీవితానికి ప్రశాంతత లేదని దేవా మిధునల వల్ల మనస్శాంతి లేకుండా పోయింది ఏ జన్మలో చేసుకున్న పాపమో అని సత్యమూర్తి ఏడుస్తాడు.
పది లక్షలతో పాటు గాజులు డబ్బులు కూడా ఇస్తానని మిధునత చెప్తారు. తర్వాత శారద భర్తకి, చిన్న కొడుకుకి మధ్య దూరం పెరుగుతుందని ఈ సమస్యతో ఇంకా పెరిగిపోతుందని నా చిన్న కొడుకు మీద కోపంతో ఆయన చేస్తారో అని ఏడుస్తుంది. మిధున కూడా ఏడుస్తుంది. ప్రమోదిని అత్తని ఓదార్చి తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!





















