Sonam Wangchuk: లడఖ్ రాష్ట్ర హోదా కోసం ఆందోళనలో ఉద్రిక్తత .. ఎవరీ సోనం వాంగ్‌చుక్, ఆయన నెక్ట్స్ ప్లాన్ ఏంటీ?
Statehood of Ladakh | విద్యావేత్త, సంస్కరణవాది సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ రాష్ట్ర హోదా కోసం నిరాహార దీక్షకు దిగారు. అంతలోనే ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీయడంతో వాంగ్‌చుక్ ను అరెస్ట్ చేశారు.

లేహ్ ఎపెక్స్ బాడీ (LAB) పోలీసుల కాల్పుల్లో నలుగురు చనిపోగా, లడఖ్ అధికారులు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించడాన్ని తోసిపుచ్చింది. నిష్పాక్షిక న్యాయ విచారణ జరిపేవరకు, అరెస్టు చేసిన నిరసనకారులను విడుదల చేసేందుకు ఎటువంటి చర్చలు ఉండవని LAB పేర్కొంది. దీనితో పాటు, కేంద్ర ప్రభుత్వంతో జరగాల్సిన చర్చల నుంచి సైతం LAB తప్పుకుంది. ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని తమ డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ, లేహ్ లో పౌరుల మరణాలకు బాధ్యలెవరనేది విచారణలో తేలుతుందని స్పష్టం చేసింది. LAB సహ-అధ్యక్షుడు చెరింగ్ డోర్జే, నుబ్రా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ చేపట్టిన విచారణను పూర్తిగా తోసిపుచ్చారు.
LAB ప్రభుత్వానికి నేరుగా ప్రశ్నలు
డోర్జే మాట్లాడుతూ.. 'లడఖ్ ప్రజల హత్యలపై న్యాయ విచారణ జరగాలని మేం మొదట్నుంచీ పట్టుబట్టాం ఎటువంటి హెచ్చరిక లేకుండా పౌరులపై కాల్పులకు ఎవరు ఆదేశించారో తెలుసుకోవాలనుకుంటున్నాం. మేము మెజిస్టీరియల్ విచారణను అంగీకరించం, తిరస్కరిస్తున్నాం' అని అన్నారు. 'న్యాయ విచారణకు ఆదేశాలు ఇవ్వనంత వరకు, సోనమ్ వాంగ్‌చుక్ సహా అందరినీ విడుదల చేయనంత వరకు కేంద్రంతో చర్చలు జరగవు. ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని' అని ఆయన అన్నారు.
వాస్తవాలను పరిశీలించడానికి అధికారి నియామకం
లడఖ్ ప్రభుత్వం సెప్టెంబర్ 24న జరిగిన ఘటన వాస్తవాలను తెలుసుకోవడానికి LDM నుబ్రా ముకుల్ బెనివాల్ (IAS)ను విచారణ అధికారిగా నియమించింది. లేహ్ లో లడఖ్‌కు 6వ షెడ్యూల్ హోదా మరియు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు జరుగుతున్న సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు చనిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని విచారణ అధికారిని ఆదేశించారు. అక్టోబర్ 4 నుంచి 18 వరకు ప్రజల స్టేట్మెంట్, సాక్ష్యాలను సేకరించనున్నారు.

ఇంజినీర్, విద్యా సంస్కరణలు, వాతావరణ ఉద్యమకారుడు అయిన సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని, రాష్ట్ర హోదాను కోరుతూ రెండేళ్ల కిందట ఆందోళనకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది లేహ్ పోలో గ్రౌండ్‌లో దాదాపు 30,000 మందితో భారీ సమావేశానికి నాయకత్వం వహించారు. వాంగ్‌చుక్ దీనిని "లడఖ్ కీ ఆఖిరి మన్ కీ బాత్" (లడఖ్ చివరి మాట) అని పేర్కొన్నారు. వయోజన జనాభాలో నాలుగింట ఒక వంతు మంది సమావేశమై రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌ను విభజించడంతో 2019లో లడఖ్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.
REMEMBERING HISTORIC LEH-DELHI MARCH...
— Sonam Wangchuk (@Wangchuk66) September 1, 2025
DELHI-CHALO PADYATRA
Exactly one year ago we started our seemingly impossible journey, marching from Leh to New Delhi crossing some of the most difficult terrains on the planet... to take the voice of voiceless indigenous people of Ladakh &… pic.twitter.com/2ripokZuru
లేహ్ చరిత్రలో చీకటిరోజు
సెప్టెంబర్ 24న లేహ్ హింసాకాండను ఎదుర్కొంది. ఆరవ షెడ్యూల్ రక్షణ, రాష్ట్ర హోదా కోరుతూ బంద్ పిలుపు గందరగోళంలోకి దిగింది. మధ్యాహ్నం ప్రజలు ప్రభుత్వ, బీజేపీ ఆఫీసుల మీదకు దూసుకెళ్లి కొన్ని వాహనాలను తగులబెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేయడంతో పాటు కాల్పులు జరపగా నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. నిరసనకారులు పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.
ది ఛేంజింగ్ ఫేస్ ఆఫ్ వాంగ్‌చుక్
3 ఇడియట్స్ సినిమాలో చేసిన ఒక పాత్ర వాంగ్‌చుక్ ను ఆధారంగా చేసుకుని చేశారు. వాంగ్‌చుక్ ఒక ఆవిష్కర్త, సంస్కర్తవాదిగా పేరుగాంచాడు. 2019లో ఆర్టికల్ 370 రద్దు అయి, లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా విభజించగా వాంగ్‌చుక్ స్పందించారు. "లడఖ్ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదకి ధన్యవాదాలు. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఆగస్టు 1989 లో లడఖ్ నాయకులు UT హోదా కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ వికేంద్రీకరణలో సహాయం చేసిన వారికి ధన్యవాదాలు!"
ఫ్యాంగ్ భూ వివాదం
లడఖ్ అధికారులు వాంగ్‌చుక్ విలువైన ప్రాజెక్ట్‌ను రద్దు చేయడంతో మలుపుతిరిగింది. 21 ఆగస్టు 2025 న, లేహ్ డిప్యూటీ కమిషనర్ 2018 లో హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెర్నింగ్ (HIAL) కోసం కేటాయించిన ఫియాంగ్‌లోని 135 ఎకరాల భూమిపై తన 40 సంవత్సరాల లీజును రద్దు చేశారు. అధికారిక ఉత్తర్వులో 6 సంవత్సరాలుగా ఎలాంటి చర్య తీసుకోలేదని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన వర్సిటీలో ఎలాంటి పనులు, స్థలంలో అభివృద్ధి లేకపోవడంతో కోట్ల విలువైన లీజు చెల్లింపులు చెల్లించలేదు. గ్రామస్తులు ఆక్రమణలపై ఫిర్యాదు చేయడంతో కేసు తీవ్రత పెరిగింది. లీజు గడువు ముగిసిందని, బకాయిలను తొలగించాలని, భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాంగ్‌చుక్ ఈ నిర్ణయాన్ని తిరస్కరించి వెంటనే 35 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించారు.
END 21st Day OF MY #CLIMATEFAST
— Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024
I'll be back...
7000 people gathered today.
It was the end of the 1st leg of my fast. Btw 21 days was the longest fast Gandhi ji kept.
From tomorrow women's groups of Ladakh will take it forward with a 10 Days fast, then the youth, then the… pic.twitter.com/pozNiuPvyS
నిరాహార దీక్ష నుండి అరెస్టు వరకు
వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. చివరికి ఉద్యమకారుడు వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా వివాదం మరింత ముదిరింది. దేశద్రోహిగా ముద్రవేయాలని, పాక్ తో లింకుల అని ఉద్దేశపూర్వకంగా ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాంగ్ చుక్ భార్య, జెన్ జెడ్ నిరసనకారులు ఆరోపిస్తున్నారు. నిరాహార దీక్షకు దిగిన వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు.
లద్దాఖ్ జనాభాలో 97 శాతం మంది బౌద్ధులు, ముస్లిం ట్రైబల్స్. అందుకే ఆరో షెడ్యూల్ ట్రైబల్ ప్రొటెక్షన్) అమలు, రాష్ట్ర హోదా కోసం, లెహ్-కార్గిల్‌కు సెపరేట్ పార్లమెంట్ సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. స్థానికులకే ఉద్యోగాలు, భూములపై హక్కులు వంటి డిమాండ్లతో ఆందోళన కొనసాగిస్తున్నారు. 2023లో లెహ్ నుంచి ఢిల్లీకి 500 మైళ్ల మార్చ్ చేసిన వాంగ్‌చుక్ గత ఏడాది మార్చిలో 21 రోజుల ఆమరణదీక్షకు దిగారు. చేశారు. ఇటీవల మళ్లీ దీక్షకు దిగగా హింస జరగడంతో విరమించారు. వాంగ్‌చుక్ కోసం జెన్ జెడ్ యువత రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.






















