(Source: ECI | ABP NEWS)
Sonam Wangchuk: లద్దాఖ్ జెన్Z ఆందోళనల సూత్రధారి వాంగ్‌చుక్ - ఆయన క్యారెక్టరే హీరోగా అమీర్ ఖాన్ సినిమా - ఆయనెవరంటే?
Ladakh Protests: లద్దాఖ్ ఆందోళనలకు కారణం అని సోనమ్ వాంగ్ చుక్ ను అరెస్టు చేశారు. అయితే ఆయనకు ఉన్న పేరు మాత్రం చాలా భిన్నమైనది. త్రీఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఆయన రియల్ లైఫే.

Sonam Wangchuk Real Life Phunsukh Wangdu: లద్దాఖ్‌లో జరుగుతున్న ఆందోళనలకు కారణం అని ఇంజినీర్, విద్యా సంస్కరణలు, వాతావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. ఈయన లద్దాఖ్‌కే కాదు..దేశ ప్రజలందరికీ తెలుసు. 2009లో విడుదలైన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ '3 ఇడియట్స్' సినిమాలో ఆమిర్ ఖాన్ చేసిన 'ఫూన్సుఖ్ వాంగ్డు' క్యారెక్టర్‌కు ఇన్‌స్పిరేషన్ ఈ సోనం వాంగ్‌చుక్.
59 ఏళ్ల వాంగ్‌చుక్ లద్దాఖ్ రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబర్ 24న లెహ్‌లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం, నలుగురు చనిపోవడంతో వివాదం మరింత తీవ్రమైంది. కేంద్ర హోం శాఖ వాంగ్ చుక్ రెచ్చగొట్టడం వల్లేఇలా జరిగిందని ఆయనను సెప్టెంబర్ 26న నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA)లో అరెస్ట్ చేశారు. వాంగ్చుక్‌కు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ లింకులు ఉన్నాయని , విదేశీ ఫండింగ్ కూడా ఉందని లద్దాఖ్ DGP ఎస్‌డీ సింగ్ జామ్వాల్ ప్రకటించారు.
1966 సెప్టెంబర్ 1న లద్దాఖ్‌లోని అల్చి గ్రామంలో జన్మించిన సోనం వాంగ్ చుక్, తన చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లలేదు. 9 ఏళ్ల వయసులో మాత్రమే హోమ్‌స్కూలింగ్ తర్వాత ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రారంభమైంది. భాషా సమస్యలతో బాధపడ్డాడు, 12 ఏళ్ల వయసులో ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయలో చేరాడు. ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, 1988లో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL) స్థాపించాడు. ఈ NGO లద్దాఖ్ విద్యార్థులకు ప్రాక్టికల్ లెర్నింగ్, వాతావరణంపై అవగాహనను కల్పిస్తుంది. SECMOL క్యాంపస్ ను నిర్మించారు. ఈ క్యాంపస్‌కు ఇది 2016లో ఫ్రాన్స్‌లో ఇంటర్నేషనల్ టెర్రా అవార్డ్ వచ్చింది.
వాంగ్ చుక్ కొత్త ఆవిష్కరణలకు ప్రసిద్ధి. 2013లో 'ఐస్ స్తూపా'ను ఆవిష్కరించాడు – ఇది లద్దాఖ్‌లో వర్షాకాలంలో నీటిని ఫ్రీజ్ చేసి, వేసవిలో వాడే ఆర్టిఫిషియల్ గ్లేసియర్. ఈ టెక్నాలజీ సిక్కిం,లద్దాఖ్‌లో వాడుతున్నారు. 2015లో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ (HIAL) స్థాపించారు, ఇక్కడ మౌంటైన్ యూనివర్సిటీ మోడల్‌తో సస్టైనబుల్ ఎడ్యుకేషన్ ఇస్తారు. 2018లో రామన్ మెగసేసే అవార్డ్, 2020లో పద్మశ్రీ పొందారు. చైనా ప్రొడక్ట్స్ బాయ్‌కాట్ చేయాలని 2020లో పిలుపునిచ్చాడు.
A brilliant person like you, your work will surely inspire millions of Indians @Wangchuk66 #standwithsonamwangchuk #Isupportsonamwangchuk#LadakhProtest pic.twitter.com/j8dRQnfNKi
— SUKUMAR RANJAN (@ranjan_sukumar) September 26, 2025
2009లో రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన '3 ఇడియట్స్' సినిమాలో ఆమిర్ ఖాన్ చేసిన 'రాన్చో' ఫూన్సుఖ్ వాంగ్డు క్యారెక్టర్ వాంగ్ చుక్ జీవితం నుంచే తీర్చిదిద్దారు. SECMOL క్యాంపస్‌లో విద్యార్థుల అనుభవాలు, ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ సినిమాలో ప్రతిబింబించాయి. ఈ సినిమా వల్ల అతను దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు, కానీ ఇప్పుడు లద్దాఖ్ వివాదంలో మళ్లీ హైలైట్ అయ్యాడు.
97 శాతం లద్దాఖ్ జనాభా బౌద్ధ, ముస్లిం ట్రైబల్స్. అందుకే ఆరో షెడ్యూల్ ట్రైబల్ ప్రొటెక్షన్) అమలు, రాష్ట్ర హోదా , లెహ్-కార్గిల్‌కు సెపరేట్ పార్లమెంటరీ సీట్లు, స్థానికులకే ఉద్యోగాలు, భూములపై హక్కులు వంటి డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలకు వాంగ్ చుక్ నాయకత్వం వహిస్తున్నారు. 2023లో లెహ్ నుంచి ఢిల్లీకి 500 మైళ్ల మార్చ్ చేశారు. 2024 మార్చిలో 21 రోజుల ఆమరణదీక్ష చేశారు. ఇటీవల మళ్లీ దీక్ష చేసి.. హింస జరగడంతో.. విరమించాడు. లద్దాఖ్‌లో "జెన్ Z రెవల్యూషన్" అని పిలుపునిచ్చాడు. ఇప్పుడు వాంగ్చుక్ కోసం యువత రోడ్డెక్కుతున్నారు.





















