Nuvvunte Naa Jathaga Serial Today March 27th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిధున ఫ్యాన్ కొట్టేసిన దేవా దెయ్యం.. కరెంట్ కలిపింది ఇద్దరినీ!
Nuvvunte Naa Jathaga Today Episode ఇంట్లో వాళ్లకి తెలీకుండా తమ గదిలో ఇన్వెర్టర్ పెట్టుకోవాలని పిసినారి మొగుడుపెళ్లం ప్లాన్ చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode కరెంట్ పోవడంతో మిధున దెయ్యంలా రెడీ అయి దేవా దగ్గరకు చాకు తీసుకొని వెళ్లి బెంబేలెత్తిస్తుంది. నన్ను భార్యగా అంగీకరించకుండా నన్ను కనీసం పట్టించుకోకుండా నరకంలో వదిలేసి నువ్వు హాయిగా పడుకుంటావా అని దేవాని భయపెడుతుంది. నిన్ను చంపేస్తా చంపేస్తా అంటూ వీరంగం సృష్టిస్తుంది. దేవా పెద్ద పెద్దగా అరిచి చూసే సరికి మిధున ఉండదు. ఇదంతా కల అని దేవా షాక్ అయిపోతాడు. మంచి నీరు తాగి పడుకుంటాడు.
దేవా పడుకోవడానికి రెడీ అవగానే మిధున క్యాండిల్ పట్టుకొని వస్తే దేవా చాలా భయపడతాడు. దెయ్యం దెయ్యం అని అరుస్తాడు. అందుకు మిధున క్యాండిల్ పట్టుకొని అవును దెయ్యాన్నే నన్ను భార్యగా అంగీకరిస్తావా లేదా అని భయపెట్టి పెద్దగా నవ్వుతుంది. దెయ్యం కాదా కాళ్లు ముందుకే ఉన్నాయ్ దెయ్యం కాదు అని దేవా ఊపిరి పీల్చుకుంటాడు. పేరుకు పెద్ద రౌడీ దెయ్యం అనగానే గజగజా వణికి పోతున్నాడు అని మిధున అని దేవా తాడు మంచం కిందే చాప వేసుకొని పడుకోవడానికి రెడీ అవుతుంది. దేవా కిందకి వెళ్లమంటే హాల్‌లో పడుకోవడానికి భయం కరెంట్ లేదు కదా అని చెప్పి పడుకుంటుంది. దేవా ఏం చెప్పినా వినకుండా భర్త గారు గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంది.
శారద భర్తతో ఇంకా కరెంట్ రాలేదు.. ఈ పూట కరెంట్ వచ్చేలా లేదని చెప్తుంది. మన ఇంటికే కరెంట్ లేదు కదా రేపు కరెంట్ ఆఫీస్‌కి వెళ్తానని అంటారు సత్యమూర్తి. బిల్ కట్టినా ఎందుకు కరెంట్ రాలేదని శారద అనుకుంటుంది. అందరూ ఉక్కపోతకి ఇబ్బంది పడతారు. మిధున చిన్న ఫ్యాన్ పెట్టుకొని దేవాని ఉడికించేలా ఎంత బాగా గాలి వస్తుందని తనకు మాత్రమే గాలి రావాలి అని పెట్టుకుంటుంది. దేవాని ఆటపట్టించాలని సూపర్ అంటూ పడుకుంటుంది. దేవా ఓ ప్లేట్ తీసుకొని విసురుకుంటాడు. మిధున పడుకోవగానే దేవా మిధున ఫ్యాన్ కొట్టేయాలని ప్రయత్నిస్తాడు. మిధున మీద పడబోయి తర్వాత లేచి వెళ్లి ఫ్యాన్ కొట్టేస్తాడు. తర్వాత తన దగ్గర ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటాడు. మిధున పడుకున్నట్లు నటించి తర్వాత దేవా వైపు చూసి నవ్వుకుంటుంది. దేవా దగ్గర కూర్చొని దేవానే చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది.
సూర్యకాంతం ఉక్కపోత అని అంటే నేను విసురుగా బంగారం అంటూ శ్రీరంగం కాంతానికి విసురుతాడు. ఇక కాంతం ఇంటి పని మొత్తం చేసి అలిసిపోయాను కాళ్లు నొప్పులు అనగానే బంగారం నేను కాళ్లు పట్టుకుంటా అని కాళ్లు పడుతూ విసురుతాడు. కాంతం భర్తతో మనం ఒక ఇన్వెర్టర్ తీసుకుందామని అప్పుడు ఫ్యాన్ వేసుకోవచ్చు అని అంటుంది. అది కూడా ఎవరీకీ తెలీకుండా మన గది వరకే పెట్టుకుందామని అంటుంది. రేపు ఉదయమే ఎవరీకీ తెలీకుండా తెచ్చి బిగించేస్తా అంటాడు. ఉదయం మిధున దేవా పడుకున్న దగ్గర తుడుస్తూ నీ కోసం నీకోసం జీవించా చిలుకా అంటూ పాటలు పాడుతుంటుంది. దేవాని ఇబ్బంది పెట్టేలా పెద్ద పెద్దగా అరుస్తుంది. దేవా లేచి నువ్వేమైనా ఫేమస్ సింగర్ కూతురు అనుకున్నావా అని అడుగుతాడు. ఇంట్లో దెయ్యం ఉందని మిధున అంటుంది. దానికి దేవా ఒక దెయ్యం మరొ దెయ్యం కోసం మాట్లాడుతుందని అంటాడు. ఆ దెయ్యం నా ఫ్యాన్ కొట్టేసి అక్కడ పెట్టుకుందని చూపిస్తుంది. దెయ్యం పేరుతో నన్ను ఆడేసుకుంటుందని దేవా అనుకుంటాడు. నీ ఫ్యాన్ నీ దగ్గర దాచుకో అని ఇచ్చేస్తాడు. ఈ ఫ్యాన్ తీసిన దెయ్యం పేరు ఏంటి రక్తపిశాచా, కాస్మోరానా అంటూ మిధున అనగానే దేవా ఫ్యాన్ విరగ్గొడతా అనుకొని మిధున వెంట పడతాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















