Karthika Deepam 2 Serial Today March 27th: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని సార్లు మనసు ముక్కలు చేసుకోవాలి.. నేను ఓ ఆడపిల్లనే.. జ్యోత్స్న డైలాగ్స్ పీక్స్!
Karthika Deepam 2 Serial Today Episode దీప తన నిశ్చితార్థం ఆపేసిందని జ్యోత్స్న ఎమోషనల్ అవుతూ అందరికీ తన బాధ చెప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప గౌతమ్‌ని నిలదీయడంతో గౌతమ్ రివర్స్ అయిపోతాడు. వంట మనిషి నా మీద నిందలు వేసి కొడుతుంటే సినిమా చూసినట్లు చూస్తున్నారు. మీ అమ్మాయి మనసులో మరొకరు ఉన్నారని తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకోవడం నా తప్పు అని అంటాడు. ఇంటి అల్లుడి బాగోతం తెలుసు అయినా నేనేం అడగలేదు అని నిశ్చితార్థం రింగ్ శివనారాయణ కాళ్ల దగ్గర విసిరేసి నిశ్చితార్థమే కాదు ఈ పెళ్లి కూడా జరగదు అని అంటాడు. తన తల్లిదండ్రుల్ని తీసుకొని వెళ్లిపోతాడు. గౌతమ్ తల్లిదండ్రులు జ్యోత్స్న ఫ్యామిలీని తిట్టేసి వెళ్లిపోతారు.
శ్రీధర్: గోవిందా గోవిందా.. ఏంటి ఇంకా అందరూ అలా చూస్తున్నారు నిశ్చితార్థం గోవిందా కానీ కార్తీక్ క్యాటరింగ్ బాగుంటుంది. తినేసి వెళ్దాం పదండి.
శివనారాయణ: ఏరా నీ పెళ్లాన్ని అడ్డు పెట్టుకొని నా మనవరాలి నిశ్చితార్థం ఆపుతావా.
దీప: ఓ దుర్మార్గుడి చేతిలో మీ మనవరాలి జీవితం బలి కానందుకు సంతోషించండి.
శివనారాయణ: నోర్ముయ్. నీతో మాట్లాడాలి అంటేనే అసహ్యంగా ఉంది. క్యాటరింగ్ చేసుకోకుండా లోపలికి ఎందుకు వచ్చావ్.
స్వప్న: జ్యోత్స్న జీవితం కాపాడటానికి.
శివనారాయణ: మీ నాన్న నా కూతురి జీవితం కాపాడాడు ఇప్పుడు మీ వదిన నా మనవరాలి జీవితం కాపాడుతుందా. లెక్కపెడితే సరిపోనన్ని తప్పులు మీ వైపు పెట్టుకొని ఎదుటి వాళ్ల తప్పులు లెక్కిస్తారా.
దీప: ఆ అబ్బాయి మంచోడు కాదు తాతయ్యగారు.
శివనారాయణ: నువ్వు మంచిదానివా. ఏరా నీ భార్య మంచిదా. నిన్ను ఇంటి అల్లుడిని చేస్తానని సుమిత్రకు నిన్ను భర్తని చేస్తానని నీ మరదలు జ్యోత్స్నకి మాట ఇవ్వలేదా. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకుందిరా. పోయి నిన్ను పెళ్లి చేసుకుంది. మాట మీద నిలబడిని మనషులు, విలువ లేని మనుషులు మీరు వచ్చి మా తప్పులు ఎత్తాలి. మా చెల్లి రావాలి అని నా కొడుకు, నా మేనత్త రావాలి అని నా మనవరాలు అనడంతో మనసు చంపుకొని పిలిచాను. అది ఎంత పెద్ద తప్పో అర్థమైంది. అక్కడితో ఆగకుండా క్యాటరింగ్ కూడా ఇచ్చి రెండో తప్పు కూడా చేశాను. దాని ఫలితమే ఈ పెళ్లి చెడిపోవడం.
దీప: పెళ్లి చెడిపోయినందుకు క్షమించండి. గౌతమ్ మంచోడు కాదు.
పారు: ఏరా నీకు గౌతమ్ గురించి తెలీదా.
దీప: గౌతమ్ గురించి తెలీకే జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది.
జ్యోత్స్న: ఇంక చాలు దీప నువ్వు అనుకున్నది జరిగింది నా పెళ్లి ఆగిపోయింది. నేనేం పాపం చేశాను అత్త నీ కోడలు నా మీద ఎందుకు ఇంత పగ పట్టింది. నేను పుట్టడమే నేను బావకి భార్యగా పుట్టాను. ఇది నాకు తెలుసా నేను కోరుకున్నానా. నా ఇష్టంతో సంబంధం లేకుండా ఇంట్లో వాళ్లు బయట వాళ్లు అఖరికి నా ఫ్రెండ్స్ కూడా కార్తీక్‌నే నీ భర్త అంతా ఇదే మాట. ఊహ తెలియక ముందే అంతా ఇదే అంటుంటే నా ఇష్టం ఇక ఏంముంటుంది. బావ నచ్చాడు. బావని భర్తగా అనుకొని పెరిగాను. కానీ జరగలేదు కారణం ఎవరు దీప. బావతో పెళ్లి అన్నారు రెండు రోజుల్లో పెళ్లి అన్నారు. తాళితో సహా అన్నీ రెడీ చేశారు. మొదలు పెట్టబోయే కొత్త జీవితం కోసం చాలా కలలు కన్నాను. నేను ఓ ఆడపిల్లనే కదా. పెళ్లి జరగలేదు. కారణం ఎవరు ఈ దీప. నా మెడలో పడాల్సిన తాళి ఈ దీప మెడలో పడింది. నా భర్త కావాల్సిన బావ దీప భర్త అయ్యాడు. మీరంతా ఒక్కసారి మనసుతో ఆలోచించండి అన్నేళ్లు బావతో జీవితం ఊహించుకున్న నేను ఒక్కసారిగా బావ నాకు దూరం అయితే నేను ఎంత బాధపడిఉంటాను. ఏమైపోయింటానో. ఇది నా జీవితానికి పెద్ద తుఫాను అనుకున్నాను. మా అమ్మానాన్న కోసం వాళ్లకు నచ్చిన ఒకర్ని పెళ్లి చేసుకొని మీ అందరికీ దూరంగా వెళ్లిపోవాలి అనుకున్నా కానీ దీప ఇది కూడా జరగలేదు. సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు నిందవేసింది కొట్టింది పెళ్లి ఆగిపోవాలి. నేను దీప కారణంగా ఎన్ని సార్లు నా మనసు ముక్కలు చేసుకోవాలి బావ. నీ కంటూ మంచి జీవితం ఉంది పెళ్లి చేసుకో అని నువ్వు చెప్పావు బావ నేను అర్థం చేసుకున్నాను కానీ దీప ఈ పెళ్లి కూడా చెడగొట్టింది. ఏం దీప నాకు అసలు జీవితంలో పెళ్లే జరగనివ్వవా. నన్ను మనస్శాంతిగా బతకనివ్వవా. ఏదో ఒక నింద వేస్తూ బాధ పెడతూనే ఏంటావా. ఇది నువ్వు చేసిన మంచి అని ఏడుస్తూ అన్నీ విసిరేస్తుంది.
జ్యోత్స్న పెద్ద పెద్దగా ఏడుస్తుంది. పారు దీపని వెళ్లిపోమని గెంటేస్తుంది. దీప పడిపోబోతే కాశి పట్టుకుంటాడు. నువ్వు నీ కొడుకే కాదు నీ కోడలు కూడా నీ మీద పగపట్టింది అందరూ కలిసి నా మీద పగ తీర్చుకున్నారు అని పెద్దాయన ఏడుస్తారు. జ్యోత్స్న కుప్పుకూలిపోయి ఏడుస్తుంది. పెద్దాయన కుప్పుకూలిపోతారు. కార్తీక్ వాళ్లు ఇంటికి వెళ్లిపోతారు. సుమిత్ర కార్తీక్ ఇంటికి వెళ్తుంది. పాములు పగ పడితే వెంటాడి వెంటాడి ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టవు. ఈ దీప కూడా ఇలాగే నా కూతురి మీద పగ పట్టింది. నా కూతురు ఒట్టి వెర్రిది నీకు ఉన్నంత లోతైన ఆలోచనలు ఉన్నది కాదు. ఎవరు ఎన్ని అన్నా అది అత్తాబావ అని మీ వెంట పడుతుంది. అందుకే దానికి ఇలా చేస్తున్నారు అని అంటుంది సుమిత్ర. అవతలి వాళ్ల జీవితాలు అద్దం లాంటి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నవ్వులతో నిండిపోవాల్సిన నా కూతురి ముఖం కన్నీటితో కుమిలిపోయింది. ఎందుకు దీప ఇంత పగ పట్టావు నా కూతురి మీద అని అడుగుతుంది. నాకు అన్నం పెట్టిన మీకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండను అని దీప అంటుంది. అది నిజం అయితే సాక్ష్యం చూపించు అని సుమిత్ర అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర అఖండ జ్యోతి దీక్ష నెరవేరిందా...? ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి..?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

