Nuvvunte Naa Jathaga Serial Today March 19th: నువ్వుంటే నా జతగా సీరియల్: "ఏమిటో ఈ ప్రేమ మాయ.. ఎంత చిత్రంరా".. బార్‌లో మిధున వైల్డ్ యాక్షన్!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా తాగుతున్న దాబా దగ్గరకు మిధున వెళ్లి భర్తతో గొడవ పడటం భాను ఆటోలో దేవా, మిధునని తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున తన కోడలు అని దేవా భార్య అని పంతులుతో శారద చెప్పి పూర్ణహుతిని మిధునకు సమర్పించమని చెప్తుంది. మిధున చాలా చాలా సంతోషిస్తుంది. ఈ రోజు అత్తయ్య కోడలిగా అంగీకరించింది నా భర్త కూడా నన్ను అంగీకరించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటానని అనుకుంటుంది. దేవా ఓ దాబా దగ్గర తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడు. అందరికీ మంచిగా కనిపిస్తున్న నేను మా నాన్నకి ఎందుకురా నచ్చడం లేదు అని అనుకుంటాడు. ఇక సూర్యకాంతం కాపలా కుక్కలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఏమైందని ప్రమోదిని అడిగితే ఏదో మనకు తెలీకుండా జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అని తన అనుమానాలు ప్రమోదినితో చెప్తుంది. ఇంతలో మిధున వచ్చి కాంతం అక్కాయ్ నీ ఫ్యూచర్ నాకు కనపడిపోతుందని అంటుంది.
కాంతం నోరెళ్లబెడుతుంది. ఏ పనీ లేకుండా ఎదుటి వారి విషయాలు ఆలోచించే వాళ్లు సైకాలజీ ప్రకారం పిచ్చోళ్లు అయిపోతారని చెప్తుంది. ప్రమోదిని ఎంత కష్టం వచ్చింది కాంతం నీకు అని ఏడిస్తే కాంతం అక్కని ఆపి అదేదో అంటే నువ్వేంటి అక్క అని అంటుంది. నేను రెండో కోడలిని కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్లావో నాకు చెప్పాల్సిందే అని అంటుంది. సర్లే అక్క ఏడవకు చెప్తా అని మిధున మొత్తం చెప్తుంది. విన్నావు కదా నీ ఆరాటం కడుపు మంట తగ్గనట్లే కదా.. మామయ్య గారి మీద హత్యాప్రయత్నం జరిగిందా నవ్వు నీ తండ్రి కాపాడారా అని వెటకారంగా నవ్వుతుంది. నీ కర్రీస్ నా దగ్గర ఉడకవు అని వెళ్లిపోతుంది. ప్రమోదిని మిధునకు చాలా థ్యాంక్స్ చెప్తుంది. మామయ్యగారి కోసం చాలా పెద్ద రిస్క్ చేశావు నీకు ఆ దేవుడు మంచి చేస్తాడని అంటుంది. త్వరలోనే నేను దేవా భార్యగా ఈ ఇంటిలో స్థానం పొందుతా అక్క అని అంటుంది. ఇక ప్రమోదిని దేవాని మామయ్య కొట్టారు అన్నావ్ మరి దేవా ఎక్కడ అని అడుగుతుంది.
దేవా తాగుతున్న దగ్గరకు మిధున వెళ్తుంది. దేవా చూసి ఆ రాక్షసి వస్తున్నట్లుంది. ఇక్కడే అదే కనిపిస్తుంది. నన్ను ప్రశాంతంగా ఉంచదారా అది అని తాగుతాడు. మిధున తన వైపు నడుచుకుంటూ రావడం చూసి షాక్ అయిపోతాడు. మిధున వచ్చి నేరుగా దేవా ముందు కూర్చొంటుంది. ఏయ్ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్ ఇక్కడికి లేడీస్ వస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు వెళ్లిపో అంటాడు. నీ బాధేంటో చెప్పు అని అడుగుతుంది. చిరాకు తెప్పించకుండా వెళ్లిపో అని దేవా అంటే మిధున వాటర్ బాల్‌లో వాటర్ దేవా ముఖం మీద విసిరేస్తుంది. మళ్లీ దేవా ముందు కూర్చొని అడిగిన దానికి సమాధానం చెప్పుకపోతే ఈ సారి బిందె తీసుకొచ్చి కొడతా అంటుంది. అందరూ దేవాతో నిప్పులు కనిపిస్తున్నాయి ఆ అమ్మాయి కళ్లలో చూడు అని అంటారు.
మిధున: చెప్పు నీ బాధ ఏంటో నాతో చెప్పు.
దేవా: మా.. నాన్నా.. మా నాన్న నన్ను అర్థం చేసుకోవడం లేదు. రోజు రోజుకు నా మీద ద్వేషం పెంచుకుంటున్నాడు. మరి నాకు బాధ అనిపించదా. ఆ బాధతోనే తాగుతున్నా. నా బాధ చెప్పా కదా ఇక దయచేయ్.
మిధున: నీ వల్ల నీ చుట్టు పక్క ఉన్నవారికి ప్రమాదం అని తెలిసినప్పుడు రౌడీయిజం వదిలేయొచ్చు కదా. నీ కారణం వల్ల నీ వాళ్లకి ప్రమాదం రావడం చూసి కూడా ఎందుకు ఇంకా ఆవృత్తిలో ఉంటావ్.
దేవా: మా వాళ్లని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. వాళ్లకి ఏం కాకుండా నేను కాపాడుకుంటా.
మిధున: ఈ రోజు మీ నాన్నని నువ్వు వచ్చి కాపాడావా. దేవుడి దయ వల్ల మీ నాన్నకి ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది అదే ఏమైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి. మా నాన్న ద్వేషం పెంచుకుంటున్నారని బాధ పడుతున్నావ్ కానీ అది నీ చేష్టల వల్లే అని నువ్వు మర్చిపోతున్నావ్. ఈ సమస్యలు అన్నీంటికి కారణం నీ రౌడీయిజం. దాన్ని వదిలేస్తే నీతోపాటు నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది.
దేవా: నా వాళ్లకి ప్రమాదం అని తెలిసినా నేను ఎందుకు రౌడీగా ఉన్నానో నాకు తెలుసు. ఆ దేవుడు చెప్పినా నేను మానను.
మిధున: నువ్వు రౌడీ వృత్తి వదిలే వరకు నేను వదలను ఇది త్వరలోనే నీకు తెలుస్తుంది.
మిధున మాటలకు అందరూ క్లాప్స్ కొట్టి విజిల్స్ వేస్తారు. ఇక మిధున దేవాని ఇంటికి రమ్మని పిలుస్తుంది. లాక్కొని తీసుకెళ్తుంది. దేవా ఫ్రెండ్స్ దేవా, మిధునల కోసం ఆటో కోసం తూగుతూ వెతుకుతూ ఉంటారు. ఇంతలో భాను ఆటోలో వచ్చి తాగినందుకు వాళ్లని తిడుతుంది. వాళ్లు భానుతో నువ్వు దురదృష్టానికి బ్రాండ్ భాను అంటారు. ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారని భాను అంటే దేవా మిధునల్ని చూపించి నీ దరిద్రం కాకపోతే నువ్వు ఈ టైంలో రావాలా అంటారు. దేవా, మిధునలు భాను ఆటోలో కూర్చొంటారు. భాను తలబాదుకొని నిజంగా నా దరిద్రం కాకపోతే నేను నా లవర్‌ని నా సవతిని నా ఆటోలో తీసుకెళ్లాల్సి వస్తుందని అనుకుంటుంది. ఆటోలో తీసుకెళ్తుంది. ఇద్దరినీ ఇలా తీసుకెళ్తుంటే కడుపు రగిలిపోతుందని తిట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?





















