Nuvvunte Naa Jathaga Serial Today june 9th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా మిస్సింగ్, మిథున కంగారు.. నల్లపూసల తంతులో ట్విస్ట్!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా ఇంట్లో నల్లపూసల తంతుకి ఏర్పాట్లు జరగడం దేవా రోజుంతా లేవకుండా భాను ఇంజక్షన్ వేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా స్నేహితులు అంతా గ్యారేజీలో ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు. ఇంతలో మిథున అక్కడికి దేవా అంటూ కంగారుగా వస్తుంది. అన్న ఇక్కడ లేడని రాత్రే ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడని అంటారు. ఇంటికి రాలేదు అని మిథున కంగారు పడుతుంది. ఇంట్లో నల్లపూసల కార్యక్రమం ఉంది అబద్ధం చెప్పకండి దేవా ఇక్కడే ఉన్నాడా చెప్పండి ప్లీజ్ అని బతిమాలుతుంది.
దేవా స్నేహితులు మిథునతో ప్రామిస్ వేసి దేవా అన్న రాత్రే ఇంటికి ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు అని అంటారు. మిథున చాలా కంగారు పడుతుంది. రాత్రి ఫోన్‌లో మాట్లాడాను. పది నిమిషాల్లో ఇంటికి వస్తా అన్నారు ఆయనకు ఏం జరిగిందో అని భయంగా ఉంది అంటుంది. దేవా అన్న నల్లపూసల తంతు కోసం తప్పించుకోవాలనుకున్నాడేమో అంటారు. దేవా అలాంటి వాడు కాదని ఈ తంతు నా జీవితానికి చాలా ముఖ్యమైనది అని మిథున ఎమోషనల్ అవుతుంది. ముగ్గురు మిథునకు ధైర్యం చెప్పి ఫంక్షన్ టైంకి తీసుకొస్తామని మిథునని పంపేస్తారు.
దేవా హాస్పిటల్‌లో భానుతో నన్ను కాపాడింది నువ్వేనా అంటాడు. అవును అని భాను దేవాని చూసిన పరిస్థితి చెప్తుంది. అసలేం జరిగింది అని దేవా అడిగితే అవన్నీ వద్దులే అనేస్తుంది. దేవా చెప్పమని అడుగుతాడు. డాక్టర్ వచ్చి నీ తలకు గట్టిగా దెబ్బ తగిలింది ఇప్పుడు మీరు ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అంటారు. దేవా తన ఫోన్ గురించి భానుని అడిగితే భాను ఫోన్ దాచేసి తెలీదు అంటుంది. అమ్మ వాళ్లు కంగారు పడతారు ఇంటికి వెళ్తాను అని దేవా అంటే భాను వద్దు అంటుంది. భాను దేవాని ఆపి పడుకోవడానికి ఇంజక్షన్ చేస్తాడు. దేవా పడుకుండిపోతాడు.
దేవా ఇంట్లో నల్లపూసల తంతుకి ఏర్పాట్లు జరుగుతాయి. శ్రీరంగం అన్నతో దేవా రావడంలేదు కానీ ఈ ఏర్పాట్లు ఏంటో అని నవ్వుతాడు. మిథున బయట నుంచి రావడంతో మిథున దగ్గరకు శారద, ప్రమోదిని, కాంతం వెళ్లి త్వరగా రెడీ అవ్వమంటారు. మిథున గ్యారేజ్‌కి వెళ్లి వచ్చానని దేవా లేడు అంటే శారద దేవా టైంకి వస్తాడు. ఒక వేళ రాకపోతే నీ అత్తగా నేను నీ మెడలో నల్లపూసలు వేస్తా ఇది నీ జీవితంలో ముఖ్యమైన ఘట్టం త్వరగా రెడీ అవ్వు అమ్మా అని చెప్తారు. కాంతం మిథున దగ్గరకు వెళ్లి తన మాటలు యాక్షన్‌తో చిరాకు పెడుతుంది. నీ నస ఏంటి అని మిథున అడుగుతుంది. దేవా రాడు తప్పించుకున్నాడని కాంతం అంటే నీ పని చూసుకో నన్ను తినకు అని మిథున అంటుంది. దేవా రాడు నీ మెడలో నల్లపూసలు వేయడు అని కాంతం అంటే కచ్చితంగా వస్తారు నా మెడలో నల్లపూసలు వేస్తారు అని మిథున అంటుంది.
సత్యమూర్తి బయటకు వెళ్లిపోతుంటే శారద ఆపుతుంది. శుభమా అని ఇంట్లో నల్లపూసల తంతు జరుగుతుంటే మీరు బయటకు వెళ్లడం ఏంటి అని అడుగుతుంది. మిథున లాంటి మంచి అమ్మాయి ఈ రౌడీని భర్తగా అంగీకరించి వీడి కోసం రావడం ఏంటి అని అంటారు. ఆ అమ్మాయిని నచ్చచెప్పాల్సిన నువ్వే ఇలా తంతు జరిపించడం ఇబ్బందిగా ఉందని అంటారు. దేవా మంచోడే అని మిథునకు ఆ విషయం తెలుసు అని శారద అంటుంది. మన ఇంటిని దేవా జీవితాన్ని మార్చడానికి ఆ పార్వతి పరమేశ్వరులు పంపిన అదృష్టం మిథున అని శారద చెప్తుంది. ఎంత వెతికినా అంత మంచి అమ్మాయిని తీసుకురాలేము మిథున మీద ఎందుకు కోపం అని అడుగుతుంది. మిథున మీద కోపం కాదు బాధ మనకు ఆడపిల్ల ఉంటే మిథునలా ఉండాలి అనుకుంటా అంత మంచి అమ్మాయికి ఓ రౌడీ భర్త అయితే ఒప్పుకోం కదా.. నేను ఇక్కడే ఉంటే ఆ తప్పుని అంగీకరించినట్లు అవుతుంది అదే వెళ్లిపోతే ఓ కూతురి జీవితం కాపాడలేని తండ్రిగా మిగిలిపోతా అని బయటకు వెళ్లిపోతారు.
ప్రమోదిని మిథునని రెడీ చేస్తుంది. మిథున దేవా నెంబరుకి కాల్ చేస్తూనే ఉంటుంది. దేవా ఎక్కడ ఉన్నాడు అమ్మా అని అమ్మవారిని దండం పెట్టుకొని దేవా ఆచూకీ ఇవ్వమని ఏడుస్తుంది. ఈ రోజు ఆయన రావాలి నా మెడలో నల్లపూసలు వేయాలి.. ఈ తాళి నా మెడలో శిక్షగా వేస్తే దేవా రాడు అనుకుంటుంది. నువ్వు నాకు వేసిన శిక్ష అనుకుంటా నాకు దేవాకి నూరేళ్లు రాసి పెట్టినట్లే లేదని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతా అని అమ్మవారితో అనుకుంటుంది. ఇంతలో దేవాకి మెలకువ వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!





















