Nuvvunte Naa Jathaga Serial Today February 25th: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మా ఆయన నా కోసం వచ్చాడోచ్.. తల పట్టుకున్న ఫ్యామిలీ.. దేవా పని ఇత్తడే!
Nuvvunte Naa Jathaga Today Episode మిధునను ఆదిత్యతో పెళ్లి చేయాలని ఫ్యామిలీ అనుకుంటే నా కోసం నా భర్త వచ్చాడని మిధున దేవాతో వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode డాక్యుమెంట్స్ కోసం మిధునకు దేవా కాల్ చేస్తాడు. మిధున తనకు డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో గుర్తు లేదని తనని అక్కడికి తీసుకెళ్తే చూసి చెప్తాను అంటుంది. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని దేవా అంటే నీకు డాక్యుమెంట్స్ కావాలి అంటే రా లేకపోతే నీ ఇష్టం అని అంటుంది.
దేవా: ఏయ్.. అబ్బా టైం చూసి నాతో ఆడుకుంటుంది. డాక్యుమెంట్స్ ఎలా అయినా తీసుకెళ్లాలి పురుషోత్తం అన్న కూడా పదే పదే కాల్ చేస్తున్నాడు ఇలాంటి టైంలో ఇగోలకు పో కూడదు.
మిధున: అవసరం తనని కాబట్టి మళ్లీ ఫోన్ చేయాల్సిందే చూస్తా నాకు మళ్లీ ఎలా కాల్ చేయడో. ఇంతలో కాల్ వస్తుంది. ఎవరండీ.
దేవా: మర్యాదగా డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు.
మిధున: ఆల్రెడీ చెప్పాను కదా వచ్చి తీసుకెళ్లు అనిబాయ్.. వస్తాడు..
హరివర్దన్: మిధున రెడీ అయి వచ్చావేంటి మేం నీ లైఫ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు వచ్చేశావేంటి.
మిధున: మా ఆయన నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు.
త్రిపుర: ఆ రౌడీ నిన్ను తీసుకెళ్లడానికి రావడం ఏంటి.
మిధున: నేను పుట్టింటికి వచ్చాను నన్ను అత్తారింటికి తీసుకెళ్లడానికి మా ఆయన వస్తున్నారు. ఇందులో మీరు షాక్ అవ్వాల్సింది ఏముంది.
లలిత: అంటే నువ్వు ఆ ఇంటిని వదిలేసి మన ఇంటికి శాశ్వతంగా వచ్చేయలేదా.
మిధున: ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు. అయినానేను మా అత్తారింటిని వదిలేసి ఎందుకు వస్తాను. చిన్న గొడవకు నేను మనసు మార్చుకొని పర్మినెంట్‌గా వచ్చేశాను అని మీరు ఎలా అనుకున్నారు. అయినా అత్తారింట్లో కోడలికి సవాలక్ష సమస్యలు ఎదురవుతాయి. అంత మాత్రాన వచ్చేస్తానా. నేను వచ్చింది నాన్న పుట్టిన రోజు కోసం.
రోహిత్: మేం నిన్ను పిలిచామా నాన్న పుట్టిన రోజుకి.
మిధున: నాన్న పుట్టిన రోజుకి మీరు నన్ను స్పెషల్‌గా పిలవడం ఏంటి అన్నయ్య. నాన్న మీ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్ మీ పుట్టిన రోజుకి నేను ఎప్పుడూ మీ బ్లెస్సింగ్స్ తీసుకోకుండా లేను అందుకే వచ్చా.
హరివర్దన్: ఫైనల్‌గా ఓ బకరాని చేశావు అంతే కదా. నీ కోసం వచ్చాను అంటే మాతో శాశ్వతంగా ఉండిపోతావు అనుకున్నా. ఇలా మమల్ని వెదవల్ని చేస్తావు అనుకున్నా. నీ లాజిక్‌లు నాకు అర్థం కాలేదమ్మా. నువ్వు ఇంటికి రాగానే నేను ఓ సగటు తండ్రిలా ఆలోచించి నా కోసం వచ్చావని సంతోషంలో ఉండిపోయానమ్మా అలా కాదని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే నిన్ను నా ఇంటి గుమ్మం కూడా తొక్కనిచ్చేదాన్ని కాదు.
మిధున: నాన్న మీ కోసం మీకు కరెక్ట్ నా నిర్ణయం నాకు కరెక్ట్. మీ సంతోషంలో భాగం అవ్వడం కోసం మీ పుట్టిన రోజుకు వచ్చాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్న అంతే కానీ నన్ను నా పుట్టింటికి శాశ్వతంగా దూరం చేసి శిక్షించకండి ప్లీజ్. అని ఏడుస్తుంది.
ఇంతలో దేవా వచ్చి హారన్ కొడతాడు. మిధున అందరితో మా ఆయన వచ్చాడని అంటుంది. త్రిపుర కోపంతో ఆ రౌడీ గాడు నీకు ఆయన మా తమ్ముడి కాలి గోటికి కూడా వాడు సరిపోడు అంటుంది. ఆ ఫుట్ పాత్ గాడు నీకు ఆయనా అని అంటే దానికి మిధున వదినా నా భర్తని తక్కువ చేసి మాట్లాడొద్దు బాగోదు అని చెప్పి వెళ్లిపోతుంది. దేవా బైక్ ఎక్కి పుట్టించి నుంచి వెళ్లిపోతుంది. హరివర్దన్ ఫ్యామిలీ చూస్తూ ఉండిపోతారు. మిధున అని ఆదిత్య పిలిస్తే ఆదిత్య తల్లి పద్మ ఆదిత్యని తిడుతుంది. పిలవడానికి వీళ్లకి సిగ్గు లేకపోయినా మనకు ఉండాలి బుద్ధి ఉంటే ఇంకోసారి వీళ్ల ఇంటికి రాకూడదు అని చెప్పి ఆదిత్యను తీసుకొని వెళ్లిపోతుంది. హరివర్దన్ కుప్పకూలిపోయి ఏడుస్తాడు.
మిధునని తీసుకెళ్తున్నందుకు దేవా కస్సుబుస్సులాడుతాడు. మిధున మీద చేయి వేస్తే అరుస్తాడు. అంత స్పీడ్‌గా వెళ్తే ఎలా వెనక ఉన్నది అమ్మాయి అని గుర్తించి అంటుంది. నన్ను టచ్ చేస్తే నాకు చిరాకుగా ఉందని దేవా అంటే మిధున కావాలనే పట్టుకుంటుంది. దేవా బండి ఆపి మరీ తిడతాడు. దాంతో మిధున బండి వెనక్కి తిప్పి నన్ను మా ఇంటికి దిగబెట్టే అంటుంది. మిధున దేవాతో బతిమాలించుకొని బండి ఎక్కుతుంది. దారిలో పానీ పూరీ బండి చూపించి బైక్ ఆపిస్తుంది. పానీ పూరి తిని చాలా రోజులు అయిందని వెళ్లితిందామని అంటుంది. ఒక్క టిచ్చానంటే అని దేవా అంటే నన్నే కొట్టాలనుకుంటావా అనుకొని మిధున అంటే నాకు టైం అయిపోతుంది అంటే ఇలా ఆడుకుంటావేంటే అని అంటాడు. దాంతో మిధున మా ఇంటికి వెళ్లిపోతాను అని గోల చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!





















