Nuvvunte Naa Jathaga Serial Today December 19th: నువ్వుంటే నా జతగా: దేవా కోసం రిస్క్‌లో మిథున! రిషి కన్నీరు పెట్టుకోవడానికి కారణమేంటి?
Nuvvunte Naa Jathaga Serial Today Episode December 19th దేవా మిస్సింగ్ అంటూ పోలీసులు మిథున ఇంటికి వెతకడానికి రావడంతో మిథున దేవాని తప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున జ్యూస్ తీస్తూ ఉంటుంది. అలంకృత వచ్చి అక్క నువ్వు చాలా కష్టపడుతున్నావ్ కానీ జ్యూస్ తాగడానికి బావ ఇంట్లో లేడు బయటకు వెళ్లాడు అని చెప్తుంది. జ్యూస్ నా కోసం అని మిథున అంటుంది. అలంకృత షాక్ అయిపోతూ నీ నోటి వెంట జ్యూస్ అనే మాట వస్తే నాన్న పది రకాల జ్యూస్‌లు నీ ముందు ఉంచుతారు.. అలాంటిది నువ్వే జ్యూస్ చేయడం అంటే మామూలు షాక్ కాదు అని అంటుంది.
త్రిపుర మొత్తం అనుమానంగా చూస్తూ ఉంటే రాహుల్ ఎందుకు అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు. మీ చెల్లి ప్రవర్తన చాలా వింతగా ఉంది.. తనకు అసలు ఆరెంజ్ జ్యూస్ ఇష్టమే ఉండదు కానీ చేస్తుంది అని చెప్పి మిథున దగ్గరకు వెళ్తుంది. మిథున గదిలోకి తీసుకెళ్తానంటే నీకు ఇష్టం లేని జ్యూస్ అది కూడా గదిలోకి తీసుకెళ్లి తాగడం ఏంటి అని అడుగుతుంది. అలవాటు చేసుకుంటున్నా అని మిథున అంటుంది. ఇంతలో ఇంటికి పోలీసులు వస్తారు. ఎప్పుడూ లేనిది మన ఇంటికి పోలీసులు ఏంటి అని రాహుల్ అనుకుంటాడు.
పోలీస్ జడ్జితో సర్చ్ వారెంట్ సార్ అంటాడు. జడ్జి ఇంట్లో సర్చ్ ఏంటి అని కోప్పడతాడు. దేవా కనిపించడం లేదని మీ మీద కంప్లైంట్ వచ్చిందని ఎస్‌ఐ హరివర్థన్‌తో చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దేవా లేచి ఇలా కదలకుండా మెదలకుండా ఉండటం అంటే నరకంగా ఉందని అనుకుంటాడు. జడ్జి ఇంటికి వచ్చి ఇలా అడగటం ఏంటి నన్నే అనుమానిస్తారా అని కోప్పడి నా ఇల్లు అంతా వెతుక్కోండి అని హరివర్థన్ అంటాడు.
మిథున చాలా కంగారు పడుతుంది. పోలీసులు దేవాని వెతకడానికి వెళ్తారు. పోలీసులు ఇళ్లంతా వెతికి మిథున గదికి వెళ్తారు. దేవా దొరికిపోతాడేమో అని మిథున చాలా కంగారు పడుతుంది. గది దగ్గరకు వెళ్లబోతే హరివర్థన్ ఆపి ఇప్పుడు వెళ్లొద్దని అంటాడు. ఫోన్ మర్చిపోయా తెచ్చుకుంటా అని వెళ్తుంది. పోలీసులు మిథున గదిలో దేవా ఉన్న చోటుకి వెళ్తారేమో అని మిథున చాలా కంగారు పడుతుంది. దేవా అక్కడ ఉండకపోవడంతో వాష్ రూంకి వెళ్లాడేమో అని అనుకుంటుంది. పోలీస్ వాష్ రూంలో కూడా వెతుకుతాడు. దేవా అక్కడ కూడా ఉండడు. తీరా చూస్తే దేవా మిథున గదిలో బీరువా వెనక దాక్కొని ఉంటాడు. మిథున దేవాని చూస్తుంది.
దేవా మిథునకు చెప్పొద్దని సైలెంట్‌గా ఉంటాడు. మిథున దేవాని తప్పించడానికి కావాలనే బాత్‌రూం డోర్ దగ్గర చేయి పెట్టేస్తుంది. పోలీస్ బాత్‌రూం నుంచి వస్తూ డోర్ వేయడంతో మిథున చేయి నలిగిపోయి రక్తం వస్తుంది. మిథున చాలా గట్టిగా అరుస్తుంది. తనని కాపాడటానికే మిథున అలా చేసిందని దేవా రాలేక ఉండలేక ఛా అని అనుకుంటాడు. హరివర్థన్ వాళ్లు కంగారు పడతారు. చూసుకోలేదు సారీ మేడం అని పోలీస్ చెప్తాడు. హరివర్థన్ కంగారు పడతారు. పోలీస్‌ని తిడతాడు. ఆ క్రిమినల్ మా ఇంట్లో ఎందుకు ఉంటాడు అని చెప్పాను అయినా విన్నావా.. మీ సర్చ్ అయితే వెళ్లండి అని పంపేస్తారు. మిథునకు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. పోలీసులు బయటకు వచ్చి వాడు ఎలా మిస్ అయ్యాడు అనుకోవడం రిషి వింటాడు.
రిషి లోపలికి వెళ్లి పోలీసులు ఏంటి అని అడుగుతాడు. ఎవరో దొరకలేదు.. అంటున్నాడు అంటే రాహుల్ కవర్ చేయడానికి ఎవరో క్రిమినల్ అంట సెర్చ్ వారెంటీ మీద సంతకం కోసం వచ్చాడని చెప్తాడు. ఇక రిషి మిథున చేయి చూసి చాలా కంగారు పడతాడు. తానే దగ్గరుండి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. మిథున బాధ పడుతుంటే రిషి చాలా బాధ పడతాడు. హాస్పిటల్‌కి వెళ్దామని అంటే మిథున వద్దు అంటుంది. రిషి బాధతో కన్నీరు పెట్టుకుంటాడు. గది వరకు వస్తానని రిషి మిథునతో అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















