Nuvvunte Naa Jathaga Serial Today August 11th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా ఐలవ్‌యూ చెప్పేశాడ్రోయ్.. ఆదిత్య సపోర్ట్ చేస్తున్నాడేంటి? ఏదో తేడా కొడుతుందే!
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 11th దేవా మిథునని ప్రేమిస్తున్నానని ఆదిత్య చెప్పడం మిథున కోసం మల్లెపూలు కొని తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవా దగ్గర కూర్చొని చేతికి కంకణం కడుతుంది. నాకు ఇలాంటివి నచ్చవు అని దేవా అంటే కొన్ని ముందు మనకు నచ్చవు దేవా కానీ తర్వాత విడదీయలేనంతగా ముడి పడిపోతాయి మన బంధంలా అని అంటుంది.
మిథున: నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను చాలా బాధ పడ్డాను నా జీవితానికి ఇలాంటి పరీక్ష ఏంటా అని ఏడ్చాను. కానీ నీ కంటే గొప్ప భర్త దొరకడు.. నీలా గొప్పగా చూసుకునే వాళ్లు ఉండరు అని అర్థమైంది. నువ్వు నన్ను భార్యగానే అంగీకరించను అన్నావ్ కానీ నేను నమ్మాను.. అందుకు బలమైన సాక్ష్యమే నువ్వు నాతో మా ఇంటికి రావడం. నీలో చాలా మార్పు వచ్చింది అది నాకు అర్థమైంది కానీ చాలా మందికి అర్థం కాలేదు. నా మీద ప్రేమ ఉందని నీతో చెప్పించమని మా నాన్న చెప్పినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉన్నావ్ కానీ నీ మౌనం వెనక చాలా మంది నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావ్ అంటున్నారు. ఎందుకో నీ మౌనం నాకు భయపెడుతుంది. ఒక ఆడపిల్లగా నేను సిగ్గు విడిచి నిన్ను ప్రేమిస్తున్నా అని నేను చెప్పినా నువ్వు ఎందుకు చెప్పడం లేదు.. నీ మౌనం వెనక కారణం ఏదైనా అయితే ఒకే కానీ నన్ను వదిలించుకోవడానికే అయితే నేను తట్టుకోలేను. నన్ను మోసం చేసి అందరి ముందు తలదించుకునేలా చేయకు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పవిత్ర బంధాన్ని ఎగతాళి చేయకు.
మిథున మాటలకు దేవా పరుగులు తీసి ఎవరూ లేని ప్లేస్‌కి వెళ్లి నా మౌనం నీకు భయపెడుతుంది అన్నావ్ కదా నా వెనక ఉన్నదేంటో తెలుసా అని మిథున ఐలవ్‌యూ.. మిథున ఐలవ్యూ అని గట్టిగా అరుస్తాడు. దేవా అలా చెప్పడం చూసి ఆదిత్య కోపంతో ఊగిపోతాడు. కానీ కూల్‌గా దేవా దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేస్తాడు.
ఆదిత్య: భయ్యా నువ్వు మిథునని లవ్ చేస్తున్నావా షాకింగ్‌గా ఉంది.
దేవా: నాకే షాకింగ్‌గా ఉంది. రౌడీగా నాకు ఎప్పుడు ఏమవుతుందా అని ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ ఎమోషన్స్ చంపేసుకున్న నాకు అన్నీ తిరిగి గుర్తు చేసింది మిథున. మిథున నాలో ప్రేమ పెంచేసింది. ప్రేమ ఇంత విలువైనదా ప్రేమలో ఇంత శక్తి ఉందా అని నాకు అర్థమయ్యేలా చెప్పింది మిథున. ద్వేషంలో కూడా ప్రేమ పుడుతుందని మిథునని చూసే వరకు తెలీలేదు. నాకు తెలీకుండా నా మనసులో మిథున మీద ప్రేమ పెరిగింది.. అందుకే తనని పంపేయలేకపోయాను. ఒక వైపు తనని ద్వేషిస్తూనే మరోవైపు తనతో కలిసి బతికాను. నేను మిథునని ప్రేమించలేదు భయ్యా తనే తన ప్రేమతో నేను ప్రేమించేలా చేసింది. భయ్యా గొడవతో మొదలైన స్నేహానికి ద్వేషంతో మొదలైన ప్రేమకి చావు ఉండదు. మిథున చెప్పినట్టు మట్టిలో కలిసిపోయే వరకు మా ప్రేమకు మరణం లేదు. మా ప్రయాణానికి ముగింపు లేదు. మిథున ప్రతీ సారీ నాతో ఏమైనా చెప్పాలా.. నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంటే నువ్వు అంటే నాకు ఇష్టం మిథున అని చెప్పాలని ఉంది కానీ మాట గొంతు దాటడం లేదు. అందుకు కారణం ఒక తెలియని పశ్చాత్తాపం. తనని ఎంత బాధపెట్టానో.. నా కోసం నేను కట్టిన తాళి కోసం తన అద్బుతమైన జీవితం నాశనం చేసేశాను. కోటలో యువరాణికి నేను గ్లాస్ మంచి నీరు ఇవ్వలేదు. నేల మీద పడుకోపెట్టాను. కడుపు మాడ్చితే ప్రసాదం తిని బతికింది. ఆ పశ్చాత్తాపం నన్ను కాల్చేస్తుంది. చెప్తేనే కాదు చూపిస్తే కూడా ప్రేమ అని మిథున అంది కదా.. మిథునకు నా ప్రేమ చూపిస్తా.. తన కోసం తనతో కలిసి బతకడానికి బతుకుతాను. ఇన్నాళ్లు మిథున నా కోసం పడిన తపనకు చూపించిన ప్రేమకు నేను రుణం తీర్చుకుంటా నా ప్రేమతో.
సూర్యకాంతం పడుకున్న భర్తని లేపి ఇంటి డాక్యుమెంట్స్ కొట్టేయాలని నిద్ర లేపుతుంది. ఇద్దరూ బయటకు వెళ్లే సరికి ఆనంద్ నిద్ర లేచి బయటకు వస్తాడు. ఇద్దరూ దాక్కుంటారు. ఆనంద్ రంగం చేయి తొక్కేస్తాడు. తర్వాత రంగం తల్లిదండ్రుల గదికి వెళ్లి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతూ ఉంటే ప్రమోదిని లేస్తుంది. రంగం బెడ్ కింద దాక్కుంటారు. కాంతం పెట్టెలో దూరిపోతుంది. ఇద్దరూ ఈ రోజు మన టైం బాలేదు మరోసారి ట్రై చేద్దాం అని వెళ్లిపోతారు. ఉదయం దేవా బయటకు వెళ్లి దారిలో మల్లెపూలు చూసి గతంలో మిథున కొనివ్వమని అడగటం గుర్తు చేసుకొని మల్లెపూలు కొంటాడు. మిథున గదిలో ఆలోచిస్తూ ఉంటే దేవా పూలు తీసుకొని వెళ్తాడు. మిథునకు వెళ్లి పువ్వులు ఇవ్వాలి అనుకుంటాడు. చాలా కంగారు పడతాడు. నీ కోసం నేను పువ్వులు తీసుకొచ్చా అని చెప్తాడు.
మిథున చాలా సంతోషపడుతుంది. ఎందుకు తీసుకొచ్చావ్ అని అంటే నీకు పువ్వులు ఇష్టం కదా అందులోనూ నేను ఇస్తే నీకు ఎక్కడి లేని సంతోషం అన్నావ్ కదా అంటాడు. మొక్కు బడిగా ఇస్తాను అంటే కాదు నా మీద ప్రేమ ఉండి అందుకే తీసుకొచ్చావ్ కదా అంతేనా అని అడుగుతుంది. దేవా ఏం చెప్పలేకపోతాడు. నేను అడిగిన కొనివ్వని నువ్వు ఇప్పుడు నువ్వు నీ అంతట తీసుకొచ్చావంటే నా మీద ప్రేమే కదా చెప్పు దేవా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















